For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిల్లీ గార్లిక్ ఫ్రైడ్ రైస్-చైనీస్ స్టైల్

|

చాలా మంది ఇండియన్స్ చైనీస్ ఫుడ్ ను ఇష్టపడుతారు. కాబట్టి చైనీస్ వంటకాలు మరింత రుచికరంగా ఉండేలా చేసే సోయాసాస్ మరియు అజినామాటోను మన ఇల్లలో నిల్వ చేసుకొన్నట్లైతే మనకు ఎప్పుడు కావాలో అప్పుడు మనకు నచ్చిన ఆహారాలను వెరైటీలను తయారు చేసుకోవచ్చు. చిల్లీ గార్లిక్ ఫ్రైడ్ రైస్ ఇది చైనీస్ వంటకం.

దీనికి మరే ఇతర మసాలా దినుసులు లేకుండానే అద్భుతమైన రుచిని, వాసను చూడవచ్చు. మాంసాహార ప్రియులు ఇందులో చికెన్ ముక్కలను కూడా కలుపుకోవచ్చు. అద్బుతంగా ఉంటుంది. కాబట్టీ చైనీస్ స్టైల్లో చిల్లీ గార్లిక్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం...

Chilli Garlic Fried Rice: Authentic Chinese Style
బియ్యం: 2cups(soaked and washed)
చిన్న ఉల్లిపాయలు: 4(chopped)
ఉల్లిపాయ కాడలు(ఉల్లికాడలు పచ్చనివి): 1 cup(chopped)
వెల్లుల్లి రెబ్బలు: 10(chopped)
పచ్చిమిర్చి: 6-8(chopped)
క్యాప్సికమ్: 1/2(sliced)
సోయా సాస్: 2tsp
అజినామోటొ: 1/2 tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 1tbsp

తయారు చేయు విధానం:
1. ముందుగా డీప్ బాటమ్ పాన్ లో నూనె వేసి, కాగిన తర్వాత అందులో చిన్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి.
2. తర్వాత మీడియం మంట మీద వేయిస్తూ అందులోనే వెల్లుల్లి రెబ్బలు వేసి మరో రెండు నిముషాల పాటు వేయించాలి.
3. మంట తగ్గించి పచ్చని ఉల్లికాడ ముక్కలు , క్యాప్సికమ్ ముక్కలు వేసి వేగిస్తూ అందులోనే ఉప్ప మరియు అజినామోటో చిలకరించి వేగించాలి.
4. ఇలా 5-10నిముషాల పాటలు వేగించుకోవాలి. తర్వాత అందులో సోయా సాస్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇది మిగతా మిశ్రమంతో బాగా కలిసేలా చేసి మంట తక్కువ చేసి వేగించుకోవాలి.
5. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని శుభ్రం చేసి పెట్టుకొన్న బియ్యంలో వేసి అంతటినీ బాగా కలగలిసేలా స్పూన్ తో కలుపుకోవాలి. ఇలా కలుపుకొన్న తర్వాత తగినన్ని నీళ్ళు పోసి మూత పెట్టి 5-10నిముషాల పాటు ఉడికించుకోవాలి. అంతే వేడి వేడి గార్లిక్ ఫ్రైడ్ రైస్ సర్వ్ చేయడానికి రెడీ.

English summary

Chilli Garlic Fried Rice: Authentic Chinese Style | స్పైసీ చిల్లీ గార్లిక్ ఫ్రైడ్ రైస్

Most Indian have a fetish for Chinese food. We dutifully stock up Chinese grass and soy sauce in our homes to try out different Chinese recipes. That is why we bring a very common yet absolutely drool-worthy fried rice recipe to you. Chilli garlic fried rice is obviously a Chinese recipe. However, the good part is that you don't need very specific oriental spices to make chilli garlic fried rice.
Story first published: Monday, January 28, 2013, 17:50 [IST]
Desktop Bottom Promotion