For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్రింజాల్ మసాలా ఫ్రై- సౌత్ ఇండియన్ స్పెషల్

|

బ్రింజాల్ మసాలా ఫ్రై (వంకాయ మసాలా వేపుడు)ఒక సులభమైన ఇండియ ఫుడ్. ముఖ్యంగా సౌత్ స్టేట్స్ లో ఎక్కువగా వండుకుంటారు. ముఖ్యంగా ఈ బ్రింజాల్ ఫ్రైకి చాలా తక్కువ మసాలాదినుసులతో తయారుచేస్తారు. కానీ ఇందులో వేరుశెనగపప్పు, పుట్నాల పప్పు వాడకం వల్ల రుచి అద్భుతంగా ఉంటుంది. మీరు ఏదైనా డిఫరెంట్ గా చేయాలనుకొన్నప్పుడు ఇది చాలా టేస్టీగా ఉంటుంది.

వంకాయ మసాలా వేపుడు, చాలా తర్వగా అతి తక్కువ సమయంలో తయారుచేసుకోవచ్చు. వేరే ఏ ఇతర కర్రీ లేకపోయినా కూడా బ్రింజాల్ ఫ్రైతో రైస్ ను ఇష్టంగా తినవచ్చు. మరి మీరు కూడా ఈ కమ్మని వంకాయ మసాల వేపుడు రుచి చూడాలంటే ఎలా తయారుచేయాలో తెలుసుకోండి....

Brinjal Masala Fry- South Indian Special

కావలసిన దినుసులు:
వంకాయులు : 250grms
పళ్ళీలు : 20grms
నూనె : 2tbsp
ఉప్పు : రుచికి సరిపడా
ఉల్లిపాయ - ఒకటి
పుట్నాలపప్పు: 15grm
వెల్లుళ్ళి రెబ్బలు: 4
ఎండుమిరపకాయలు : 5
జీలకర్ర : 1tsp
కారం : 1tsp
పసుపు: చిటికెడు
ధనియపౌడర్ : 1tbsp
మెంతి పొడి : చిటికెడు

తయారుచేయు విధానము:
1. ముందుగా పళ్ళీలు, పుట్నాలపప్పు, ఎండుమిరపకాయలను నూనె లేకుండా వేయించాలి.
2. ఇప్పుడు అందులో జీలకర్ర, వెల్లుళ్ళి రెబ్బలు వేసి బరకగా గ్రైండ్ చేసుకుని ప్రక్కన పెట్టుకోవాలి.
3. వంకాయలను కావలసిన సైజులో కట్ చేసుకుని, ఉప్పు నీటిలో వేసుకోవాలి.
4. తర్వాత పాన్ స్టౌ మీద పెట్టి నూనె వేసుకోని అందులో ఆవాలు, పచ్చిశెనగ పప్పు, కరివేపాకు వేసి, అవి చిట పటలాడిన తరవాత వంకాయ ముక్కలను వేసి మూత పెట్టుకోవాలి.
5. ఐదు నిమషాలు తరవాత పసుపు, ఉప్పు, మెంతి పొడి, కారం, ధనియా పౌడర్, గ్రైండ్ చేసిపెట్టుకున్న పల్లీల పొడి వేసి మరి కొంచెం నూనె వేసి మూత పెట్టుకోవాలి.
6. వంకాయలు బాగా వేగిన తరవాత దించే ముందు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని రెండు నిమషాలు మూత పెట్టి దించుకోవాలి. అంతే! ఎంతో రుచిగా వుండే వంకాయ మసాల వేపుడు రెడీ!

English summary

Brinjal Masala Fry- South Indian Special

Brinjal is considered as the king of vegetables. A spicy baigan masala is simply a lip smacking vegetable recipe with the brinjals which are slit and coated with masalas and then shallow fried.
Story first published: Saturday, March 8, 2014, 12:46 [IST]
Desktop Bottom Promotion