For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుమ్మడి ఘుమఘుమలు గుమ్మడి - శనగల కుర్మా

|

Chana-Pumpkin Korma
గుమ్మడి ఘుమఘుమలు లేని వంటిల్లు ఉంటుందా? గుమ్మడి పండు తగిలించిన తెలుగిల్లు ఉంటుందా?ఇరుగు దిష్టి... పొరుగు దిష్టి... గుమ్మడితో పోతాయి.

గుమ్మడితో చేసిన వంటకాలు తినండి...కడుపులో కూడా దిష్టి పోయి హాయిగా ఉంటుంది. ఇంటికీ, ఒంటికీ మంచి చేసే గుమ్మడి ఎప్పుడు వండుకుంటే అప్పుడే పండగ! గుమ్మడికాయ లాంటి మీ ‘ఫ్యామిలీ' కోసం ఈ రోజు ఘుమ్మడి ట్రీట్ తో ఎంజాయ్ చేయండి!!

కావలసిన పదార్థాలు:
పెద్ద శనగలు: 1small cup
మీల్ మేకర్:1cup
దాల్చినచెక్క, లవంగాలు, గసగసాలు: 2tsp
పచ్చికొబ్బరి తురుము: 3tbsp
నూనె : 5tsp
పోపు దినుసులు: 2tsp
పసుపు : చిటికెడు
టొమాటో ప్యూరీ: 1/2 cup
గుమ్మడిముక్కలు: 1cup
ఉప్పు: రుచికి తగినంత
కారం: తగినంత
గరం మసాలా: 2tsp
పల్లీ, నువ్వులపొడి: 3tsp
పచ్చిమిర్చి తరుగు: 2tsp
కొత్తిమీర, మెంతి తరుగు: 4tsp

తయారు చేయు విధానం:
1. ముందుగా పెద్దశనగలు ఉడికించి పక్కనుంచాలి.
2. తర్వాత మీల్ మేకర్లో వేడి నీరుపోసి పక్కనుంచాలి.
3. ఇప్పుడు దాల్చినచెక్క, లవంగాలు, గసగసాలు, పచ్చికొబ్బరి తురుము (సగం మాత్రమే) వీటన్నిటినీ మిక్సీలో వేసి పేస్ట్‌లా చేయాలి.
3. తర్వాత స్టౌ మీద పాన్ లో నూనె వేసి కాగాక పోపు దినుసులు వేసి వేయించాలి.
4. తరవాత అందులోనే పసుపు, ఉల్లిపాయ పేస్ట్, టొమాటో ప్యూరీ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించాక, గుమ్మడికాయ ముక్కలు, ఉడికించిన శనగలు, వేడినీటి నుంచి తీసిన మీల్మేకర్‌లను ఇందులో వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి.
5. బాగాఉడికిన తరవాత ఉప్పు, కారం, గరం మసాలా, పల్లీపొడి, నువ్వులపొడి, పచ్చిమిర్చి తరుగు వేసి మరి కాస్త మగ్గినతరువాత ముందుగా తయారుచేసుకున్న కొబ్బరిపేస్ట్, కొద్దిగా నీరు పోసి మూత పెట్టాలి. కూర గ్రేవాలా తయారైన తరవాత మూత తీసి మిగిలిన కొబ్బరి తురుము కూడా వేసి కాసేపు ఉంచి స్టవ్ మీద నుంచి దించి కొత్తిమీర, మెంతికూరలతో గార్నిష్ చేయాలి. అంతే గుమ్మడి శెనగల కుర్మా రెడీ..

English summary

Chana-Pumpkin Korma | గుమ్మడి - శనగల కుర్మా


 Chana Kurma is a delicious restaurant-style dish you'll love. Made with chickpeas and mixed vegetables, this spicy gravy curry tickles your palate.
Story first published:Friday, May 17, 2013, 12:01 [IST]
Desktop Bottom Promotion