డెలిషియస్ చికెన్ సమోసా స్నాక్ రిసిపి

Subscribe to Boldsky

ఇంట్లో స్నేహితులతో , బందువులతో ఒక చిన్న పార్టీ ఏర్పాటు చేసుకున్నారా? మరి అయితే ఏదైనా వెరైటీగా ..డిఫరెంట్ గా వంట వండాలని కోరుకుంటున్నారా? ఇదిగో మీకోసం ఒక చికెన్ సమోస రిసిపి ఉత్తమ ఎంపిక.

ఫ్రిజ్ లో చికెన్ ఉంటే చాలు, మీకు నచ్చిన డిఫరెంట్ వంటకాలను రెడీ చేసేసుకోవచ్చు. వివిధ రకాల చికెన్ వంటల్లో చికెన్ సమోస రిసిపి ఒకటి.

రుచికరమైన ..నోరూరించే స్నాక్ రిసిని, చికెన్ సమోస రిసిపిని తయారుచేయడం చాలా సులభం. ముందుగానే అన్ని సిద్దంగా చేసుకుంటే, చాలు చివరి నిముషంలో జస్ట్ ఫ్రై చేసి, వేడి వేడిగో చట్నీ లేదా సాస్ తో సర్వ్ చేయడమే ఆలస్యం.చికెన్ సమసమో ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం..

సర్వింగ్ -6 సమోస రిసిపి

తయారుచేయడానికి పట్టే సమయం: 20

వండటానికి పట్టే సమయం : 20 నిముషాలు

కావల్సిన పదార్థాలు:

 • చికెన్ : 1 కప్పు
 • రెడ్ చిల్లీ పెప్ప్ పౌడర్: 2టీస్పూన్స్
 • గరం మసాల: 1tsp
 • పసుపు: 1/2tsp
 • సోంపు పౌడర్: 1tsp
 • పెప్పర్ : 1/2tsp
 • ధనియాలపొడి: 2 tsp
 • ఉప్పు: రుచికి సరిపడా
 • నూనె : డీఫ్ ఫ్రై చేయడానికి సరిపడ
 • ఉల్లిపాయలు: 3(సన్నగా తరిగినవి)
 • అల్లం పేస్ట్ : 1tbsp
 • వెల్లుల్లి పేస్ట్ : 1tbsp
 • పచ్చిమిర్చి : 3 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
 • గుడ్డు: 1
 • మైదా : 2 కప్పులు
 • నీళ్ళు సరిపడా

తయారీ విధానం:

1. ముందుగా పాన్ లో నూనె వేసి వేడి చేయాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులోనే అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో చికెన్ మిన్స్ ను జోడించాలి. తర్వాత అందులోనే సోంపు పౌడర్, మిరియాలు, ధనియాలపొడి, పసుపు, ఉప్పు, గరం మసాలా, కారం, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి మొత్తం మిశ్రమాన్ని కలగుపుకోవాలి.

Delicious Chicken Samosa Snack Recipe

2. ఈ మొత్తం మిశ్రమం బాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకుని, పిండి, గుడ్డు మరియు చిటికెడు ఉప్పు , మైదా వేసి మెత్తగా , మ్రుదువుగా పిండి కలిపి పెట్టుకోవాలి. 15 నిముషాల తర్వాత ఈ పిండి నుండి కొద్దిగా చేతిలోకి తీసుకుని, చిన్న బాల్స్ లా చేసి, ప్లాట్ గా రోల్ చేయాలి. చపాతీల్లా చుట్టుకుని, తర్వాత మద్యలో చికెన్ స్టఫ్ ను నింపి, అన్ని వైపుల క్లోజ్ చేస్తూ సమోసాల్లా ఒత్తుకోవాలి.

Delicious Chicken Samosa Snack Recipe

3. ఇలా కొన్ని సమోసాలు తయారుచేసుకున్న తర్వాత, డీప్ బాటమ్ పాన్ తీసుకుని, నూనె పోసి, వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో సమోసాలను వేసి బంగారువర్ణంలోకి మారే వరకూ వేగించి, తీసి బౌల్లో పెట్టుకోవాలి.

Delicious Chicken Samosa Snack Recipe

4. నూనె ఎక్కువగా ఉన్నట్లైతే పేపర్ టవల్ మీద వేసి, కొద్దిసేపటి తర్వాత వేరే ప్లేట్ లోకి మార్పుకుని, వేడి వేడిగా సర్వ్ చేయాలి. . చట్నీ , సాస్ మర్చిపోకండి...

English summary

Delicious Chicken Samosa Snack Recipe

Do you have a kitty party coming up and want to make something new for your girlfriends? Then, chicken samosa can be a great option. If you have chicken inside your refrigerator, you could go all creative with it. You can make several delicious dishes with chicken; and chicken samosa is one of them.
Story first published: Tuesday, November 29, 2016, 12:13 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter