For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రుచికరమైన ఆలూ స్టఫ్ క్యాప్సికమ్ రిసిపి

|

మన ఇండియాలో చాల మందికి బంగాళదుంపలు అంటే మహాఇష్టం ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ ఆలూ(బంగాళ దుంపల)ను ఎక్కువగా తింటారు.. చాలా వరకూ ఇండియన్ డిష్ లలో బంగాళదుంపలతో తయారుచేసిన వంటకం ఉండాల్సిందే.. ముఖ్యంగా ప్రోట్నీన్స్, విటిమన్స్, ఇందులో ఉండే స్ట్రార్చ్ మన శరీరానికి అవసరం అయ్యే ఎనర్జీని అందిస్తుంది. అంతే కాదు వ్యాధినిరోధకతను పెంచుతుంది. మరియు బరువు తగ్గించుకోవడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

కొందరు నిపుణుల ప్రకారం ఉడికించిన లేదా గ్రిల్ చేసిన బంగాళదుపంలు తీసుకోవడం మంచిదని అభిప్రాయపడుతున్నారు. బంగాళదుంపలతో వివిధ రకాల వంటలను తయారుచేస్తాము. అయితే స్టఫ్డ్ ఆలూ క్యాప్సికమ్ కర్రీ చాలా టేస్ట్ గా ఉంటుంది. ఈ యమ్మీ వెజిటేబుల్ రిసిపి తయారుచేసుకోవడానికి ఇది ఒక మంచి సమయం.

READ MORE:క్యాప్సికమ్ లోని గొప్ప ఔషధగుణగణాలు: లాభాలు

స్టఫ్డ్ ఆలూ క్యాప్సికమ్ రిసిపిని దాల్ మరియు రైస్ కు సైడ్ డిష్ గా లేదా డ్రై రోటీస్ కు చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ స్టఫ్డ్ ఆలూ క్యాప్సికమ్ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం...

step by step

step by step

తయారుచేయడానికి పట్టే సమయం : 30నిముషాలు

కావల్సిన పదార్థాలు:

కావల్సిన పదార్థాలు:

గ్రీన్ క్యాప్సికమ్ - 5 nos (లోపల విత్తనాలు, మరియు ఇతర పదార్థం మొత్తాన్ని స్పూన్ తో తొలగించుకోవాలి)

బంగాళదుంపలు - 5 (ఉడికించి తొక్క తీసి మెత్తగా మ్యాష్ చేసి పెట్టుకోవాలి)

పచ్చిబఠానీలు - 1 cup (ఉడికించుకోవాలి)

కావల్సిన పదార్థాలు:

కావల్సిన పదార్థాలు:

నూనె- 4 tbsp

జీలకర్ర- 1 tbsp

ఆవాలు - ½ tsp

ఉల్లిపాయలు - 1 (సన్నగా కట్ చేసుకోవాలి)

పచ్చిమిర్చి- 2 (సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి)

జీలకర్ర- 1 tbsp

ధనియాలపొడి - 1 tbsp

కావల్సిన పదార్థాలు:

కావల్సిన పదార్థాలు:

పసుపు - ½ tsp

కారం - 1 tbsp

ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం: స్టెప్ 1

తయారుచేయు విధానం: స్టెప్ 1

ముందుగా పాన్ స్టౌ మీద పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి చేసి వేడి అయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర వేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి.

తయారుచేయు విధానం: స్టెప్ 1

తయారుచేయు విధానం: స్టెప్ 1

ఇప్పుడు అందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.

తయారుచేయు విధానం: స్టెప్ 1

తయారుచేయు విధానం: స్టెప్ 1

అలాగే పచ్చిమిర్చి కూడా వేసి మిక్స్ చేస్తూ మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.

తయారుచేయు విధానం: స్టెప్ 1

తయారుచేయు విధానం: స్టెప్ 1

. ఇప్పుడు ముందుగా ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకొన్న బంగాళదుంప, జీలకర్ర, ధనియాలపొడి మరియు ఉప్పు వేసి మొత్తం మిశ్రామాన్ని కలగలుపుతూ ఫ్రై చేసుకోవాలి.

