For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రిస్పీ కాకరకాయ ఫ్రై విత్ కోకనట్

|

కాకరకాయను ఇంగ్లీష్ లో బిట్టర్ గార్డ్ అంటారు. ఇది పిల్లలకే కాదు, కొంత మంది పెద్దలకు కూడా ఇష్టపడని ఒక హెల్తీ గ్రీన్ వెజిటేబుల్ ఇది. ఎందుకంటే, కాకరకాయ డయాబెటిక్ పేషంట్స్ కు చాలా మంచిది. అలాగే చర్మానికి ఒక అద్భుత ఔషధంగా ఉంది. అనేక ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది. అయితే ఈ గ్రీన్ హెల్తీ వెజిటేబుల్ చేదుగా ఉండటం వల్ల దీన్ని తినడాకి చాలా మంది ఎక్కువగా ఇష్టపడరు.

అయితే చేదు లేకుండా కాకరకాయను హెల్తీగా ఎలా తినవచ్చు? అందుకు ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి రుచి కలిగిన కాకరకాయ ఫ్రై రిసిపిని మీకు అందిస్తున్నాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పసుపు, ఉప్పుతో మ్యారినేట్ చేసి, రసం తీసేయడం వల్ల చేదు ఉండదు. అలాడే డీప్ ఫ్రై చేయడం వల్ల క్రిస్పీగా ఉంటుంది. మరి ఈ క్రిస్పీఅండ్ టేస్టీ బిట్టర్ గార్డ్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం...

Crispy Karela Fry Recipe With Coconut

కావల్సిన పదార్థాలు:
కాకరకాయ: 6 (సన్నగా రౌండ్ గా కట్ చేసుకోవాలి)
పచ్చిశెనగపప్పు: 1tbsp
జీలకర్ర : ½ tsp
ఆవాలు: ½ tsp
కరివేపాకు: 7-8
వెల్లుల్లి రెబ్బలు: 5
ఎండు మిర్చి: 3
కొబ్బరి తురుము: ½cup
పసుపు పొడి: ½tsp
ఎర్ర కారం పొడి: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 2tbsp
నూనె: డీప్ ఫ్రైకి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా కాకరకాయను సన్నగా గుండ్రంగా తరిగి, ఉప్పు నీటిలో వేసి కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పసుపు, ఉప్పు కొద్దిగా చిలకరించి 10-15 మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత కాకరకాయ ముక్కలను చేతిలోకి తీసుకొని రసాన్ని పిండేసి, తర్వాత పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు డీప్ ఫ్రైయింగ్ పాన్ లో కొద్దిగా నూనె కాగిన తర్వాత అందులో కాకరకాయ ముక్కలు వేసి 4-5నిముషాలు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి. అవి క్రిస్పీగా మరియు బ్రౌన్ కలర్ లోకి మారగానే మరో ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి.
4. తర్వాత మిక్సీ జార్ లో కొబ్బరి తురుము, వెల్లుల్లి మరియు కారం వేసి మొత్తగా పౌడర్ చేసుకోవాలి.
5. ఇప్పుడు మరో పాన్ స్టౌ మీద పెట్టి, కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. తర్వాత అందులో జీలకర్ర, శెనగపప్పు, ఆవాలు, ఎండు మిర్చి, కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి వేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి.
6. తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసుకొన్న కొబ్బరి మిశ్రమాన్ని కూడా వేసి మరో 5నిముషాలు నిధానంగా ఫ్రై చేసుకోవాలి.
7. ఇప్పుడు అందులో ముందుగా డీఫ్ ఫ్రై చేసి పెట్టుకొన్న కాకరకాయ ముక్కలు కూడా వేసి మొత్తం ఫ్రై చేసుకోవాలి.
8. కొద్దిగా ఉప్పు వేసి మరికొన్ని సెకడ్లు ఫ్రై చేసుకోవాలి. ఒక సారిగా మొత్తం వేగిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి, సర్వ్ చేయాలి. అంతే క్రిస్పీ కాకరకాయ ఫ్రై రెడీ. దీన్ని ప్లెయిన్ రైస్ మరియు దాల్ కాంబినేషన్ తో సర్వ్ చేయవచ్చు.

English summary

Crispy Karela Fry Recipe With Coconut

Karela or bitter gourd is the most hated vegetable, especially among kids. But it is also one of the best vegetables when it comes to your health. Bitter gourd is an excellent option for diabetic patients, good for your skin and a wonder medicine for most of your health problems. But most of us do not want to eat this healthy veggie because of its terrible bitter taste.
Story first published: Tuesday, August 5, 2014, 14:39 [IST]
Desktop Bottom Promotion