For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కుకుంబర్ రైతా: సమ్మర్ స్పెషల్

|

ఇండియన్ స్పెషల్ వంటకాల్లో దొండకాయ పెరుగు పచ్చడి కూడా ఒకటి. ఇది సైడ్ డిష్ గానే కాదు. స్పెషల్ గా తయారు చేసుకొని గీ రైస్, జీరా రైస్ కు ఓ అద్భుతమైన కాంబినేషన్. ఆంధ్రా స్టైల్లో కొంచె స్పెషల్ గా, పెప్పర్, అల్లం చేర్చి వండటం వల్ల ఓ స్పెషల్ టేస్ట్ వస్తుంది.

ఇండియన్ వంటకాల్లో రైతా చాలా ఫేమస్ సైడ్ డిష్. సాధారణంగా రైతాను నీళ్ళు-చిలికిన పెరుగు మిశ్రమం, కొన్ని స్పైసీ(మసాలా దినుసుల)తో తయారు చేస్తారు. రైతాకు మసాలాలను కలిపుకొని తయారు చేసుకోవచ్చు. లేదా తాజా కూరగాయలతో ఉల్లిపాయలు, టమోటోలు, కీరకాయ, అవొకాడో వంటివి మిక్స్ చేసి కూడా తయారు చేసుకోవచ్చు. అంతే కాదు, బూందీ చేర్చి స్వీట్ రైతాను కూడా తయారు చేసుకోవచ్చు. రైతా స్వీట్ కానివ్వండి, హాట్ కానివ్వండి ఏదైనా సరే రోటీ, రైస్, పులావ్, బిర్యానీలకు బెస్ట్ కాంబినేషన్. రైతా తయారు చేసిన తర్వాత రుచి చూసిన తర్వాత ఈ టేస్ట్ ను కొద్దికాలం పాటు మరచిపోలేరు. ఇది తాయారు చేయడం కూడా సులభం. మీరు కుకుంబర్ రైతాను చాలా సార్లు చేసుకొని ఉంటారు. అందుకే మసాలాదినుసులతో తయారు చేసే రైతా ఎలా ఉంటుందో మీరూ తాయారు చేసి రుచి చూడండి....

Cucumber Raita: Summer Special

కావల్సిన పదార్థాలు:
చిక్కటి పెరుగు: 1cup
పుల్లటి క్రీమ్ : 100grms
పాలు: 4tbps
ఉల్లిపాయ: 1
కీరదోసకాయ: 1
ఉప్పు: రుచికి సరిపడా
పచ్చిమిర్చి: 1చిన్నవి
తయారుచేయు విధానం:
1. ముందుగా కీరదోసకాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి.
3. తర్వాత పుదీనా ఆకులను కూడా రఫ్ గా కట్ చేసుకోవాలి.
4. ఇప్పుడు ఇక మిక్సింగ్ బౌల్ తీసుకొని పెరుగు, సోర్ క్రీమ్, పాలు, ఉప్పు, పచ్చిమిర్చి, వెల్లుల్లి ముక్కలు కీరదోస ముక్కలు, పుదీనా తరుగు వేసి అన్నింటిని బాగా మిక్స్ చేయాలి.
5. అంతే చివరగా ఉప్పు సరిచూసుకొని, కొత్తిమీర తరుగు, కీరోదోసకాయ స్లైస్ తో గార్నిష్ చేసి, సర్వ్ చేయాలి.

English summary

Cucumber Raita: Summer Special

Cucumber raita is a delicious recipe that has a blend of sour yogurt and crunchy cucumber pieces. Mix this raita with spices like cumin seeds, red chilli powder and onions to make it the perfect side dish. Check out the recipe to prepare cucumber raita.
Story first published: Monday, April 21, 2014, 18:34 [IST]
Desktop Bottom Promotion