For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చెన్నైస్టైల్ సాంబార్ రిసిపి

|

సాంబార్ సౌత్ ఇండియన్ స్పెషల్ వెజిటేరియన్ రిసిపి. సౌత్ ఇండియాలో ఈ సాంబార్ రిసిపిని ఒక్కో స్టేట్ లో ఒక్కో రకంగా డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. రుచికి కూడా వేటికవే సాటి. ఈ క్లాసిక్ డిష్ ను పప్పు, తాజా వెజిటేబుల్స్ ఉపయోగించి తయారుచేస్తారు. ఈ సాంబార్ రిసిపి ఉదయం బ్రేక్ పాస్ట్ ఇడ్లీ, దోస కాంబినేషన్ కు మద్యహ్నానం రైస్ కాంబినేషన్, డిన్నర్ ఇలా ఒక రోజులో అన్ని సమయాలకు బాగా నప్పుతుంది.

అయితే, చెన్న సాంబార్ చాలా డిఫరెంట్ గా టేస్టీగా ఉంటుంది.ఈ వంటలకు ప్రత్యేకంగా సాంబార్ పేస్ట్ ను తయారుచేసుకొని వండుతారు. మరి మీరు కూడా ఈ చెన్నై స్పెషల్ సాంబార్ రిసిపి టేస్ట్ చేయాలంటే...ఒక సారి ట్రై చేయండి...

Chennai Style Sambar Recipe
కావలసినవి:
ఎర్ర కందిపప్పు: 1cup
మునగకాడ: 2(ముక్కలుగా కట్ చేయాలి)
చిన్న వంకాయలు: 5(పొడవుగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి)
టొమాటో తరుగు: 1/2cup
పచ్చిమిర్చి: 4 (నిలువుగా కట్ చేసుకోవాలి)
కొత్తిమీర తరుగు: 2tbsp
ఉప్పు: రుచికి తగినంత
చింతపండు: కొద్దిగా (నానబెట్టి రసం తీయాలి)

పేస్ట్ కోసం:
పుట్నాలపప్పు: 2tbsp
టొమాటో: 1 (పెద్దది)
కొబ్బరితురుము: టేబుల్ స్పూను
సాంబారు పొడి: 4tsp
ఇంగువ: 1/4tsp
ఆవాలు: 1/2tsp
జీలకర్ర: 1/2tsp
మినప్పప్పు: 1/2tsp
ఎండుమిర్చి - 1
కరివేపాకు: రెండు రెమ్మలు

తయారు చేయు విధానం:
1. ముందుగా ఎర్ర కందిపప్పును శుభ్రంగా కడిగి తగినంత నీరు పోసి కుక్కర్‌లో ఉంచి రెండు, మూడు విజిల్స్ వచ్చాక దించి, చల్లారాక, పప్పు గుత్తితో మెత్తగా పాముకోవాలి.
2. తర్వాత మిక్సీలో పుట్నాలపప్పు, టొమాటో, కొబ్బరి తురుము, సాంబారు పొడి, ఇంగువ వేసి మెత్తగా పేస్ట్ చేస్తే సాంబార్ మసాలా రెడీ అవుతుంది.
3. ఇప్పుడు ఒక గిన్నెలో పామి పెట్టుకొన్నపప్పు, నాలుగు కప్పుల నీరు, కూరముక్కలు, టొమాటో, పచ్చిమిర్చి వేసి ఉడికించాలి.అలాగే చింతపండు పులుసు వేసి మరిగించాలి.
4. బాగా మరిగాక, మెత్తగా చేసి ఉంచుకున్న సాంబార్ మసాలా వేసి బాగా కలిపి ఐదునిముషాలు ఉంచాలి.
5. తర్వాత మరో పాన్ తీసుకొని అందులో నూనె వేసి, కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి.
6. మధ్యలోకి నాలుగు ముక్కలుగా తరిగి ఉంచుకున్న వంకాయలను జత చేసి వేయించాలి. ఉడుకుతున్న సాంబారులో వేసి, బాగా మరిగిన తరవాత దించేయాలి. అంతే చెన్నై స్టైల్ సాంబర్ రెడీ

English summary

Chennai Style Sambar Recipe

Sambar is the most famous dish in South India, recently the delicacy is spreading all over India. Sambar can be mixed with rice for lunch and dinner or had with Idly, Dosa, Poori. Sambar is a very ancient south Indian recipe.It is a dal based vegetable stew,served usually with rice in both formal and everyday south Indian cuisine.
Story first published: Friday, April 11, 2014, 12:08 [IST]
Desktop Bottom Promotion