తయారుచేయు విధానం: స్టెప్ 1

తయారుచేయు విధానం: స్టెప్ 1

అలాగే ముందుగా ఉడికించుకొన్న పచ్చిబఠానీలు కూడా వేసి మిక్స్ చేసుకోవాలి.

తయారుచేయు విధానం: స్టెప్ 1

తయారుచేయు విధానం: స్టెప్ 1

ఆలూ స్టఫ్ రెడీ అయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. తర్వాత శుభ్రం చేసి పెట్టుొకన్న గ్రీన్ క్యాప్సికమ్ తీసుకొని అందులో ప్రిపేర్ చేసి పెట్టుకొన్న ఆలూ మిశ్రమాన్ని గ్రీన్ క్యాప్సికమ్ లో స్టఫ్ చేయాలి.

తయారుచేయు విధానం: స్టెప్ 1

తయారుచేయు విధానం: స్టెప్ 1

ఇప్పుడు పాన్ లో నూనె వేసి వేడి అయ్యాక అందులో ఆలూ మిశ్రమంతో స్టఫ్ చేసుకొన్న గ్రీన్ క్యాప్సికమ్ ను ఒక్కొక్కేటి అమర్చుకోవాలి.

తయారుచేయు విధానం: స్టెప్ 1

తయారుచేయు విధానం: స్టెప్ 1

స్టఫ్డ్ గ్రీన్ క్యాప్సికమ్ షాలోఫ్రై చేసుకోవాలి మీడియం మంట మీద క్యాప్సికమ్ ను ఫ్రై చేసుకోవాలి. అవసరం అయితే మూత పెట్టుకోవచ్చు.

తయారుచేయు విధానం: స్టెప్ 1

తయారుచేయు విధానం: స్టెప్ 1

క్యాప్సికమ్ ను అన్ని వైపులా సమంగా కాలేవరకూ టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి . గోల్డ్ బ్రౌన్ కలర్లోకి మారే వరకూ వేగించుకోవాలి.

తయారుచేయు విధానం:

తయారుచేయు విధానం:

క్యాప్సికమ్ నూనెలో వేగి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మిగినలిన క్యాప్సికమ్ ను కూడా అందులో వేసి ఫ్రై చేసుకోవాలి . అంతే వీటిని తీసి వేడి వేడి పరాటాలు లేదా రోటీలతో సర్వ్ చేయవచ్చు.

న్యూట్రీషియన్ టిప్స్:

న్యూట్రీషియన్ టిప్స్:

క్యాప్సికమ్ తక్కువ క్యాలరీలున్న వెజిటేబుల్ మరియు 0గ్రామ్ ఫ్యాట్ కలిగి ఉన్నది . డైట్ రిచ్ వెజిటేబుల్ . వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల క్రోనిక్ డిజార్డర్స్ ప్రమాధాన్ని తగ్గించుకోవచ్చు.

చిట్కాలు:

చిట్కాలు:

క్యాప్సికమ్ శుభ్రం చేసి లోపలి విత్తనాలు మొత్తం తొలగించిన నీటిలో కడిగిన తర్వాత వీటిని అప్ అండ్ డౌన్ పెట్టడం వల్ల నీరు మొత్తం తొలగిపోయి తడిలేకుండా చేసుకొన్న తర్వాత ఆలూ మిశ్రమాన్ని స్టఫ్ చేయాల్సి ఉంటుంది.

English summary

Delicious Aloo Stuffed Capsicum Recipe: in Telugu

Delicious Aloo Stuffed Capsicum Recipe: in Telugu. This yummy vegetable recipe is not time consuming and best of all this stuffed capsicum recipe is healthy for a lot more reasons. To enjoy this yummy treat, you can add it as a serving with dal and rice or you can simply enjoy it with dry rotis.
Story first published: Thursday, June 4, 2015, 15:17 [IST]
Desktop Bottom Promotion