For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మేతిఆలూ-పరోటా,రోటికి బెస్ట్ కాంబినేషన్

|

వింటర్ చాలా అందమైన సమయంలో ఎందుకంటే, ఈ సీజన్ గ్రీన్ వెజిటేబుల్స్ అధికంగా అందుబాటులో ఉంటాయి. మార్కెట్లో మొత్తం ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తో నిండి ఉంటుంది . ఈ వెజిటేబుల్స్ ఉపయోగించి అనేక వెజిటేరియన్ వంటలను తయారుచేయవచ్చు.

మన ఇండియంన్ కుషన్స్ లో తాజా మెంతికూర, బేబీ పొటాటోలను ఉపయోగించి మేతి ఆలూ తయారుచేయడం చాలా సులభం మరియు సింపుల్ ప్రిపరేషన్ . బేబీ పొటాటాలో అందుబాటులో లేకపోతే సాధారణ బంగాళదుంపలను ఉపయోగించవచ్చు. ఇది అధిక న్యూట్రీషిన్ ఫుడ్ మరియు హాట్ పరోటా మరియు రోటీలతో ఎంజాయ్ చేయవచ్చు...

Delicious Methi Aloo Recipe

కావల్సిన పదార్థాలు:
నూనె: 1tbsp
జీలకర్ర: 1/2tsp
పచ్చిమిర్చి: 3-4(మధ్యలోకి కట్ చేసుకోవాలి)
బేబీ పొటాటో: 1/2kg తాజావి
మెంతి ఆకు: 250grm(శుభ్రంగా కడి కట్ చేసుకోవాలి)
కొత్తిమీర తరుగు: 2tsp
పసుపు: 1/2tsp
కారం: 1tsp
డ్రై మ్యాంగో పౌడర్ 1/2tsp
ఉప్పు: రుచికి సరిపడా

తయారు చేయు విధానం :
1. ముందుగా బేబీ పొటాటోను ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి బాయిల్ చేయాలి. తర్వాత పొట్టు తొలగించి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత మందపాటి పాన్ లో నూనె వేసి, వేడి చేయాలి.
3. నూనె వేడిగా ఉన్నప్పుడు అందులో జీలకర్ర, వెల్లుల్లి మరియు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి .
4. వెల్లుల్లి బ్రౌన్ కలర్ లోకి మారే వరకూ ఫ్రై చేసుకోవాలి.
5. తర్వాత అందులో కొత్తిమీర, పసుపు, కారం, డ్రై మ్యాంగో పౌడర్ మరియు సాల్ట్ వేసి ఉడికించుకోవాలి
6. 2,3నిముషాలు ఉడికించుకొన్న తర్వాత అందులో ముందుగా ఉడికించి పెట్టుకొన్న బేబీ పొటాటో, మెంతి ఆకులను వేసి ఫ్రై చేసుకోవాలి.
7. మీడియం మంట పెట్టి, మూత పెట్టి, 8-10నిముషాలు వరకూ ఉడికించుకోవాలి .
8. అంతే రుచికరమైన మేతి ఆలూ రిసిపి రెడీ. ఇది రోటీ మరియు పరాటాలతో చాలా రుచికరంగా ఉంటుంది.

English summary

Delicious Methi Aloo Recipe

Winter is a lovely time because you can try out all kinds of green vegetables during this season. The market at this time is filled with green and leafy vegetables which can be used to prepare some of the most delicious vegetarian recipes.
Story first published: Wednesday, December 18, 2013, 11:54 [IST]
Desktop Bottom Promotion