For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పైసీ అండ్ టేస్టీ చైనీస్ ఫ్రైడ్ రైస్ విత్ సోయా సాస్

|

చైనీస్ వంటలంటే ప్రపంచ వ్యాప్తంగా అందరికీ నోరూరించే వంటలు. ఉదా: నూడుల్స్, మమూస్, రోల్స్ మరియు ఫ్రైడ్ రైస్. చైనీస్ వంటకాలంటే చాలా స్పెషల్ గా ఉంటాయి. అంతే కాదు, టేస్టీ కూడా, ఉదా: మీరు డైట్ లో ఉంటే కనుక స్టీమ్ చేసిన మమ్స్ (వెజ్ లేదా నాన్ వెజ్)రెండూ తీనవచ్చు . అదే విధంగా, ఆహారం విషయంలో స్పైసీ ఫుడ్స్ మంచూరియన్స్ లేదా సోయాసాస్ తో తయారు చేసి వంటలు చాలా అద్భుతంగా ఉంటాయి.

చైనీస్ ఫుడ్స్ లో సోయా సాస్ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. నూడుల్స్, మంచూరియన్స్, స్నాక్స్ మరియు ఫ్రైడ్ రైస్ వీటిన్నింటిని మించి సోయా సాస్ అద్భుతమైన రుచిని అంధిస్తాయి. సోయాసాస్ వేయడం వల్ల ఆ వంటకు డార్క్ బ్రౌన్ కలర్ కలవడం మాత్రమే కాదు, సువాసనను మరియు అద్భతమైన రుచిని కూడా ఇస్తుంది మరి, ఈ పాపులర్ చైనీస్ ఫ్రైడ్ రైస్ విత్ సోయా సాస్ ఎలా తయారు చేయాలో చూద్దాం..

Chinese Fried Rice

కావల్సిన పదార్థాలు:
బియ్యం: 1-2cups(అన్నం వండుకోవాలి)
ఉల్లిపాయలు: 2-3(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
క్యాప్సికమ్: 1(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
క్యారెట్: 1(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
బీన్స్: 8-10(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
పచ్చిమిర్చి: 4(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
సోయా సాస్: 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా
అజినామోటో: చిటికెడు
నూనె: సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా డీప్ బాటమ్ పాన్ లో నూనె వేసి వేడి చేసుకోవాలి. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించుకోవాలి.
2. ఇప్పుడు అందులో ఇతర కూరగాయలు క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్ మరియు పచ్చిమర్చి ముక్కలు అన్నింటిని వేసి బాగా వేగించుకోవాలి. మీడియం మంట మీద మిక్స్ చేస్తూ 10 నిముషాలు వేగించుకోవాలి.
3. తర్వాత ఉప్పు చిలకరించి తర్వాత సోయాసాస్ కూడా వేసి, బాగా మిక్స్ చేయాలి. తర్వాత మరో 5నిముషాలు వేగించుకోవాలి.
4. ఇప్పుడు ముందుగా వండి పెట్టుకొన్న అన్నం కూడా వేసి మిక్స్ చేయాలి. వెజిటేబుల్స్ మరియు సాస్ రెండూ బాగా మిక్స్ అవుతుండగా మరో 2-3నిముషాలు అలాగే ఫ్రై చేసుకోవాలి. అంతే చైనీస్ ఫ్రైడ్ రైస్ రెడీ. దీన్ని మంచూరియన్ గ్రేవీతో సర్వ్ చేయాలి.

English summary

Chinese Fried Rice With Soy Sauce

Chinese cuisine is popular worldwide for its lip smacking dishes. Be it the noodles, momos, rolls or fried rice, Chinese cuisine has something for every kind of foodie. For example, if you are on a diet, you can have steamed momos (veg or non-veg).
Story first published: Tuesday, August 13, 2013, 13:18 [IST]
Desktop Bottom Promotion