For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్యారెట్ ఇడ్లీ: హెల్తీ న్యూట్రిషియన్ బ్రేక్ ఫాస్ట్

|

సాధారణంగా ఇడ్లీ బ్రేక్ ఫాస్ట్ అంటే చాలా మందికి ఇష్టం. ఎందుకంటే నూనె ఉండదు, లోక్యాలరీ అల్పాహారం. ఇడ్లీలో చాలా వెరైటీలున్నాయి. ఈ రోజు కలర్ ఫుల్ క్యారెట్ ఇడ్లీని తయారు చేసుకొందాం. ఇది రుచి మాత్రమే కాదు, ఆరోగ్య కూడా. పచ్చిమిర్చి కొత్తిమీర తరుగు మరియు జీలకర్ర చేర్చడం వల్ల మరింత రుచి. ఇది న్యూట్రీషియన్స్ అందించడంమే కాదు, చూడటానికి కలర్ ఫుల్ గా మరియు మంచి ఫ్లేవర్ తో అద్భుతంగా ఉంటుంది. క్యారెట్ ఇడ్లీకి కొత్తిమీర లేదా పొదీనా తరుగును మీకు ఏది ఇష్ట అయితే అది మిక్స్ చేసుకోవచ్చు.

వేడి వేడి ఇడ్లీని వేడి వేడి సాంబార్ తో సర్వ్ చేస్తే భలే రుచిగా ఉంటుంది. సాంబార్ ఒక్కటే కాదు అల్లం చట్నీ, ముల్లంగి సాంబార్, కొబ్బరి చట్నీ ఇవన్నీ కూడా మంచి కాంబినేషన్ మరి క్యారెట్ ఇడ్లీ ఎలా తయారు చేయాలో చూద్దామా...

kfast

కావల్సిన పదార్థాలు:
ఉద్దిపప్పు: 1 cup (బ్లాక్ గ్రామ్ దాల్)
ఇడ్లీ రవ్వ: 2 cups
ఉప్పు: రుచికి సరిపడా
బేకింగ్ సోడా: చిటికెడు
కొత్తిమీర మిక్స్ కోసం-పేస్ట్ తయారు చేసుకోవడానికి
కొత్తిమీర తరుగు : 1/4 cup
పచ్చిమిర్చి : 2-4
జీలకర్ర పొడి: 1/2 tsp

తయారు చేయు విధానం:
1. ముందుగా ఉద్దిపప్పును 2-3గంటల పాటు నానబెట్టుకోవాలి. ఉద్దిపప్పు పిండితో మిక్స్ చేయడానికి ముందు ఇడ్లీ రవ్వను కూడా విడిగా కొద్దిగా నీళ్ళుపోసి అందులో నానబెట్టుకోవాలి.
2. రెండు గంటల తర్వాత ఉద్దిపప్పులోని నీరు వంపేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
3. ఇడ్లీ రవ్వలోని నీటిని వంపేసి, నీటినంతటినీ పిండేసుకోవాలి. దీన్ని పేస్ట్ చేసుకొన్ని ఉద్దిపప్పు పిండిలో మిక్స్ చేయాలి. చేత్తో బాగా కలుపుకోవాలి.
4. కొద్దిగా ఉప్పు కూడా వేసి బాగా మిక్స్ చేసి రాత్రంతా మూత పెట్టి అలాగే ఉంచాలి. శీతాకాలంలో పిండి పులవడానికి ఎక్కువ సమయంకావాలి. అదే సమ్మర్ లో అంత సమయం అవసరం లేదు 4-5గంటలు పులియబెడితే చాలు.
5. ఇప్పుడు కావల్సినంత పిండి తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు, బేకింగ్ సోడా వేసి బాగా మిక్స్ చేయలి. అలాగే ఇందులోని పేస్ట్ చేసుకొన్న కొత్తిమీర పేస్ట్ ను మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పిండి ఇడ్లీలు చేయడానికి రెడీ.
6. ఇప్పడు ఇడ్లీ ప్లేట్స్ లో కొద్దిగా నూనె రాసి అరచెంచా క్యారెట్ తురుమును మొదట నింపుకోవాలి. దాని మీద ఇడ్లీ పిండి వేసుకోవాలి. తర్వాత పిండి మీద కూడా మరికొంత క్యారెట్ తురుమును సర్దుకోవాలి. తర్వాత ప్లేట్స్ అన్నీ ఇడ్లీ కుక్కర్ లో పెట్టి మూత పెట్టి 10-15నిముషాలు ఆవిరి మీద ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి వేడి వేడి ఇడ్లీని సాంబార్ లేదా చట్నీతో సర్వ్ చేయాలి. అంతే క్యారెట్ ఇడ్లీ రెడీ.

English summary

Carrot Idli: Healthy Breakfast | క్యారెట్ ఇడ్లీ: హెల్తీ న్యూట్రిషియన్ బ్రేక్ ఫాస్ట్

The versatile Idli recipe can take on many avatars. Today’s Carrot Idli features colorful grated carrot along side a spiced herb: y mix of green chilies, coriander leaves and cumin. Apart from providing nutrition Carrot Idli is packed with flavor and visual appeal. You can either used fresh coriander or fresh mint, depending on what you have on hand. I personally like the subtle flavor of fresh coriander.
Story first published: Thursday, April 4, 2013, 8:40 [IST]
Desktop Bottom Promotion