For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పోషకాలు మెండైన క్యారెట్ రైస్ రిసిపి

|

క్యారెట్ తో వివిధ రకాల వంటలు వండుతారు. క్యారట్స్‌లో పోషకాలు పుష్కలం. కంటికి, ఒంటికి మేలు చేసే గుణాలు మెండు. క్యారెట్స్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ మరియు కాలరీలు తక్కువ. క్యారెట్లు కంటికీ, ఒంటికి మాత్రమే కాదు డయాబెటిస్ తో పోరాడుతుంది. ఓరల్ హెల్త్ ను నిర్వహిస్తుంది. గుండె జబ్బులను నివారిస్తుంది. ఇన్ని ఆరోగ్య సుగుణాలున్న క్యారెట్లతో ఇంట్లోనే వివిధ రకాల వెరైటీ వంటకాలను తయారు చేసుకోవచ్చు. క్యారెట్ జ్యూస్, క్యారెట్ మంచూరియా, క్యారెట్ రైస్, క్యారెట్ ఖీర్, ఒకటి కాదు..రెండు కాదు ఇలా చాలానే తయారు చేసుకోవచ్చు!

క్యారెట్ రైస్ తయారు చేయడం చాలా సులభం. ఇది మధ్యహాన్న భోజనానికి చాలా అద్భుతంగా రుచికరంగా ఉంటుంది. అంతే కాదు ఈ క్యారెట్ రైస్ కడుపు నిండుగా ఉంచుతుంది. మరి ఆరోగ్యపరంగా ఇన్న ప్రయోజనాలను చేకూర్చే క్యారెట్ ను రోజూ వంటలోకి ఓ క్యారట్ తురిమి వేయండి. ఇంకో క్యారట్‌ను తరిగి వండండి. నూనెలో వేసి డీప్ ఫ్రై చే యండి. వేయించకుండానే పెరుగులో కలిపేయండి. దేనికది భిన్నమైన టేస్ట్ అంటూ లొట్టలు వేయంచండి.

కావల్సిన పదార్థాలు:
అన్నం: 2 cups(బియ్యాన్ని శుభ్రంగా కడిగి, సరిపడా నీళ్ళు పోసి వండుకోవాలి)
క్యారెట్లు: 4-5 (julienne ఆకారంలో కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయలు: 2 (ముక్కలుగా కట్ చేసుకోవాలి)
కాప్సికమ్ :1 (చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
పచ్చిమిరపకాయలు : 3-4 (మద్యలోకి కట్ చేసి పెట్టుకోవాలి)
వెల్లుల్లి: 3 (తురుము లేదా పేస్ట్ చేసి పెట్టుకోవాలి
అల్లం: చిన్న ముక్క(చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి)
పసుపు: 1tsp
కారం: 1tsp
పులావ్ మసాలా :½tsp
బ్లాక్ మిరియాలు: ½tsp(పొడిచేసుకోవాలి)
జీలకర్ర :½tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 2tbsp
కొత్తిమీర :1tbsp(సన్నగా తరిగిపెట్టుకోవాలి)

తయారుచేయు విధానం:
1. ముందుగా డీప్ బాటమ్ పాన్ లో నూనె వేసి, వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత అందులో జీలకర్ర వేసి చిటపటలాడించాలి.
2. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక నిముషం పాటు మీడియం మంట మీద వేగించుకోవాలి. తర్వాత అందులోనే అల్లం, వెల్లుల్లి, మరియు క్యారెట్ మరియు క్యాస్పికమ్ ముక్కలు, అందులోనే ఉప్పు పసుపు చిలకరించి వేగించుకోవాలి.
3.ఈ మిశ్రమాన్నంతటినీ 5-10నిముషాల పాటు మీడియం మంట మీద వేగించుకోవాలి. కూరగాయ ముక్కలన్నీ మెత్తబడే వరకూ మద్య మద్యలో కలియబెడుతూ వేగించుకోవాలి.
4. ఇప్పుడు అందులోనే మసాలాలు (బ్లాక్ పెప్పర్ పౌడర్, కారం, పులావ్ మసాలా), అలాగే మద్యలోకి కట్ చేసి పెట్టుకొన్న పచ్చిమిర్చి కూడా వేసి బాగా మిక్స్ చేస్తూ వేగించుకోవాలి.
5. మసాలాలతో పాటు వెజిటబుల్ ముక్కలు బాగా వేగి, మీడియంగా లేదా మెత్తగా ఉడికిన తర్వాత అందులో ముందుగా వండిపెట్టుకొన్న అన్నంను నిధానంగా మిక్స్ చేసి చేస్తూ కలియబెట్టాలి. తర్వాత మీడియం మంట మీద ఐదు నిముషాలు అలాగే స్టౌ మీద పెట్టి తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. అంతే తినడానికి క్యారెట్ రైస్ రిసిపి రెడీ. చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి, రైతా లేదా సలాడ్ తో సర్వ్ చేయాలి.

English summary

Carrot Rice Recipe For Lunch | క్యారెట్ రైస్ రిసిపి-హెల్తీ లంచ్

There are many carrot recipes that you can try at home. Carrots are very nutritious and offer numerous health benefits to the overall body. Be it weight loss or for the glowing skin, carrots can be surely added to your diet.
Desktop Bottom Promotion