For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఖర్జూరం స్వీట్ హల్వా: రంజాన్ స్పెషల్

|

ఖర్జూరం ముస్లీంలు ఇష్టపూర్వంగా తినే పండు. మహమ్మద్ ప్రవక్త ఖర్జూరాన్ని చాలా ఇష్టంగా తినేవారు. తన అనుచరులను తినాలని ఆదేశించేవారి చెబుకుంటారు. ఉపవాసాల సమయంలో ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మరియు శరీరంలో రక్తం పుడుతుందని చెప్పేవారు. రంజాన్ నెలలో ఖర్జూరంతో లేదా నీటితో ఉపవాసం విరమించటం మహమ్మద్ దినచర్యగా ఉండేదని, అదే అనవాయితీ నేడు ప్రపంచవ్యాప్తంగా ముస్లీంలు అనుసరిస్తున్నారు.
ఖర్జూరాలు మంచి పోషక విలువలు కలవి. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉండటంతో తక్షణ ఎనర్జీని అందిస్తుంది. అందుకే రంజాన్ మాసంలో వీటికి అంత ప్రత్యేకత. మరి తక్షణ శక్తినిచ్చే ఈ ఖర్జూరాలతో తయారుచేసే హల్వాకు కూడా క్రేజ్ ఎక్కువే. మరి ఈ టేస్టీ అండ్ స్వీట్ డేట్స్ హల్వా ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావలసిన పదార్ధాలు:

ఖర్జూరం: 250grm
పాలు: 3cup
పంచదార: 250grm
బాదంపలుకులు: 15
జీడిపప్పు: 10
కిస్‌మిస్‌లు: 3tsp
యాలకుల పొడి :1tsp
నెయ్యి: 3tsp

Dates -Sweet Halwa: Ramzan Special

తయారుచేసే విధానం
1. ముందుగా బాదం, జీడిపప్పు, కిస్‌మిస్‌లను నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకోవాలి.
2. తరువాత ఖర్జూరాల్లో గింజలను తొలగించి పాలలో వేసి చిన్న మంటపై ఉడికించుకోవాలి.
3. ఇప్పుడు ఖర్జూరాలు మెత్తగా అయ్యాక పంచదార, నెయ్యి జోడించి మూత పెట్టాలి.
4. మిశ్రమం అడుగు అంటకుండా గరిటతో కలియబెడుతూ ఉండాలి.
5. ఈ మిశ్రమం కొంచెం చిక్కగా అయ్యాక యాలకుల పొడి వేసుకోవాలి.
6. తరువాత నెయిలో వేయించిన బాదం, కిస్‌మిస్‌లను వేసుకుని దింపుకోవాలి. అంతే..ఖర్జూర స్వీట్‌ హాల్వా రెడీ.

English summary

Dates -Sweet Halwa: Ramzan Special


 Dates halwa is a delicious and nutritious dessert recipe to try out for Eid. To prepare this lip-smacking delight make sure that you use soft, de-seeded dates. If the dates you have are hard, then soak them in warm milk for 5-6 hours and then go on with the recipe. Dates halwa is not only delicious but also healthy at the same time since dates are a rich source of iron, vitamins and minerals.
Story first published: Monday, July 14, 2014, 13:02 [IST]
Desktop Bottom Promotion