For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దాల్ తడ్కా విత్ ఎగ్ టేస్టీ అండ్ హెల్తీ

|

దాల్ తడ్కా విత్ ఎగ్ ఒక ఫేమస్ డిష్. ఈ దాల్ తడ్కాను ఇండియాలో ఎక్కువగా ఇష్టపడుతారు. ఈ దాల్ తడ్కావిత్ ఎగ్ రిసిపి హాట్ తందూరి రోటీలకు ఫర్ఫఎక్ట్ కాంబినేషన్ . ఈ దాల్ తడ్కా రిసిపి రెస్టారెంట్ టాప్ ఫుడ్స్ లో ఒది ఒక ఆథెంటిక్ రిసిపి. ఈ రిసిపిని సాధారణంగా కందిపప్పుతో తయారుచేస్తారు. అయితే ఇక్కడ పెసరపప్పు, మినపప్పు, శెనగపప్పు కాంబినేషన్ తో తయారుచేయడం జరిగింది. ఈ రిసిపి కాస్తా కారంగా మరియు టేస్టీగా ఉండేటటువంటి ఇండియన్ కుషన్ రిసిపి.

దాల్ తడ్కావిత్ ఎగ్ రిసిపి సులభమైన ఇండియన్ రిసిపి. ఈ వంటకు అసలైన రుచి అంతా పప్పును లైట్ బ్రౌన్ కలర్ లో వేయించి తర్వాత తయారుచేయడ వల్ల అంత రుచి వస్తుంది. మరియు మరో బెస్ట్ కాంబినేషన్ గుడ్డను చేర్చడం మరింత టేస్టీగా ఉంటుంది. మరి ఈ రుచికరమైన దాల్ తడ్కా విత్ ఎగ్ ను ఎలా తయారుచేయాలో చూద్దాం...

Dal Tadka With Egg Recipe

కావల్సిన పదార్థాలు:
పెసరపప్పు- 1/2cup
మినపప్పు -1 / 2cuup
శెనగపప్పు: 1/2cup(నానబెట్టి)
ఉల్లిపాయ: 1 + 1
అల్లం: 1 చిన్న ముక్క
వెల్లుల్లి రెబ్బలు -6-8
టమోటో: 1
పసుపు: 1
చిటికెడు ఎండు మిర్చి - 2
బే ఆకులు: 2 స
పచ్చిమిర్చి 4 (తరిగినవి)
కారం 1/2 tsp
ధనియాల పొడి: 1tsp
జీలకర్ర పొడి: 1tsp
గరం మసాలా పొడి 1/2 tsp
మస్టర్డ్ ఆయిల్ :2tbsp
నెయ్యి: 1tsp
ఇంగువ(Asfoetida): 1 చిటికెడు
షుగర్ - 1/2 tsp
గుడ్లు-2 అంతలోపు ఉప్పు

తయారుచేయు విధానం:
1. మూడు రకాల పప్పులను ప్రెజర్ కుక్కర్ లో తక్కువ 10నిముషాలు ఉడికించుకోవాలి.
2. అంతలోపు ఉల్లిపాయ, మరియు టమోటో సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
3. తర్వాత అల్లం, వెల్లుల్లి మరియు ఉల్లిపాయలను మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
4. తర్వాత డీప్ బాటమ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి చేసుకోవాలి. వేడయ్యాక అందులో బిర్యాని ఆకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి మరయిు పంచదార వేసి బాగా మిక్స్ చేయాలి.
5. తర్వాత అందులో కట్ చేసి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు వేసి మరో 2నిముషాలు వేగించుకోవాలి. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మెత్తగా అయ్యే వరకూ వేగించుకోవాలి.
6. తర్వాత అందులో ముందుగా ఉడికించిపెట్టుకొన్న దాల్ మిశ్రమాన్ని వేసి మొత్తాన్ని బాగా కలగలుపుకోవాలి. ఉండలుకట్టకుండా మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేయాలి.
7. తర్వాత మరో డీప్ బాటమ్ పాన్ తీసుకొని అందులో నెయ్యి వేసి వేడి చేయాలి, అందులో ఇంగువ వేసి ఒక సెకను వేగించాలి.
8. తర్వాత అందులో గుడ్లను పగులగొట్టి అందులో పోసి కొద్దిగా ఉప్పు చిలకరించి, ఫ్రై చేసుకోవాలి.
9. గుడ్డు వేగిన తర్వాత ఉడుకుతున్న పప్పును ఇందులో పోయాలి . రెండింటి మిశ్రమాన్ని బాగా ఉడకనివ్వాలి. చివరగా గరం మసాలా జోడించాలి అంతే దాల్ తడ్కా రెడీ.

English summary

Dal Tadka With Egg Recipe

Dal tadka with eggs is a very special dish from Kolkata. When you go to a dhaba and order for dal tadka, you usually expect to see golden yellow dal seasoned with onion, tomatoes and spices.
Story first published: Thursday, May 15, 2014, 12:28 [IST]
Desktop Bottom Promotion