రుచికరమైన పనీర్ కట్లెట్: వీడియో ..ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది..

మీరు ఎక్కువ కష్టపడకుండా, తేలికగా తయారు చేసుకునే కొన్ని వంటకాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. అనుకోకుండా అతిధులు వచ్చినపుడు, గొప్ప రక్షకుడిగా కొన్ని సులభంగా వండుకునే వంటకాలు చేయవచ్చు.

Subscribe to Boldsky

మీరు ఎక్కువ కష్టపడకుండా, తేలికగా తయారు చేసుకునే కొన్ని వంటకాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. అనుకోకుండా అతిధులు వచ్చినపుడు, గొప్ప రక్షకుడిగా కొన్ని సులభంగా వండుకునే వంటకాలు చేయవచ్చు.

మీ రేఫ్రేజిరేటర్ లోపల పనీర్ లేదా చీజ్ ఉంటే, మీకు సగం సమస్య తీరినట్టే. మీరు పనీర్ ను ఉపయోగించి కట్లెట్ లను తయారు చేయవచ్చు. ఈ నోరూరించే రుచికరమైన వంటను చాలా తేలికగా తయారుచేయవచ్చు, ఈ వంటకు చాలా తక్కువ పదార్ధాలు మాత్రమే అవసరమౌతాయి.

అందువల్ల, అవసరమైన పదార్ధాలు, చేసే పద్ధతి పై దృష్టి పెట్టండి.

Delicious Paneer Cutlet: Video

సేవలు - 8

తయారుచేయడానికి పట్టే సమయం – 10 నిమిషాలు

వండటానికి పట్టే సమయం – 15 నిముషాలు

కావలసిన పదార్ధాలు:

1.కాటేజ్ చీజ్ (పనీర్) – 2 కప్పులు (తరిగినది)

2.ఉడికించిన అన్నం – ½ కప్పు (చల్లారినది)

3.రుచికి సరిపడా ఉప్పు

4.పచ్చిమిర్చి – 1 ½ టేబుల్ స్పూను (సన్నగా తరిగినవి)

Delicious Paneer Cutlet: Video

5.మైదా – ¼ కప్పు

6.కొత్తిమీర – ¼ టీస్పూను (తరిగినది)

7.క్యాప్సికం – ½ కప్పు వివిధ రంగులవి (సన్నగా తరిగినవి)

8.పైన కోటింగ్ కి బ్రెడ్ పొడి

9.నూనె – 2 టేబుల్ స్పూన్లు

Delicious Paneer Cutlet: Video

తయారు చేసే విధానం:

1.సన్నగా తరిగిన చీజ్ తీసుకుని అందులో ఉడికించిన అన్నాన్ని కలపండి.

2.ఇప్పుడు, మైదా, ఉప్పు, పచ్చిమిర్చి వేసి బాగా కలపండి.

3.ఇప్పుడు, కొత్తిమీర, తరిగిన క్యాప్సికం వేయండి. మీరు వివిధ రకాల క్యాప్సికం తీసుకున్నట్లయితే, మీ కట్లెట్ లు చాలా అందంగా కనిపిస్తాయి.

Delicious Paneer Cutlet: Video

4.ఈ పదార్ధాలు అన్నిటినీ బాగా కలిపి, చేతితో చిన్నచిన్న ఉండలుగా చేయండి.

5.ఇప్పుడు, తవా వేడిచేసి, నూనె రాయండి.

6.దానిపై కట్లెట్ లను ఉంచి, బంగారు రంగు వచ్చే వరకు కాల్చండి.

7.రెండువైపులా బాగా ఉడికిన తరువాత, పుదీనా పచ్చడి లేదా టొమాటో సాస్ తో వేడిగా వడ్డించండి.

English summary

Delicious Paneer Cutlet: Video

There are some recipes where you don’t need to put much effort and they can be prepared very easily. When there are sudden guests coming in, some of the easy to cook recipes can come in as a great saviour.
Please Wait while comments are loading...
Subscribe Newsletter