For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డెలిషియస్ వెజిటేబుల్ దాల్ రిసిసి

|

పప్పు లేకుండా ఇండియన్ మీల్స్ పూర్తి కాదు. చపాతీలోకి ఫర్ ఫెక్ట్ గా కాంబినేషన్ వంటలు చాలా ఉండకపోవచ్చు. కానీ, ఒక కప్పు పప్పు ఉంటే చాలా ఏ కంప్లైయిట్స్ లేకుండా హ్యాపీ తినేయవచ్చు . ఇంకా పప్పులతో తయారుచేసే వంటలు చాలా రుచికరంగా ఉంటాయి. రుచి మాత్రమే కాదు పూర్తి పోషకాలతో ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అందులో వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటారు.

పప్పును కూడా వివిధ పద్దతుల్లో తయారుచేస్తారు. పప్పకు కొన్ని హెల్తీ వెజిటేబుల్స్ చేర్చడం వల్ల మరింత ఆరోగ్యకరం. డిఫరెంట్ టేస్ట్ కూడా అందిస్తుంది. వెజిటేబుల్స్ మాత్రమే కాదు, కొన్నిమసాలా దినుసులు ఉపయోగించడం వల్ల వెజిటేబుల్ దాల్ మంచి సువాసనతో నోరూరిస్తుంటుంది. అటువంటి వెజిటేబుల్ దాల్ రిసిపి మీకోసం...

Delicious Vegetable Dal Recipe

కావల్సిన పదర్థాలు:
పెసరపప్పు: 1/2cup
కందిపప్పు: 1/2cup
ఉల్లిపాయ: 1 (చిన్న ముక్కలుగా తరిగినవి)
క్యారెట్ 2 (చిన్న ముక్కలుగా తరిగినవి)
గ్రీన్ బీన్స్: 8: 20 (తరిగినవి)
పచ్చిమిర్చి :3 7 (మద్యకు కట్ చేసుకోవాలి)
వెల్లుల్లి రెబ్బలు: 6- 7(లైట్ గా దంచుకోవాలి)
టమోటో: 1 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పసుపు: 2tsp
కారం: 1tsp
గరం మసాలా: 1tsp
జీలకర్ర: 1tsp
బే ఆకు: 1
ఎండు మిరప: 1
ఉప్పు: రుచికి సరిపడా
నిమ్మరసం: 1tsp
నెయ్యి: 1tbsp

తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక గిన్నెలో పెసరపప్పు మరియు కందిపప్పు రెండూ వేసి, బాగా శుభ్రం చేసి, 25-30నిముషాలు నానబెట్టుకోవాలి.
2. తర్వత ప్రెజర్ కుక్కర్ లో నానబెట్టుకొన్న పప్పును నీటితో సహా అలాగే వేసి, కొద్దిగా ఉప్పు మరియు పసుపు వేయాలి.
3. కుక్కర్ మూత పెట్టి 3,4విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి. ఒక సారి ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి పక్కన పెట్టి, ఆవిరి మొత్తం పోయే వరకూ 5నిముషాలు అలాగే ఉంచాలి.
4. అంతలోపు, డీప్ బాటమ్ పాన్ ను స్టౌ మీద పెట్టి, అందులో నెయ్యి వేసి వేడి చేయాలి. తర్వాత అందులో జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత అందులో బిర్యాని ఆకు,మరియు ఎండు మిర్చి వేయాలి.
5. ఒక నిముషం తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మీడియం మంట మీద ఫ్రై చేయాలి. తర్వాత అందులోనే క్యారెట్, వెల్లుల్లి, పచ్చిమిర్చి మరియు బీన్స్ ముక్కలు వేసి మూడు నాలుగు నిముషాలు వేయించుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు జోడించి మిక్స్ చేయాలి.(ఇంతకు ముందే పప్పులు ఉప్పు, పసుపు వేశారని గుర్తించుకొని, తగినంత మాత్రమే వేసుకోవాలి)
6. తర్వాత అందులో టమోటో ముక్కలు కూడా వేసి మరో 4,5నిముషాలు వేయించుకోవాలి.
7. ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ మూత తీసి, పప్పును ఒక సారి బాగా కలబెట్టి, స్టౌ మీద వేగుతున్న వెజిటేబుల్ మిశ్రమంలో పోయాలి.
8. ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని మీడియం మంట మీద ఉడికించుకోవాలి. వెజిటేబుల్ ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత అందులో కారం, గరం మసాలా, వేసి బాగా మిక్స్ చేసి ఉడికించుకోవాలి.
8. వెజిటేబుల్ దాల్ మీడయంగా చిక్కగా ఉండాలనుకుంటే కొద్దిగా నీళ్ళుమిక్స్ చేసుకోవాలి. తర్వాత కొద్దిసేపు ఉడికించి స్టౌ ఆఫ్ చేసి, కొత్తిమీర తరుగుతో గార్నిస్ చేసి, సర్వ్ చేయాలి . చివరగా నిమ్మరసం మిక్స్ చేయాలి. అంతే తినడానికి వెజిటేబుల్ దాల్ రెడ . రోటీ, రైస్ కు బెస్ట్ కాంబినేషన్.

English summary

Delicious Vegetable Dal Recipe

No Indian meal is ever deemed complete without having a bowl of dal on your plate. You may not have a lot of curries with your chapati, but if you have a bowl of dal, you can have a hearty meal without complaints.
Story first published: Friday, December 13, 2013, 16:36 [IST]
Desktop Bottom Promotion