For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రుచికరమైన శెనగపప్పుకొబ్బరి చట్నీ

|

శెనగపప్పు మన ఇండియన్ కుషన్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. చట్నీలకు ఈ పచ్చిశెనగపప్పును ఉపయోగిస్తే దాని టేస్టే వేరు. శెనగపప్పుతో తయారుచేసే చట్నీలు మన సౌత్ ఇండియన్ స్టేట్స్ లో చాలా పాపులర్.

ఈ చట్నీ తయారుచేయడం చాలా సులభం. ఇది కారంగా ఉండే ఒక సైడ్ డిష్ అని చెప్పవచ్చు. అన్నంకు చాలా కమ్మగా రుచికరంగా ఉంటుంది. మరి ఈ టేస్టీ చట్నీ మీరు కూడా రుచి చూడాలంటే ఒక సారి తయారుచేసి చూడండి...

Chana Dal With Coconut Chutney

కావాల్సిన పదార్థాలు:
శెనగపప్పు: 1/2cup
పచ్చికొబ్బరి తురుము : 1cup
ఎండు మిర్చి: 4-6
టమోటో: 1
కరివేపాకు: కొద్దిగా
నీళ్ళు : సరిపడా
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి, పచ్చిశెనగపప్పు వేసి రెండు, మూడు నిముషాలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి.
2. తర్వాత వాటని ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లారనివ్వాలి.
3. ఇప్పుడు మిక్సీ జార్ లో వేయించుకొన్నశెనగపప్పు, కొబ్బిరి తురుము,పండుమిర్చి, టమోటో, కొద్దిగా కరివేపాకు, నీళ్ళు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
4. చివరగా కొద్దిగా ఉప్పు వేసి, మెత్తగా గ్రైండ్ చేయాలి. అంతే శెనగపప్పు, కొబ్బరి చట్నీ రెడీ.

English summary

Chana Dal With Coconut Chutney


 Chana dal is widely used in the Indian cuisine. From preparing dals to chutneys, chana dal is one of the popular pulses in the Indian dishes. Chana dal ki chutney is very popular in the Southern states of India. The chana dal chutney is very easy to prepare and can be a spicy chutney for any meal.
Story first published: Saturday, February 22, 2014, 17:08 [IST]
Desktop Bottom Promotion