For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షుగర్ పేషంట్స్ కొరకు స్పెషల్ డిష్-కుకుంబర్ చెన్నా

|

ప్రపంచంలో మధుమేహ వ్యాధిని నయం చేయడానికి వీలుపడని వ్యాధిగా ఉంది. ప్రస్తుత రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారు. మధుమహంతో బాధపడేవారు డైట్ లో ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి. కొన్ని ఆహారాలను తినాలి, కొన్ని ఆహారాలను తినకూడదు. అయితే తీసుకొనే ఆహారాలను రుచికరంగా తయారుచేసుకోవడం చాలా అద్బుతంగా ఉంటుంది.

కీరదోసకాయతో తయారుచేసే వంట చాలా రుచికరంగా, సింపుల్ గా మరియు సులభంగా మరియు హెల్తీ గా ఉంటుంది. శెనగపప్పులో అధిక న్యూట్రీషియన్స్ ఉంటాయి. పోషకాలు అధికంగా ఉండే ఈ కీరదోసకాయను మిక్స్ చేస్తే మరింత అధినపు రుచిని అంధిస్తుంది . ఈ రెండింటి కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. మరి మీరు కూడా ఈ డయాబెటిక్ స్పెషల్ రిసిపిని టేస్ట్ చేయాంటే, తయారుచేసే పద్దతిని ఫాలో అవ్వాల్సిందే...

Cucumber Chana Dal Recipe For Diabetics
శెనగపప్పు :1cup
దోసకాయ: 1(తురుము)
జీలకర్ర: 1tsp
అల్లం పేస్ట్: 1tsp
పచ్చిమిర్చి: 2 (చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
పసుపు: 1tsp
కారం: ½ tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 1tbsp
నీరు: 3cups
కొత్తిమీర తరుగు: 2tbsp(సన్నగా కట్ చేసుకోవాలి)

తయారుచేయు విధానం:
1. ముందుగా శెనగపప్పును శుభ్రంగా కడగాలి.
2. తర్వాత ప్రెజర్ కుక్కర్ లో శెనగపప్పు, ఉప్పు, పసుపు, సరిపడా నీళ్ళు పోసి మీడియం మంట మీద మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
3. పప్పు ఉడికిన తర్వాత, స్టౌ మీద నుండి కుక్కర్ ను పక్కకు దింపుకోవాలి.
4. తర్వాత పాన్ లో నూనె వేసి వేడి చేసిన తర్వాత అందులో జీలకర్రవేసి చిటపటలాడిన తర్వాత అందులో ఉడికించుకొన్న శెనగపప్పు వేయాలి, అలాగే అల్లం, వెల్లుల్లి పేస్ట్, కారం వేసి 5నిముషాలు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
5. తర్వాత అందులో సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొన్న కీరదోస ముక్కలు మరియు ఉప్పు వేసి 10నిముషాలు చాలా తక్కవ మంట మీద ఉడికించుకోవాలి .
6. కీరదోస మొత్తగా ఉడికిన తర్వాత, స్టౌ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే కుకుంబర్ చెన్నా దాల్ రిసిపి రెడీ. ఈ ఆరోగ్యకరమైన చెన్నాకుకుంబర్ దాల్ రిసిపిని రోటీలతో పాటు తీసుకుంటే డయాబెటిక్ పేషంట్స్ కు చాలా ఆరోగ్యకరం.

English summary

Cucumber Chana Dal Recipe For Diabetics

Diabetes is one of the most prevalent disease in today's world. More than half of the population suffers from diabetes which is definitely a matter of concern for all of us. So, today being World Diabetes Day, Boldsky brings to you a special recipe for diabetics.
Story first published: Tuesday, December 10, 2013, 10:51 [IST]
Desktop Bottom Promotion