For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కోకోనట్ దాల్ రిసిపి-వెజిటేరియన్ స్పెషల్

|

దాల్ రుచికి మీకు నచ్చినట్లైతే, అప్పుడు ఇది మీకు ఒక బెస్ట్ రిసిపి. ఇది నిజంగా వెజిటేరియన్స్ కు చాలా రుచికరంగా ఉంటుంది. కోకోనట్ మిల్క్ జోడించడం వల్ల ఈ వంటకు అద్భుతమైన రుచి, మరియు క్రీమ్ గా చిక్కగా ఉంటుంది.

ఈ కోకోనట్ దాల్ రిసిపికి మరికొన్ని ఇండియన్ మసాలా దినుసులు జోడించడం వల్ల టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇంకా ఈ దాల్ కు ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే బీరకాయన్ చేర్చడం వల్ల అదనపు రుచితో పాటు, ఆరోగ్యకరమైన గ్రీన్ వెజిటేబుల్ ను ఇందులో చేర్చడం వల్ల మరింత టేస్టీగా, ఉంటుంది. మరి ఈ స్పెషల్ వెజిటేరియన్ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం..

Coconut Dal Recipe For Vegetarians

కావల్సిన పదార్థాలు:
మసూర్ దాల్(ఎర్రకందిపప్పు): 2tbsp
వేరుశెనగనూనె: 2tbsp
ఉల్లిపాయ: 1(చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
వెల్లుల్లి మరియు లవంగం: 4 (పేస్ట్ చేసుకోవాలి)
అల్లం: చిన్నముక్క(పేస్ట్ చేసుకోవాలి)
జీలకర్ర పొడి : 2 tsp
పసుపు : 2 tsp
కొబ్బరి పాలు: 400 ml
కూరగాయల స్టాక్: 400 ml
టొమాటోస్ : 4 (మొత్తం)
Turai / రిడ్జ్ గార్డ్(బీరకాయ): 1 (ముక్కలుచేసుకోవాలి)
నిమ్మ రసం : 2 tsp
ధనియాల: 3tbsp(తరిగినవి)
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా పాన్ లో కొద్దిగా వేరుశెనగ నూనె వేసి వేడిచేయాలి. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు మరియు లవంగాలు రెండు మూడు వేసి ఫ్రై చేసుకోవాలి.
2. మరో బౌల్ తీసుకొని, అందులో మసూర్ దాల్ (ఎర్ర కందిపప్పు)వేసి, సరిపడా నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి.
3. తర్వాత ఉల్లిపాయ, లవంగాలు వేగుతున్న పాన్ లో అల్లం, వెల్లుల్లి, జీలకర్ర మరియు పసుపు వేసి, మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
4. పోపు మొత్త బాగా ఫ్రై యిన తర్వతా అందులో ముందుగా నానబెట్టుకొన్న మసూర్ దాల్ (నీరు లేకుండా పూర్తిగా వంపేసి) వేయాల. ఇవి కూడా ఒక నిముషం వేగించి, తర్వాత అందలో కోకోనట్ మిల్క్, వెజిటేబుల్ స్టాక్ కూడా వేసి, బాగా మిక్స్ చేయాలి. అలాగే కొద్దిగా నీళ్ళు కూడా వేసి బాగా మిక్స్ చేసి బాయిల్ చేయాలి.
5. తర్వాత మొత్తం మిశ్రమం బాగా ఉడికించాలి. మీడియం మంట పెట్టి, మూత పెట్టి ఉడికించుకోవాలి.
6. మద్యలో ఒక సారి మూత తీసి స్పూన్ తో కలియబెట్టి, తర్వాత అందులో టమోటో ముక్కలు కూడా వేసి, ఉడికించుకోవాలి. అలాగే కొద్దిగా నిమ్మరసం కూడా మిక్స్ చేసి, మరో 5నిముషాలు ఉడికించుకోవాలి.
7. తర్వాత అందులో బీరకాయ ముక్కలు కూడా వేసి, మెత్తగా ఉడకించుకోవాలి.
8. ఇప్పుడు పప్పు, బీరకాయ ముక్కలు మెత్తగా ఉడికి, కర్రీ చిక్కబడే సమయం చూసి, స్టౌ ఆఫ్ చేయాలి. చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి, క్రిందికి దింపుకొని సర్వ్ చేయాలి. అంతే క్రీమీ కోకనట్ దాల్ రిసిపి చాలా రుచికరంగా ఉంటుంది. దీన్ని మధ్యాహ్నం గీ రైస్ తో తింటే చాలా రుచిగా ఉంటుంది.

English summary

Coconut Dal Recipe For Vegetarians

If you love the taste of dal, then this is one of the very best recipes for you to try out this afternoon. A truly sensational delight for vegetarians is this Coconut dal recipe which you will definitely love since it is not only creamy but tasty too.
Story first published: Saturday, December 21, 2013, 12:38 [IST]
Desktop Bottom Promotion