For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కర్రీ ట్రీట్: వంకాయ మరియు టమోటో రిసిపి

|

సమ్మర్ లో నోటికి రుచిగా మరియు పుల్లపుల్లగా తినాలనిపించే వంటలేవైనా ఉన్నాయంటే వాటిలో టమోటో వంటలు లేదా పచ్చి మామిడికాయలతో చేసే వంటలై ఉండాలి. వంకాయ మరియు టమోటో కర్రి చాలా టేస్టీగా ఉంటుంది.

హెల్తీ వెజిటేబుల్స్ లో ఒకటైన టమోటో మరియు వంకాయ కాంబినేషన్ వంటను తయారుచేసుకోవచ్చు. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచే స్పెషల్ న్యూట్రీషినల్ బెనిఫిట్స్ కలిగి ఉంటుంది.

ఎందుకంటే ఆరోగ్యానికి అవసరం అయ్యే ఐరన్, ఫైబర్ మరియు సోలబుల్ కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. అంతే కాదు, పర్ఫుల్ కలర్ వెజిటేబుల్ క్యాన్సర్ తో పోరాడుతాయి . డయాబెటిస్ ను దూరం చేస్తాయి. క్యాలరీలను తగ్గిస్తాయి. మరి రుచికరమైన వంటను ఎలా తయారుచేయాలో చూద్దాం...

Curry Treat: Brinjal & Tomato Recipe

కావల్సిన పదార్థాలు:
వంకాయ: 4 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయ : 1(చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
ఆయిల్ : ¼tsp
వెల్లుల్లి రెబ్బలు: 4- 5
టొమాటోస్ : 4 (సన్నగా తరిగినవి)
నీళ్ళు :1cup
కారం : 1 tbsp
దాల్చిన : చిన్నముక్క
బే ఆకు: 1
ఉప్పు : రుచికి సరిపడా
పసుపు పొడి :1tsp
జీలకర్ర పొడి : 1 tsp
గరం మసాలా పొడి : ½tsp
కొత్తిమిర : సన్నగా తరిగి పెట్టుకోవాలి
పచ్చిబఠానీలు : ½cup(ఉడికించినవి)

తయారుచేయు విధానం:
1. ముందుగా వంకాయలను ముక్కలుగా కట్ చేసి నీటిలో వేసి కొద్దిసేపు ఉండనిచ్చి తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి.
2. పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. వేడిఅయ్యాక అందులో సన్నగా కట్ చేసుకొన్న ఉల్లిపాయముక్కలు మరియు వెల్లుల్లి వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.
3. 10నిముషాల తర్వాత అందులో సన్నగా తరిగిన టమోటో, వంకాయ ముక్కలు వేసి మరో 5నిముషాలు ఫై చేయాలి. తర్వాత కొద్దిగా నీరు, కారం, ఉప్పు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా మరియు కొత్తిమీర తరుగు వేసి ,మొత్తం మిశ్రమాన్ని ఒకసారి కలియబెట్టి, తర్వాత మూత పెట్టి 10నిముషాలు ఉడకనివ్వాలి.
4. పదినిముషాల తర్వాత పూత తీసి, అందులో ముందుగా ఉడికించుకొన్న పచ్చిబఠానీలను వేసి, మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి అంతే గ్రేవీ చిక్కబడే వరకూ ఉడికించి తర్వాత స్టౌ ఆఫ్ చేసుకోవాలి.

English summary

Curry Treat: Brinjal & Tomato Recipe

This afternoon we have a special treat for you to prepare in your kitchen. The yummy tomato and brinjal curry is a must treat if you love this veggie.
Story first published: Thursday, April 2, 2015, 14:55 [IST]
Desktop Bottom Promotion