For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రుచికరమైన పొటాటో & క్యాబేజ్ కర్రీ రిసిపి

|

మీ ఫేవరెట్ వెజిటేబుల్స్ అందుబాటులో ఉండే సీజన్ ఇది. క్యారెట్, కాలీఫ్లవర్, క్యాబేజ్, టర్నిప్ మరియు ఇతర గ్రీన్ వెజిటేబుల్స్ ఈ సమంయలో మార్కెట్లో ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. కాబట్టి, ఈ సౌకర్యాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలి. ఈ పూర్తి పోషకాల యొక్క ఆహారాలతో మీ ప్లేట్స్ ను నిండుగా నింపేయండి.

ఈ రోజు, మీకోసం ఒక సింపుల్ మరియు రుచికరమైన రిసిపిని మీ ముందు ఉంచుతున్నాం. క్యాబేజ్ మరయిు పొటాటో కర్రీ చాలా సింపుల్ ప్రిపరేషన్, దీన్నితయారుచేయడానిని ఎక్కువ సమయం అవసరం లేదు. మీరు రోజులో ఎటువంటి భోజనాన్నైనా తీసుకోవచ్చు మీరు మీ లంచ్ బాక్స్ కు కూడా తీసుకోవచ్చు. మరి మనం ఏవిధంగా తయారుచేయాలో చూద్దాం...

Cabbage Curry Recipe

కావల్సిన పదార్థాలు:
క్యాబేజ్ : 1 (మీడియం సైజ్, తురుముకోవాలి)
బంగాళ దుంపలు: 3 (diced)
ఉల్లిపాయ: 1 (ముక్కలు)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tsp
టమోటో: 2 (చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
జీలకర్ర పొడి: 2tsp
ధనియాల పొడి: 1tsp
పసుపు: 1tsp
పచ్చిమిర్చి పేస్ట్: 1tsp
గరం మసాలా పొడి : ½tsp
ఉప్పు: రుచికి సరిపడా
జీలకర్ర: 1tsp
బే ఆకు 1
ఆయిల్: 2tbsp
కొత్తిమీర తరుగు: 2tbsp(తరిగినది)

తయారుచేయు విధానం:
1. ముందుగా క్యాబేజ్ ను నీటిలో క్యాబేజ్ తురుమును వేసి బాగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో నూనె వేసి, జీలకర్ర మరియు బిర్యాని ఆకు వేసి ఒక నిముషం వేగించుకోవాలి.
3. తర్వాత అందులో బంగాళదుంప ముక్కలను, ఉప్పు కూడా వేసి 3,4నిముషాలు మీడియం మంట మీద వేయించుకోవాలి.
4. ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ వేసి 4,5 నిముషాలు వేయించుకోవాలి.
5. తర్వాత టమోటో ముక్కలు, జీలకర్ర, పసుపు, ధనియాల పొడి వేసి, మరో 2,3నిముషాలు వేగించుకోవాలి.
6. ఇప్పుడు అందులో క్యాబేజ్ తుమును కూడా వేసి మిక్స్ చేస్తూ వేగించుకోవాలి.
7. రుచికి సరిపడా ఉప్పు, గరం మసాలా, వేసి మరో 5-6నిముషాలు వేగించుకోవాలి.
8. క్యాబేజ్ నుండి నీరు వస్తున్నప్పుడు మూత పెట్టి, మరో పది నిముషాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలి. ఒక సారి ఉడికిందని నిర్ధారించుకొన్న తర్వాత స్టౌ ఆఫ్ చేసి, క్రిందికి దింపుకోవాలి.
9. చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే రుచికరమైన పొటాటో క్యాబేజ్ కర్రీ రెడీ ఈ డిష్ ను రోటీలు మరియు ఉడికించిన అన్నంతో పాటు తీసుకోవచ్చు.

English summary

Delicious Potato - Cabbage Curry Recipe

The season of your favourite vegetables is here. Carrots, cauliflower, cabbage, turnip and so many other green vegetables are available during this time in the market. So, take advantage of this availability and fill your plates with all these nutritious veggies.
Story first published: Monday, December 30, 2013, 12:22 [IST]
Desktop Bottom Promotion