For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రిస్సీ కాలీఫ్లవర్-పచ్చిబఠానీ సైడ్ డిష్

|

కాలీఫ్లవర్ టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది మరియు ఇది ఇండియన్ కుషన్స్ లో ఒక సీజనల్ వెజిటేబుల్. కాలీఫ్లవర్ ను ఉపయోగించి వివిధ రకాల వంటలను తయారుచేస్తారు. హిందిలో కాలీఫ్లర్ ను గోబి అని పిలుస్తారు. కాలీఫ్లవర్ ఒక హార్ట్ హెల్తీ ఫ్లవర్ వెజిటేబుల్.

కాలీఫ్లవర్ లో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కాలీఫ్లవర్ లో కెరోటినాయిడ్స్, బీటా కెరోటిన్, మరియు ఫైటోన్యూట్రియంట్స్ ఉన్నాయి. ఇది ఫ్రీరాడికల్స్ ను నివారిస్తుంది మరియు వ్యాధులను దూరంగా ఉంచతుంది. గోబి ఒక రుచికరమైన మరియు హెల్తీ వెజిటేబుల్, ఇది వంట యక్క రుచిని అద్భుతంగా మార్చుతుంది. మరి కాలీఫ్లవర్ తో వెంటనే మీరు ఏదైనా వంట చేయాలనుకున్నప్పుడు ఈ గోబి మటర్ రిసిపిని ఎంపిక చేసుకోండి. మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Crisp Gobi Matar: Side Dish Recipe

కావల్సిన పదార్థాలు:
గోబీ పుష్పాల: 250grm
పచ్చిబఠానీలు:100grm
పచ్చిమిర్చి 2-3 (చిన్న ముక్కలుగా తరిగినవి)
పసుపు: 1tsp
కారం: 1tsp
ధనియాల పొడి: ½tsp
గరం మసాలా: 1tsp
జీలకర్ర: 1tsp
బే ఆకు: 1
ఉప్పు: రుచికి సరిపడా
ఆయిల్: 1tbsp

తయారుచేయు విధానం:
1. ముందుగా నీళ్ళను వేడి చేసుకొని అందులో కాలీఫ్లవర్ ఫువ్వును విడిపించి, వేడి నీళ్ళలో వేసి 20-25నిముషాలు నానబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల గ్యాస్ ఏర్పడకుండా ఉంటుంది. అంతే కాదు, వేడి నీటిలో నానబెట్టుట వల్ల వంట తయారుచేయడానికి కూడా చలా సులభం అవుతుంది.
2. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి అందులో, జీలకర్ర మరియు బిర్యానీ ఆకు వేయాలి.
3. ఇప్పుడు వేడినీళ్ళలో వేసి పెట్టుకన్న గోబిని నీరు వంపేసి అందులో వేసి మీడియం మంట మీద 2నిముషాలు వేగించుకోవాలి.
4. ఇప్పుడు అందులో పసుపు మరియు ఉప్పు వేయాలి. అలా చేయడం వల్ల చాలా సులభంగా మరియు త్వరగా తయారుచేయడానికి సహాయపడుతుంది.
5. మొత్తం మిశ్రామన్ని 8-10నిముషాలు వేయించడం వల్ల కాలీఫ్లవర్ మెత్తగా మరియు బ్రైన్ కలర్ లోకి మారుతాయి.
6. ఇప్పుడు అందులో పచ్చిబఠానీలను, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా మిక్స్ చేస్తూ మరో 2నిముుషాలు వేయించుకోవాలి.
7. ఇప్పుడు అందులో కారం, గరం మసాలా, మరియు ధనియాలపొడి వేసి మరో నిముషం వేగయించుకోవాలి. అంతే స్టౌ ఆఫ్ చేయాలి. అంతే గోబీ మటర్ సబ్జీ రెడీ. ఈ క్రిస్పీ ఇండియన్ సైడ్ డిష్ ను వేడి వేడిగా సర్వ్ చేయండి.

Story first published: Wednesday, January 29, 2014, 17:33 [IST]
Desktop Bottom Promotion