For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బట్టర్ అండ్ క్యాప్సికమ్ రైస్: రుచికరమైనది

|

మన వంటకాల్లో రైస్ ఐటమ్స్ ఎప్పుడు ముందుంటాయి. అందులోనూ చాలా త్వరగా తయారుచేసే రైస్ వంటలు ముందు వరుసలో ఉంటాయి. మన దేశంలో ఏప్రదేశంలో అయినా సరే, రైస్ లేకుండా వారి భోజనం పూర్తి కాదు. అందుకే రైస్ లో కూడా వివిధ వెరైటీ వంటలున్నాయి.

ఈ రోజు మీకోసం ఒక సింపుల్ రైస్ రిసిపిని పరిచయం చేస్తుంది. ఈ వంట యొక్క ప్రత్యేకత, బట్టర్ మరియు క్యాప్సికమ్ తో తయారుచేస్తారు. ఈ రుచికరమైన వంటా చాలా ఘాటైన ఆరోమా సువాస కలిగి ఉంటుంది. అలాగే క్యాప్సికమ్ మరియు జీడిపప్పు మరో ప్రత్యేకమైన రుచిని అంధిస్తుంది. మరి ఈ స్పెషల్ వంటను ఎలా తయారుచేయాలో చూద్దాం..

Butter and Capsicum Rice Recipe

కావల్సిన పదార్థాలు:
రైస్: 2cups (వండి కాని sticky)
కాప్సికమ్: 1(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
పచ్చిమిర్చి పేస్ట్: 1tsp
ఆవాలు: ½tsp
జీలకర్ర: ½ tsp
జీడిపప్పు:1tbsp(పలుకులుగా విడగొట్టి, నెయ్యిలో వేయించుకోవాలి)
బ్లాక్ పెప్పర్ పౌడర్: ½tsp
దాల్చిన: 1చిన్న ముక్క
కొబ్బరి: 1tsp (అవసరం అనుకుంటే)
వెన్న: 1tbsp
నెయ్యి: ½tsp
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా పాన్ లో నెయ్యి మరియు బట్టర్ రెండూ వేసి కరిగించాలి, తర్వాత అందులో జీలకర్ర మరియు ఆవాలు వేసి వేయించుకోవాలి.
2. ఆవాలు చిటపటలాడకా, అందులో దాల్చిన చెక్క మరియు పచ్చిమిర్చి పేస్ట్ వేసి తక్కువ మంట మీద కొన్ని సెకన్లు వేయించుకోవాలి.
3. ఇప్పుడు అందులో కట్ చేసుకొన్న క్యాప్సికమ్ ముక్కలు వేసి మరో 4 నిముషాలు వేయించుకోవాలి. వీటిని ఎక్కువగా వేయించకూడదు. కాప్సికమ్ క్రిస్పీగా ఉండాలి కానీ, మెత్తగా వేయించేయకూడదు.
4. ఇప్పుడు అందులో ఉప్పు, మరియు బ్లాక్ పెప్పర్ పౌడర్ చిలకరించి తక్కువ మంట మీద ఒక నిముషం వేయించుకోవాలి.
5. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకొన్న అన్నం మరియు నెయ్యిలో వేయించి పెట్టుకొన్న నట్స్ ను వేసి బాగా మిక్స్ చేస్తూ ఫ్రై ఒకటి రెండు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
6. చివరగా కొబ్బరి తురుము వేసి బాగా మిక్స్ చేయాలి. అంతే స్టౌ ఆఫ్ చేసేసుకోవాలి.

English summary

Butter and Capsicum Rice Recipe

Rice is one of the staple foods in many cuisines. Take Indian cuisine for example. A meal in many parts of the country is incomplete without rice. That is why there are varieties of rice dishes that are available in the market.
Story first published: Thursday, January 30, 2014, 18:18 [IST]
Desktop Bottom Promotion