For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చికెన్ మసాలా రైస్ : వీకెండ్ స్పెషల్

|

సాధారణంగా మనకు ఇష్టమైన వంటలు కొన్ని ప్రత్యేకంగా ఉంటాయి. వాటిని మళ్ళీ మళ్ళీ తయారు చేయడానికి విసుగు అనిపించదు. ఎందుకంటే వాటి రుచి అంత అద్భుతంగా ఉంటాయి కాబట్టి. అలాంటి వాటిలో కుటుంబ సభ్యులు, స్నేహితులు అమితంగా ఇష్టపడే వంట స్పైసీ చికెన్ మసాలా రైస్.

చికెన్ తో రైస్ అంటే ఫ్రైడ్ రైస్ ఎక్కువ చేస్తుంటాము. దీన్నే చైనీస్ పద్ధతిలో కాకుండా చేసుకోవచ్చు. చికెన్, ఎగ్స్ ,పుదీనా,కొత్తిమీర అన్నీ ఉండడంతో స్పైసీ ఫ్లేవర్స్ తో అందరూ చాలా ఇష్టపడతారు. ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది. ఇది ఇండియన్ ఫ్రైడ్ రైస్ అన్నమాట. ఇది చూడటానికి, తినడానికి రెస్టారెంట్ వంటాల అనిపిస్తుంది కానీ రెస్టారెట్ ఐటమ్ మాత్రం కాదు. మనమే ఇంట్లో స్వయంగా చేసుకొనే ఈ చికెన్ రైస్ రిసిపి చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం....

Chicken Masala Rice : Weekend Special

కావలసిన పదార్ధాలు:

చికెన్: 1cup
ఎగ్స్: 2
అన్నం: 2cups
పుదీనా : 1/2 cup
కొత్తిమీర: 1/2 cup
ఉల్లిపాయ: 1
పచ్చిమిర్చి: 2
టమాటా: 1
కరివేపాకు : ఒక రెమ్మ
ఉప్పు,కారం: తగినంత
పసుపు: కొంచెం
నూనె: 2tbsp
అల్లంవెల్లుల్లి పేస్ట్ : 1tsp
గరం మసాలా పొడి: 1tsp
పోపుకోసం
లవంగాలు: 2
దాల్చినచెక్క :చిన్న ముక్క
షాజీర: కొద్దిగా

తయారు చేసే విధానం:

1. చికెన్ ను చిటికెడు,ఉప్పు,కారం,వేసి ఉడికించి బోన్స్ తీసేసి సన్నగా కోసి ఉంచుకోవాలి.
2. ఒక టీస్పూన్ నూనె వేడిచేసి అందులో ఎగ్స్ బ్రేక్ చేసి పొడిపొడిగా ఉడికించి తీసుకోవాలి.
3. నూనె వేడిచేసి లవంగాలు,చెక్క,షాజీర వేసి సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి వేసి దోరగా వేయించాలి.
4. ఇప్పుడు కరివేపాకు, తరిగిన టమాటాముక్కలు వేయాలి. టమాటా మగ్గిన తరువాత సన్నగా తరిగిన పుదీనా,కొత్తిమీర వేసి వేయించాలి.
5. ఇప్పుడు అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేగాక ఉడికించిన చికెన్ ముక్కలు,ఎగ్స్ వేసి కారం,పసుపు వేసి కలిపి రెండు నిముషాలు వేయించాలి.
6. చివరగా అన్నం,తగినంత ఉప్పు,గరంమసాలాపొడి వేసి సన్నని సెగపై అంతా బాగా కలిసేలా కలుపుతూ వేయించాలి.
7. కొంచెం కొత్తిమీర చల్లి వేడిగా వడ్డిస్తే చికెన్ మసాలా రైస్ నోరూరిస్తుంది.ఇష్టం ఉంటే ఇంకా ఇందులో ఉడికించిన ప్రాన్స్,కీమా లేదా మటన్ వేసి మిక్స్ డ్ రైస్ కూడా చేసుకోవచ్చు.

English summary

Chicken Masala Rice : Weekend Special

There are certain recipes which always remain our favorites and we can never be tired of cooking them over and over again. One such favorite recipe that I cook often and is enjoyed by my family and friends is the Spicy Chicken Masala Curry. Its better than any restaurant recipe.
Story first published: Saturday, April 19, 2014, 12:24 [IST]
Desktop Bottom Promotion