For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రీమీ కార్న్ మసాలా: రోటీ స్పెషల్ సైడ్ డిష్

|

ముఖ్యంగా చెప్పాలంటే ఇది నార్త్ ఇండియన్ పంజాబీ డిష్, కానీ మన సౌత్ ఇండియన్స్ కూడా సులభంగా తయారుచేసుకొని ఒక డిఫరెంట్ టేస్ట్ ను రుచిచూడటం కోసం, మీకు ఈ వంటను పరిచయం చేస్తున్నాము. క్రీమీ కార్న్ మసాలా చాలా అద్బుతమైనటువంటి రుచి కలిగి ఉంటుంది. ఈ వంటకు పాలు మరియు గసగసాల పేస్ట్ వల్ల అద్భుతమైన రుచితో పాటు , మంచి స్ట్రక్చర్ కూడా ఉంటుంది. తాజాగా ఉండే షెల్డ్ కార్స్ కొద్దిగా నెయ్యిలో వేపించి పాలలో మొత్తగా ఉడికించి తయారుచేస్తారు.

అలాగే గసగసాల పేస్ట్ జోడించడం వల్ల ఇది చాలా మెత్తగా, క్రీమ్ గా ఉంటుంది. అలాగే గరం మసాలా కూడా అదనపు టేస్ట్ ను అందిస్తుంది. ఈ రుచికరమైన క్రీమీ కార్న్ మసాలా రోటీలకు మంచి కాంబినేషన్. మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Creamy Corn Masala : Punjabi Special

కావల్సిన పదార్థాలు:

బేబీకార్న్(షెల్డ్ ఫ్రెష్ లేదా ఫ్రోజోన్ కార్న్): 2cups
గరం మసాలా: 1/4tsp
గసగసాలు: 2tbsp
పాలు: 1cup
ఉప్పు: రుచికి సరిపడా
నెయ్యి: 2tbsp
కొత్తిమీర తరుగు: గార్నిష్ చేయడానికి

తయారుచేయు విధానం:

1. ముందుగా వెల్లుల్లి పొట్టు తీసి రఫ్ గా కట్ చేసుకోవాలి.
2. అంతకు ముందుగానే ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని గసగసాలు వేసి కొన్ని గంటల పాటు నానబెట్టుకోవాలి.
3. ఒకటి రెండు గంటల తర్వాత నానబెట్టుకొన్న గసగసాలలోని నీరు వంపేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
4. ఇప్పుడు స్టౌ మీద పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసి కాగిన తర్వాత అందులో కార్న్ వేసి ఒకటి లేదా రెండు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
5. బేబీకార్న్ కొద్దిగా వేగిన తర్వాత అందులో పాలను పోయాలి.
6. పాలు సగానికి సగం మరిగే వరకూ ఉడికించుకోవాలి.
7. తర్వాత అందులో గ్రైండ్ చేసుకొన్న గసగసాల పేస్ట్ మరియు ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి.
8. ప్రత్యామ్నాయంగా బేబీకార్న్ ను పాలను కుక్కర్ లో కూడా వేసి ఒక విజిల్ వచ్చే వరకూ పెట్టుకోవచ్చు.
9. బేబీకార్న్ఉడుకూత, దగ్గరపడూతూ, గరం మసాలతో చిక్కగా అవుతున్న సమయంలో స్టౌ మీద నుండి క్రిందికి దింపుకొని కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకోవాలి .
10. అంతే ఈ కార్న్ మసాలాను రోటీతో సర్వ్ చేయాలి. అంతే క్రీమీ కార్న్ మసాలా రెడీ

English summary

Creamy Corn Masala : Punjabi Special

Creamy Corn Masala is very rich as it has milk , poppy seeds paste but yet it is very soft in texture. Freshly shelled corn is fried in little ghee and cooked in milk till soft. Then ground poppy seeds paste is added to the corn and reduced till it comes together.
Story first published: Monday, August 4, 2014, 13:44 [IST]
Desktop Bottom Promotion