For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రీమీ షహీ మష్రుమ్ రిసిపి

|

ఒక రుచికరమైన టేస్టీ వెజిటేరియన్ వంటను మీరు రుచి చూడాలనుకుంటే, షహీ మష్రుమ్ చాలా అద్బుతమైన రుచిని కలిగి ఉంటుంది. ఈ షహీ మష్రుమ్ వివిధ రకాలుగా వండుతారు. అయితే క్రీమీ షహీ మష్రుమ్ చాలా డిఫరెంట్ టేస్ట్ కలిగి ఉంటుంది.

మష్రుమ్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది. మరియు ఆరోగ్యనానికి మేలు చేసే ఇతర ఎలిమెంట్స్ కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి . మన ఇండియన్ కుషన్ లో వివిధ రకాల వెజిటేరియన్ మష్రుమ్ డిష్ కర్రీలున్నాయి. మష్రుమ్ పనీర్, ఫ్రైడ్ పనీర్, మష్రుమ్ చిల్లీ వంటి వంటలు చాలా పాపులర్ అయినటువంటివి. షహీ మష్రుమ్ ఒక అద్బుతమైన రుచి కలిగినటువంటి రిసిపి. మీరు కూడా టేస్ట్ చేయాలంటే తయారుచేసే విధానంను ఈ క్రింది విధంగా పరిశీలించండి...

Creamy Shahi Mushroom Recipe

కావల్సిన పదార్థాలు:
పుట్టగొడుగులు: 200grms
ఉల్లిపాయలు: 4 (తరిగినవి)
టమోటో: 5 (కట్ చేసుకోవాలి)
అల్లం: 4tsp
పచ్చిమిర్చి: 4 (తరిగినవి)
కారం: ½tsp
గరం మసాలా: ½tsp
పంచదార: 1tsp
ఫ్రెష్ క్రీమ్: 1cup
జీడిపప్పు : ½cup(పేస్ట్ చేసుకోవాలి)
వెన్న (నెయ్యి) : 3tsp
ఉప్పు : రుచికి సరిపడా
కొత్తిమీర : కొద్దిగి (సన్నగా తరిగి పెట్టుకోవాలి)

తయారుచేయు విధానం:
1. ముందుగా చిన్న బౌల్లో, మష్రుమ్ (పుట్టగొడుగులను)రెండు గా కట్ చేసి పెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో కొద్దిగా బట్టర్ వేసి అందులో కట్ చేసి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు వేసి, బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించి పెట్టుకోవాలి.
3. తర్వాత అందులో అల్లం, పచ్చిమిర్చి మరియు టమోటోలు కూడా వేసి మరో 5నిముషాలు వేగించుకోవాలి.
4. వేగించుకొన్ని మిక్సీ జార్ లో వేసి, పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
5. తర్వాత మరో పాన్ లో కొద్దిగా ఈ పేస్ట్ ను వేసి రెండు నిముషాలు వేగించుకోవాలి.
6. అందులోనే కారం, గరం మసాలా, జీడిపప్పు పౌడర్ మరియు పంచదార వేసి గ్రేవీ మొత్తం 5నిముషాలు, మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
7. ఇప్పుడు అందులో ముందుగా కట్ చేసి పెట్టుకొన్న మష్రుమ్ లను వేసి తక్కువ మంట మీద 10నిముషాలు ఉడికించుకోవాలి.
8. మష్రుమ్ మెత్తగా ఉడికి, క్రీమ్ మష్రుమ్ కు బాగా పట్టిన తర్వాత మరో రెండు నిముషాలు ఉడికించి తర్వాత స్టౌ ఆఫ్ చేసుకోవాలి. అంతే క్రీమీ షహీ మష్రుమ్ రెడీ.

English summary

Creamy Shahi Mushroom Recipe

If you are looking for a delicious and tasty vegetarian main course recipe, then Shahi mushroom is the dish for you. Shahi mushroom can be prepared in a variety of ways that will be relished by all. There are many kinds of mushrooms that are used in various cuisines. However, mushroom such as cep, chanterelle, moral, oyster, shiitake are top few that are used in the Indian cuisine.
Story first published: Monday, May 12, 2014, 12:41 [IST]
Desktop Bottom Promotion