For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పూర్తి పోషకాలను అంధించే డ్రైఫ్రూట్ పులావ్

|

పలావ్ ను సాధారణంగా వివిధ రకాలుగా తయారుచేస్తారు. టమోటో పులావ్, పచ్చిబఠానీ, పొటాటో పులావ్, వెజిటేబుల్ పులావ్, సోయా బీన్ పులావ్ ఇలా వివిధ రకాలుగా తయారుచేస్తారు. అయితే డ్రై ఫ్రూట్స్ వినియోగించి పులావ్ ను తయారుచేస్తే చాలా టేస్టీగా ఉంటుంది.

ఈ డ్రై ఫ్రూట్స్ పులావ్ టేస్టీ మాత్రమే కాదు, పూర్తి పోషకాలను అంధించే పులావ్ ఇది. ఈ పులావ్ కు మరో ప్రత్యేకత ఉంది. పులావ్ ను బాస్మతి రైస్ తో తయారుచేస్తారు, కానీ ఈ పులావ్ ను బక్వీట్ లేదా సామ కె చావల్ తో తయారుచేస్తారు. ముఖ్యంగా వీటితో తయారుచేసే వంటలు ముఖ్యంగా ఉపవాసం సమయంలో ఎక్కువగా తీసుకుంటారు. మరి పూర్తి పోషకాలను అంధించే ఈ పులావ్ ను ఎలా తయారుచేయాలో చూద్దాం...

Dry Fruits Pulao-Healthy and Tasty

కావల్సిన పదార్థాలు:
సామ కే చావల్ / Barnyard millet - 1cup
నెయ్యి - 2 tsp
జీలకర్ర - 1 tsp
లవంగము - 2
బ్లాక్ ఏలకులు - 1
జీడిపప్పు - 4-5 (మద్యకు కట్ చేసుకోవాలి)
బాదం- 4-5 (మద్యకు కట్ చేసుకోవాలి)
కిస్మిస్ - 8-10
గ్రీన్ చిల్లి - 1 (మద్యకు కట్ చేసుకోవాలి)
నీరు - 2 కప్పులు
ఉప్పు - రుచికి సరిపడా
గ్రీన్ బటానీలు - 1/4 cup
నిమ్మరసం - 2 tsp
కొత్తిమీర - 1 tbsp(సన్నగా తరిగిపెట్టుకోవాలి)

తయారుచేయు విధానం:
1. మిల్లెట్ ను (సామ కే ఛావల్)ను శుభ్రంగా కడిగి 2-3గంటల పాటు నానబెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో నెయ్యి వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, లవంగాలు మరాయు బ్లాక్ యాలకులు వేసి, ఒక నిముషం వేయించుకోవాలి.
3. ఇప్పుడు అందులో జీడిపప్పు, బాదం, మరియు ద్రాక్ష కూడా వేసి 15-20నిముషాలు వేయించుకోవాలి.
4. ఇప్పుడు అందులో పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. తర్వాత సరిపడా నీళ్ళు పోసి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.
5. ఇప్పుడు అందులో నిమ్మరసం మరియు కొత్తిమీర వేసి మిక్స్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. కొత్తిమీర చట్నీ బెస్ట్ కాంబినేషన్.

English summary

Dry Fruits Pulao-Healthy and Tasty

Sama ke chawal, or samvat rice or Mordhna are the Hindi names for Barnyard millet. It can be eaten during fasting and is a good source of carbohydrates and proteins.
Story first published: Friday, February 28, 2014, 11:50 [IST]
Desktop Bottom Promotion