For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చట్ పాట్ మసాలా బెండీ ఫ్రై రిసిపి

|

సహజంగా వెజిటేబుల్స్ తో వివిధ రకాల వెరైటీ వంటలను తయారు చేస్తుంటారు. అయితే వంకాయ్ టమాట.. పాలక్ దాల్.. బీరకాయ పెసరపప్పు.. ఇట్లా ఎప్పుడూ ఒకే టైప్ కాంబినేషన్స్ తినడానికే కాదు.. వండడానికి కూడా బోర్! మరందుకే వండడానికే కాదు, తినడానికీ కొత్త కాంబినేషన్స్‌తో చట్పాట్ బెండీ కర్రీ తయారు చేయవచ్చు.

బెండకాయతో వివిధ రకాల వంటలు తయారు చేస్తుంటారు. ఈ రిసిపిలు సౌత్ ఇండియాలో ఎక్కువగా వండుతుంటారు. ఈ బెండకాయ ఫ్రై ను రెగ్యులర్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా కార్న్ పౌడర్ తో తయారుచేసుకుంటే చాలా డిఫరెంట్ టేస్ట్ తో క్రిస్పీగా ఉంటుంది. రుచి మరియు మంచి ఫ్లేవర్ తో అద్భుతంగా ఉంటుంది. ఇందులో ఇండియన్ మసలా దినుసులు వేయడం వల్ల మంచి రుతితో పాటు, వాసన కూడా అద్భుతంగా ఉంటుంది. దీన్ని వేడి వేడి అన్నం, మరియు చపాతీలకు మంచి కాంబినేషన్. మరి చట్ పాట్ బెండీ మాసాలాను ఎలా తయారుచేయాలో చూద్దాం...

Chatpata Masala Bhindi Fry Recipe

బెండకాయ: 10 (శుభ్రంగా కట్ చేసి మద్యలోకి స్లిట్ చేసి రెండుగా కట్ చేసుకోవాలి)
కారం: 1/2tsp
కార్న్ ఫ్లోర్ : 1tbsp
ఆమ్చూర్ పౌడర్ (డ్రై మ్యాంగో పౌడర్): 1tbsp
ఉల్లిపాయలు: 1+1 (సన్నగా కట్ చేసుకోవాలి మరియు పేస్ట్ చేసుకోవాలి)
వెల్లుల్లి రెబ్బలు: 5
పచ్చిమిర్చి: 2
టమోటోలు: 1(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
గరం మసాల: 1tsp
నూనె: తగినంత
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా శుభ్రం చేసి కట్ చేసి పెట్టుొకన్న బెండకాయ ముక్కలకు కారం, ఆమ్య్చూర్ పౌడర్ మరియు ఉప్పు వేసి మిక్స్ చేసి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి.
2. తర్వాత డీప్ బాటమ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. వేడి అయిన తర్వత మ్యారినేట్ చేసి పెట్టుకొన్న బెండకాయముక్కలకు కార్న్ ఫ్లోర్ పొడిని చిలకరించి ఇప్పుడు వాటిని తీసి కాగే నూనెలో వేసి ఫ్రై చేయాలి.
3. మంటను మీడియంలో పెట్టి మద్యలో కలియబెడుతూ ఫ్రై చేసుకోవాలి.
4. అంతలోపు ఉల్లిపాయ, వెల్లుల్లి రెబ్వలు మరియు పచ్చిమిర్చి మిక్సీ జార్ లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
5. కార్న్ ఫ్లోర్ బెండకాయ ముక్కలను క్రిస్పీగా మార్చుతుంది. బెండకాయలు నూనెలో బాగా వేగి క్రిస్పీగా కనబడినప్పుడు వాటిని నూనెలో నుండి తీసు వేరొక గిన్నెలో వేసుకోవాలి.
6. పాన్ లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి మరో 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు గోల్డ్ బ్రౌన్ కలర్లోకి మారిగానే మిక్సీలో పేస్ట్ చేసుకొన్ని ఉల్లి, పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్ ను వేగుతున్న పాన్ లో వేసి మిక్స్ చేస్తూ వేగించుకోవాలి.
7. రెండు నిముషాలు వేగిన తర్వాత అందులో టమోటో ముక్కలు వేసి, ఉప్పు చిలకరించి, డ్రై మ్యాంగో పౌడర్ మరియు గరం మసాలను చిలకరించి ఫ్రై చేసుకోవాలి.
8. మరో 5 నిముషాలు ఫ్రై చేసుకోవాలి. గ్రేవీ చిక్కబడి, నూనె పైక తేలితున్నట్లు అనిపిస్తే, అప్పుడు ముందుగా ఫ్రై చేసుకొన్న బెండకాయ ముక్కలను అందులో వేసి బాగా మిక్స్ చేయాలి.
9. బెండకాయలకు మసాలా బాగా పట్టి ఫ్రై అయ్యే వరకూ ఉండి చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.

English summary

Chatpata Masala Bhindi Fry Recipe

As the adjective 'chatpata' suggests, masala bhindi fry is a sweet-sour-spicy recipe. However, if you cannot take too much of spices, reduce the number of chillies in the masala bhindi fry. You can still add the dry mango powder and garam masala to make this okra recipe tangy.
Story first published: Friday, May 29, 2015, 13:59 [IST]
Desktop Bottom Promotion