For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగాళదుంప-పచ్చిబఠానీ ఫ్రై

|

ప్రస్తుత మార్కెట్లో ఎక్కడ చూసిన గ్రీన్ కలర్ లో రకరాకా వెజిటేబుల్స్ కనబడుతన్నాయి. వాటిలో పచ్చిబఠానీలు కూడా ఒకటి. ఈ పచ్చిబఠానీలు ఆరోగ్యకరమైనవి మాత్రమే కాదు, నోరూరించే రుచిని కూడా అంధిస్తాయి. ఈ గ్రీన్ పీస్ ను అనేక ఇండియన్ డిష్ లలో ఉపయోగిస్తుంటారు.

పచ్చిబఠానీలను ఉపయోగించి తయారుచేసే వంటలు అనేకం ఉన్నాయి. పచ్చిబఠానీలను మటర్ అని కూడా అంటారు. వీటితో మటర్ పనీర్ నుండి ఆలూ మటర్ వరకూ వివిధ వెరైటీ వంటలను వండుతారు. పనిచేసే ఉద్యోగస్తులకు ఉరుకులు పరుగుల జీవితంలో త్వరగా తయారయ్యే వంటలకు ఎక్కువ ప్రధాన్యత ఇస్తుంటారు. అటువంటి వంటకాలలో ఈ మటర్ పనీర్ కూడా ఒకటి. చాలా సులభం, చాలా తర్వగా రెడీ చేసేయవచ్చు. మరి ఈ సీజనల్ వెజిటేబుల్స్ తో ఒక స్పెషల్ వంటను ఎలా తయారుచేయాలో చూద్దం ...

Dry Aloo Matar Recipe

కావల్సిన పదార్థాలు:
బంగాళ దుంపలు: 3-4
ఉల్లిపాయ: 2 (సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి)
మటర్: ½cup
పచ్చిమిర్చి: 2(చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
పసుపు: 1tsp
కారం: 1tsp
జీలకర్ర: ½tsp
ఆవాలు: 1/2tsp
కరివేపాకు: రెండు రెమ్మలు
ఉప్పు: రుచికి సరిపడా
ఆయిల్: 2tsp

తయారుచేయు విధానం:
1. ముందుగా బంగాళదుంపలను శుభ్రంగా కడిగి రెండు బాగాలుగా కట్ చేయాలి.
2. తర్వాత ప్రెజర్ కుక్కర్ లో వేసి, కొద్దిగా నీళ్ళు పోసి 2-3విజిల్స్ వచ్చేవరకూ ఉడికించుకోవాలి.
3. రెండు మూడు విజిల్స్ వచ్చిన తర్వాత, స్టౌ ఆఫ్ చేసి ఆవిరి పూర్తిగా తగ్గిపోయే వరకూ ఉండి, తర్వాత మూత తీసి బంగాళదుంపలు చల్లారనివ్వాలి. వాటికి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు ఫ్రైయింగ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక అందులో, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేగించుకోవాలి.
5. రెండు మూడు నిముషాలు బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకూ వేగించిన తర్వాత అందులో పచ్చిబటానీ పసుపు మరియు ఉప్పు వేసి బాగా వేగించాలి.
6. ఇప్పుడు, అందులో పచ్చిమిర్చి, కూడా వేసి మిక్స్ చేస్తూ వేగించుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయముక్కలు కూడా వేసి మీడియంగా వేగిన తర్వాత అందులో కారం కూడా వేసి, మిక్స్ చేస్తూ వేగించుకోవాలి.
7. ఇప్పుడు అందులో ఉడికించి పొట్టు తీసిపెట్టుకొన్న బంగళాదుంపులు వేసి బాగా మిక్స్ చేస్తూ మరో 5నిముషాలు వేగించాలి. అంతే ఆలూ మటర్ రెడీ. ఈ సాఫ్ట్ రిసిపిని రోటీలతో సర్వ్ చేయండి.

English summary

Dry Aloo Matar Recipe

The season of green peas is here. It is time to buy some fresh green peas and not the frozen ones and prepare some mouth watering dishes.
Story first published: Monday, November 25, 2013, 12:30 [IST]
Desktop Bottom Promotion