For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డీప్ మష్రూమ్ కర్రీ: వెరీ టేస్టీ అండ్ హెల్తీ

|

సాధారణంగా మష్రుమ్ లను వెజిటేరియన్స్ ఎక్కువగా తినడానికి ఇష్టపడుతారు. కొంత మంది మష్రుమ్(పుట్టగొడుల)రుచి, వాసన పట్టదు. అటువంటి వారు ఈ మష్రుమ్ వంటలకు దూరంగా ఉంటారు. కానీ మష్రుమ్ లోని ప్రయోజనాలను తెలుసుకుంటే, వెంటనే తినడం ప్రారంభించేస్తారు. అన్ని గొప్ప ప్రయోజనాలు పుట్టగొడుగుల్లో ఉన్నాయి.

పుట్టగొడుగులు శాకాహారమా? మాంసాహారమా? మనలో చాలామందికి డౌట్. దీనికి సమాధానం... ఒకసారి తిని చూడ్డం! డీప్ మష్రూమ్ కర్రీ, మష్రూమ్ కర్రీ, రాజ్మా మష్రూమ్ కర్రీ, టొమాటో పాస్తా కర్రీ, కొరమీను మష్రూమ్ పొరటు... వీటిలో ఏం తిన్నా మీకు ఒకటే అనిపిస్తుంది. ‘శాకాహరమైతేనేం? మాంసాహారమైతేనేం మష్రూమ్ ఇంత టేస్టుగా ఉంటే' అని!! ఇవే కాదు... ఇంకా రకరకాల ప్రయోగాలను మీరు మష్రూమ్‌తో చెయ్యొచ్చు. మీకోసం ఒక డీప్ మష్రుమ్ కర్రీ...

Deep Mushroom Curry: Winter Special

కావలసిన పదార్థాలు:
మష్రూమ్స్: 2cups
చింతపండు: కొద్దిగా(నీళ్లలో నానబెట్టాలి)
ఉప్పు: రుచికి తగినంత
గరంమసాలా: 1tsp టీ స్పూను
శనగపప్పు: 1tbsp
మిరియాల పొడి: tsp
నూనె: 2tsp
ఆవాలు: 1/2tsp
ఎండుమిర్చి: 2
కొత్తిమీర: కొద్దిగా
ఉల్లిపాయ: 1ముక్కలుగా కట్ చేసుకోవాలి
టొమాటో ముక్కలు: 1/2cup
కరివేపాకు: 2 రెమ్మలు

తయారు చేయు విధానం:

1. ముందుగా చింతపండు గుజ్జు తీసి పక్కన ఉంచాలి.
2. తర్వాత పాన్ లో శనగపప్పు వేసి వేయించి మిరియాలపొడి జతచేసి కలిపి తీసేయాలి.
3. ఇప్పుడు పాన్‌లో నూనె కాగాక కరివేపాకు, ఆవాలు, ఎండుమిర్చి వేసి వేయించాక, ఉల్లిపాయ, టొమాటో ముక్కలు కూడా వేసి వేయించాలి.
4. అలాగే మష్రూమ్‌ ముక్కలు కూడా వేసి, ఉప్పు వేసి బాగా కలిపి, మూతపెట్టి, ఉడికించాలి.
5. తర్వాత చింతపండు గుజ్జు జత చేసి పది నిముషాలయ్యాక, గరం మసాలా వేసి 5 నిముషాలు ఉడికించి దించేయాలి.
6. చివరగా కొత్తిమీరతో గార్నిష్‌ చేయాలి. అంతే డీప్ మష్రుమ్ కర్రీ రెడీ

English summary

Deep Mushroom Curry: Winter Special

Mushrooms can be made into a number of recipes. You can cook it the Chinese way or the continental way or the typical Indian way. They taste good in all ways. Today we have a special and royal recipe for mushrooms known as the deep mushroom curry.
Story first published: Tuesday, October 14, 2014, 12:14 [IST]
Desktop Bottom Promotion