For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శెనగల పాఠోళీ: వరలక్ష్మి స్పెషల్

|

రావణ మాసం మొదలైందంటే చాలు పండగలు, నోములు, వ్రతాలు.. ప్రసాదాలు.. అందరూ బిజీ . బిజీ.. ఒక్కోక్కో పండగకి ఒక్కో నైవేద్య చేసి దేవుళ్ళకు నైవేద్యాలు సమర్పిస్తారు. వచ్చిన అతిథులకు కు అందిస్తారు. మరి ఈ శ్రావణ మాసంలో జరుపుకోనే మహిళలకు అతి ముఖ్యమైన పండుగ వరలక్ష్మీ వత్రం. ఈ పండుగ పర్వదినానా మహాలక్ష్మికి ఇష్టమైన తీపి రుచులతో, పిండి వంటలు కూడా చేసి నైవేద్యం సమర్పిస్తారు.

లక్ష్మీదేవి ప్రసన్నం కావాలంటే ఏదో ఒక స్పెషల్ ఉండాల్సిందే! వరాలు ఇచ్చే తల్లి అంత సులువుగా కనికరిస్తుందా? ఆమెకు ప్రియమైనవి చేయాలి. నైవేద్యం పెట్టాలి. అమ్మా తల్లీ అనాలి. ఆమె ఓకే అన్నాక మనమూ ఒక స్పూను నోట్లో వేసుకోవాలి. వాహ్. ఏమి రుచి. శనగల చపాతీ... శనగల పాయసం... శనగల పులుసు...వాటే టేస్టు. అన్నట్టు శనగల పదార్థాలు హెల్తుకు కూడా మంచివట.
వాతానికి వాత అట. వంటికి చలువ అట. ఆకలి రేగునట. మరి ఈ ఛాన్స్‌ను మనం ఎందుకు వదులుకోవాలి?ఈ వరలక్ష్మీవ్రతం పర్వదినాన శనగలు తెండి. వండండి. వరాలు పొందండి.

Chole Patoli: Varalakshmi Special

కావలసిన పదార్థాలు:
శనగలు : 150grm
పచ్చిమిర్చి : 3
పచ్చిమిర్చితరుగు :3tbsp
ఉల్లిపాయ : 1
ఉల్లితరుగు : 1/2cup
ఉప్పు : తగినంత
జీలకర్ర : 1tsp
నూనె : సరిపడా
కరివేపాకు : నాలుగు రెమ్మలు
ఆవాలు : 1tsp
శనగపప్పు : 1tsp
మినప్పప్పు : 1tsp
అల్లం ముక్క : చిన్నది
అల్లం తురుము : 1tsp
ఎండుమిర్చి : 6

తయారు చేయు విధానం:
1. ముందుగా శనగలను ఒకరోజు రాత్రంతా నానబెట్టాలి. నానిన శనగలను శుభ్రంగా కడిగి నీరు తీసేసి మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. (మరీ మెత్తగా రుబ్బకూడదు). రుబ్బుతున్నప్పుడే అందులో జీలకర్ర, ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయ వేయాలి.
2. తరవాత ఒక పాన్ లో నూనె వేసి కాగాక అందులో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చితరుగు, అల్లంతురుము, కరివేపాకు ఒకదాని తరవాత ఒకటి వేస్తూ వేయించాలి.
3. వేగుతుండగానే ఉల్లి తరుగు వేసి కొద్దికొద్దిగా వేయిస్తూ, రుబ్బి ఉంచుకున్న ముద్దను వేసి అన్నీ బాగా కటిపి మూత పెట్టాలి. మంట బాగా తగ్గించాలి. మధ్యమధ్యలో కలుపుతూ కొద్దికొద్దిగా నూనె వేస్తూండాలి. (దీనికి నూనె ఎక్కువ అవసరం అవుతుంది). సుమారు అరగంట ఈ మిశ్రమం విడివిడిలాడినట్లుగా అవుతుంది. అప్పుడు దింపేయాలి. ఇది అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది.

English summary

Chole Patoli: Varalakshmi Special


 The Varamahalakshmi puja is usually observed by married women in regions of Tamil Nadu, Karnataka, Andhra Pradesh and other parts of South India. The Varamahalakshmi puja for the year 2014 will be celebrated on August 8. It is said that the Goddess Lakshmi who is the God of wealth and prosperity, is worshiped on this auspicious day.
Story first published: Thursday, August 7, 2014, 17:37 [IST]
Desktop Bottom Promotion