For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డ్రై ఫ్రూట్ పులావ్: కిడ్స్ స్పెషల్

|

సాయంత్ర సమయంలో పిల్లలను సంతృప్తి పరచాలంటే, ఒక రుచికరమైన వంటను తయారుచేయాల్సిందే. అటువంటి రుచికరమైన వంటల్లో ఒకటి స్వీట్ డిష్ డ్రైఫ్రూట్ పులావ్. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. మరియు పిల్లలకు చాలా ఇష్టం.

ఈ రైస్ రిసిపిలో కొన్నిపెప్పర్ కార్న్ కూడా జోడిస్తాము. కానీ వీటిని చాలా తక్కువగా ఉపయోగించాలి లేదంటే టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి ఎంత మేర అవసరం ఉంటుందో అంతే తీసుకోవాలి. డ్రై ఫ్రూట్ పులావ్ రిసిపి పిల్లలకు మాత్రమే కాదు, పెద్దలకు కూడా చాలా ఇష్టమైన వంట. మరి పిల్లలకు మరియు పెద్దలకు ఈ స్పెషల్ వంటను సాయంత్రం సమయంలో వండి పెట్టవచ్చు. మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Dry Fruit Pulav For Your Kiddies


కావల్సిన పదార్థాలు:

బియ్యం: 2cups,
బాదం: 10
ద్రాక్ష: 10
జీడిపప్పుం 10
నెయ్యి: 2tbsp
పెప్పర్ కార్న్: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
బిర్యానీ ఆకు: 2
కుంకుమ పువ్వు: చిటికెడు

1. ముందుగా నాన్ స్టిక్ పాన్ లో కొద్దిగా నీళ్ళు పోసి వేడి చేయాలి.
2. అంతలోపు మరో నాన్ స్టిక్ పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి వేడి అయ్యాక అందులో బిర్యానీ ఆకు, పెప్పర్ కార్న్స్, బాదం, జీడిపప్పు, ద్రాక్ష, నెయ్యి వేసి ఫ్రై చేసుకోవాలి.
3. తర్వాత అందులోనే బియ్యం కూడా కడిగి వేసి మరో 2-3నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
4. ఇప్పుడు అందులో ఉప్పు, మరియు కుంకుమ పువ్వు వేసి మొత్తం మిశ్రమాన్ని మరో అరనిముషం పాటు ఫ్రై చేసి తర్వాత 3 కప్పులు హాట్ వాటర్ ను ఇందులో పోయాలి.
5. మొత్తం మిశ్రమం ఉడకడం ప్రాంభమవగానే, మూత పెట్టి బియ్యం మెత్తగా ఉడికే వరకూ ఉడికించుకోవాలి. అంతే రుచికరమైన ఈజీ డ్రై ఫ్రూట్ పులావ్ పిల్లల కోసం రెడీ . ఈ డ్రై ఫ్రూట్ పులావ్ కు స్వీట్ లేదా కార రైతాను సైడ్ గా సర్వ్ చేయవచ్చు.

English summary

Dry Fruit Pulav For Your Kiddies

This evening pamper your little ones with a sweet delight. No, we are not talking about a sweet dish! This dry fruit pulav is yummy at the same time delicious to indulge in. The ingredients in this rice recipe is dry fruits and a handful of spices.
Story first published: Tuesday, August 12, 2014, 17:59 [IST]
Desktop Bottom Promotion