For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బెండీ మజ్జిగే హులి(బెండకాయ మజ్జిగ పులుసు)

|

బెండీ మజ్జిగే హులి సారు(బెండకాయ మజ్జిగ పులు)ఇది కర్నాటక స్పెషల్ వెజిటేరియన్ డిష్. చాలా డిఫరెంట్ టేస్ట్ కలిగి ఉంటుంది. మనం రెగ్యులర్ గా తయారుచేసుకొనే బెండకాయ సాంబర్, బెండకాయ మసాలా కంటే ఒక డిఫరెంట్ టేస్ట్ మరియు ఫ్లేవర్, స్ట్రక్చర్ కలిగిన బెండి మజ్జిగే హులి సారు చాలా మంది ఇష్టపడుతారు.

ఈ బెండి మజ్జిగే హులి సారుకు ముఖ్యంగా మనం టమోటో, చింతపండు ఉపయోగిస్తుంటాము. అయితే కొంచెం డిఫరెంట్ గా చిక్కటి పెరుగు ఉపయోగించి తయారుచేసే ఈ బెండీ హులి సారు, క్రీమి స్ట్రక్చర్ కలిగి చాలా అద్భుతంగా రుచికరంగా ఉంటుంది. మరి కర్నాటక స్పెషల్ బెండీ మజ్జిగే హులి సారును ఏవిధంగా తయారుచేయాలో చూద్దాం....

Bhindi Majjige Huli: Karnataka Special

కావల్సిన పదార్థాలు:
కందిపప్పు: 1cup(ఉడికించుకోవాలి)
బెండకాయ: 1/2kg(కొద్దిగా నూనె వేసి వేగించి పెట్టుకోవాలి)
శెనగపప్పు(నానబెట్టుకోవాలి: 4-5tbsp
కొబ్బరి తురుము: 1బౌల్
జీలకర్ర: 2tsp
ఆవాలు: 1tsp
అల్లం: చిన్న ముక్క
కొత్తిమీర: కొద్దిగా
పచ్చిమిర్చి: 10(మీకు రుచికి సరిపడా వేసుకోవచ్చు)
ఇంగువ : చిటికెడు
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 3tbsp
పెరుగు: 1cup

తయారు చేయు విధానం:
1. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో(కందిపప్పు, నూనె, పెరుగు మినహాయించి)మిగిలిన పదార్థాలన్నింటిని అందులో వేసి గ్రైండ్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
2. తర్వాత డీప్ బాటమ్ పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి కొద్దిగా ఇంగువ, ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి.
3. పోపు వేగిన తర్వాత అందులో మిక్సీలో పేస్ట్ చేసుకొన్న పేస్ట్ వేసి, మరో 10నిముషాలు ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొద్దిగా నీళ్ళు పోసి, పచ్చివాసన పోయే వరకూ ఫ్రై చేసుకోవాలి.
4. ఇప్పుడు అందులో ముందుగా నూనెలో ఫ్రై చేసుకొన్న బెండకాయ ముక్కలు, ముందుగా ఉడికించుకొన్న కందిపప్పు, ఉప్పు వేసి, కొద్దిగా నీళ్ళు కూడా పోసి బాగా మిక్స్ చేసి 10-15నిముషాలు ఉడికించుకోవాలి.
5. 15నిముషాల తర్వాత మూత తీసి చేస్తే గ్రేవీ చిక్కబడుతూ ఉడుకుతున్నప్పుడు, కర్రీ పూర్తి అయినట్లే, వెంటనే ఒక బౌల్ పెరుగును అందులో వేసి బాగా మిక్స్ చేసి 5నిముషాలు మాత్రం ఉడికించుకోవాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి . అంతే బెండీ మజ్జిగే హులి రెడీ...

English summary

Bhindi Majjige Huli: Karnataka Special

This recipe for Majjige huli is popular in Karnataka. Lady's finger or okra is cooked with curd and spices.
Story first published: Monday, August 11, 2014, 12:51 [IST]
Desktop Bottom Promotion