For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శెనగల పులావ్ : స్పెషల్ రిసిపి

|

మన ఇండియాలో వంటలకు చిరుదాన్యాలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అటువంటి ధాన్యాలలో చిక్ పీస్(శెనగలు)కూడా ఒకటి. ముఖ్యంగా నార్త్ సైడ్ ఎక్కువగా వీటి వాడకం ఉంటుంది. అలాగే సౌత్ లో కూడా చాలా సాధారణంగా వీటిని ఉపయోగిస్తుంటరు.

ఈ రుచికరమైన చిక్ పీస్ వంటలంటే పిల్లలకు చాలా ఇష్టం. పెద్దల కంటే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. మరి ఈ రుచికరమైన చిక్ పీస్ తో తయారుచేసే పలావ్ ను మీరు కూడా టేస్ట్ చూడాలంటే, మీరు కూడా ఒక సారి ట్రై చేయండి...

Colourful Chickpeas Pulav Recipe
కావల్సిన పదార్థాలు:
రైస్- 1cup
చిక్పీస్(శెనగలు) - 25gms
టొమాటోస్ - 2 (చిన్న ముక్కలుగా తరిగినవి)
బంగాళాదుంప - 1 (ఉడికించినవి)
ఆకుకూర - 1 రెమ్మ (తరిగిన)
కాప్సికం - 1 (ముక్కలుగా కట్ చేసుకోవాలి)
నూనె - 2tbsp
జీలకర్ర - 1tsp
హింగ్(ఇంగువ) - ½tsp
అల్లం- 1tbsp
పచ్చిమిర్చి- 2(ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పసుపు - 1tsp
డ్రై మ్యాంగో పౌడర్ - ½ tsp
గరం మసాలా - ¼tsp
నీరు - 2 cups
ఉప్పు: రుచికి సరిపడా
బే ఆకు: 1

తయారుచేయు విధానం:
1. ముందుగా బియ్యంను శుభ్రంగా కడిగి 15నిముషాలు నానెబెట్టుకోవాలి.
2. తర్వాత రెండు మూడు గంటల ముందుగా నానబెట్టుకొన్న శెనగలు నుండి నీరు వంపేసి, కుక్కర్ లో వేసి 4విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకొని పక్కన పెట్టువాలి.
3. ఇప్పుడు పాన్ లో కొద్దిగా నూనె వేసి, వేడి చేయాలి. నూనె వేడయ్యాక అందులో జీలకర్ర వేసి చిటపటలాడాక అందులో అల్లం, పచ్చిమిర్చి మరియు పసుపు వేసి కొన్ని నిముషాలు వేయించుకోవాలి.
4. ఇప్పుడు అదే పాన్ లో టమోటో ముక్కలు మరియు ఉప్పు కూడా వేసి మరికొద్దిసేపు వేయించుకోవాలి.
5. టమోటో మొత్తగా వేగిన తర్వాత అందులో ముందుగా ఉడికించి పెట్టుకొన్న శెనగలు, బంగాళదుంప మరియు నీళ్ళు వేయాలి. ఇవి వేగిన తర్వాత పాన్ మూత పెట్టి పది నిముషాలు మీడయం మంట మీద ఉడికించుకోవాలి.
6. ఇవన్నీ మొత్తం ఉడికిన తర్వాత పాన్ లో ముందుగా ఉడికించి పెట్టుకొన్న అన్నం, ఆకుకూర, బిర్యానీ ఆకు మరియు క్యాప్సికమ్, వేసి బాగా మిక్స్ చేసి తర్వాత బాగా ఉడికించుకోవాలి. 15నిముషాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలి.
7. అంతే శెనగలు పలావ్ రెడీ చివరగా డ్రై మ్యాంగో పౌడర్ మరియు గరం మసాలా కూడా వేసి నిదానంగా బాగా మిక్స్ చేసి, స్టౌవ్ ఆఫ్ చేయాలి. అంతే దీన్ని పెరుగు రైతా లేదా ఊరగాయతో సర్వ్ చేయాలి .

English summary

Colourful Chickpeas Pulav Recipe

One of the most loved ingredients in many parts of India is chickpeas. Being an important ingredient in Northern parts of India, chickpeas has also become a common ingredient in South India too.
Story first published: Wednesday, February 12, 2014, 11:55 [IST]
Desktop Bottom Promotion