For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బేబీ పొటాటో మసాలా ఫ్రై టేస్టీ అండ్ యమ్మీ

|

బేబి పొటాటో ఈ సీజన్ లో ఎక్కువగా దొరుకుతాయి. ఈ సీజన్ లో దొరికే బేబీ పొటాటాలను మన ఇండియన్ డిష్ లలో అనేక వాటిలో ఉపయోగిస్తుంటారు . ఈ సీజన్ లో ఎక్కువ పండ్లు, వెజిటేబుల్స్ మనకు అందుబాటులో ఉంటాయి. బేబీ పొటాటోలు, సాధారన బంగాళదుంపల కంటే రుచి డిఫరెంట్ గా ఉంటుంది . కాబట్టి, మీ మెనులో దీన్ని చేర్చుకోండి.

బేబీ పొటాటోలను ఉపయోగించి అనేక వంటలను తయారుచేవచ్చు. ఈ పొటాటోలను ఫ్రై చేయడం లేదా రుచికరమైన చిక్కటి గ్రేవీలా తయారుచేసుకోవాలి. ముఖ్యంగా బేబీ పొటాటోలను పొట్టు తీయకుండా వండటం వల్ల ఆరోగ్యానికి చాలా మంది. మరి ఈ చిన్న పొటాటోలను క్రిస్పిగా మరియు స్పైసీగా ప్రై చేస్తే మరింత రుచికరంగా ఉంటుంది . మరి వీటిని ఉపయోగించి అతి త్వరగా తయారుచేసే ఒక పొటాటో రిసిపి మీకోసం ....

 Crisp Baby Potatoes Masala Fry Recipe

కావల్సిన పదార్థాలు:
బేబీ పొటాటోలు- 8-10
పచ్చిమిర్చి- 2-3 (సగానికి మద్యలోకి కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయలు- 2
టమోటో- 1
పసుపు- 1tsp
కారం- 1tsp
ధనియాలపొడి- 1tsp
గరం మసాలా- చిటికెడు
జీలకర్ర- 1tsp
ఉప్పు- రుచికి సరిపడా
నూనె - ½ tbsp

తయారుచేయు విధానం:
1. ముందుగా బేబీ పొటాటోస్ ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత ఫ్రైయింగ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి అందులో బేబీ పొటాటోలు ఒకటి తర్వాత ఒకటి వేసి నిధానంగా ఫ్రై చేసుకోవాలి. లేదంటే మీదకు నూనె ఎగురుతుంది.
3. మీడియం మంట మీద 5 నుండి 10 నిముషాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
4. అంతలోపు, ఉల్లిపాయను పేస్ట్ చేసుకోవాలి. అలాగే టమోటోలను కూడా సపరేట్ గా గ్రైంట్ చేసుకొని ఈ పేస్ట్ ను విడిగా పక్కకు తీసి పెట్టుకోవాలి.
5. బేబీ పొటాటో ఫ్రై అయిన తర్వాత నూనె నుండి పొటాటోలను ప్లేట్ లోకి తీసి పెట్టుకోవాలి.
6. అదే పాన్ లో మరికొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక అందులో జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత అందులో ఉల్లిపాయ పేస్ట్ వేసి మరో 5 నిముషాలు వేగించాలి. అలాగే పసుపు మరియు ఉప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి.
7. రెండు నిముషాలు ఉడికించి అందులో పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో టమోటో పేస్ట్ కూడా జోడించి 5 నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
8. మొత్తం మిశ్రమం మిక్స్ చేస్తూ ఫ్రై చేయాలి. అందులోనే కారం, ధనియాల పొడి, మరియు గరం మసాలా వేసి మిక్స్ చేయాలి. తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకొన్న బేబీ పొటాటోలను కూడా వేసి మిక్స్ చేస్తూ వేగించుకోవాలి.
9. చివరగా బేబీపొటాటో ఫ్రై కి సన్నగా తరిగిన కొత్తిమీర తరుగును గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.

English summary

Crisp Baby Potatoes Masala Fry Recipe

Baby potatoes are available in this season. The market is flooded with these small potatoes that are a fresh harvest. In Indian cuisine, a lot of dishes are based on the chief ingredient, potato.
Story first published: Wednesday, February 10, 2016, 16:53 [IST]
Desktop Bottom Promotion