For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డాబా స్టైల్ దాల్ మఖానీ: టేస్టీ మీల్ రిసిపి

|

సాధారణంగా రోడ్ ట్రిప్ వెళ్ళేటప్పుడు, రోడ్ మార్గం మద్యలో అక్కడక్కడా చిన్న చిన్న డాబాలు కబడుతుంటాయి. ఈ డాబాల్లో వంటలు చాలా సింపుల్ గా వెరైటీగా టేస్టీగా ఉంటాయి . ముఖ్యంగా ఇటువంటి టేస్టీ డిఫరెంట్ స్టైల్ వంటలను హైవేలల్లో ఎక్కువగా చూస్తుంటాము .

డావాల్లో వారు చాలా డిఫరెంట్ టేస్ట్ కలిగి వంటలను సర్వ్ చేస్తుంటారు. అలాంటి వంటల్లో రాజ్మా దాల్ మఖానీ ఒకటి. చాలా అద్భుతమైన రుచి కలిగి క్రీమీ స్ట్రక్చర్ కలిగి ఉంటుంది. చూస్తూనే నోరూరిస్తుంటుంది. ఇది మీల్స్ మరియు రోటీ, చపాతీలకు చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఈ డాబా స్టైల్ దాల్ మకానీ మీరు కూడా రుచి చూడాలంటే ఎలా తయారుచేయాలో క్రింది విధంగా తెలుసుకోండి.....

Easy Dhaba Style Dal Makhani Recipe

కావల్సిన పదార్థాలు:
ఉద్దిపప్పు: 1/2cup
రాజ్మా: 1/4cup
వెల్లుల్లి: 6-7 లవంగాలు
పచ్చిమిర్చి: 2-3
టమోటాలు: 4
జీలకర్ర: 1tsp
మెంతి (మెంతులు) : 1/2tsp
అల్లం: 1 మీడియం ముక్క (పేస్ట్ చేసుకోవాలి)
అల్లం ముక్కలు: కొద్దిగా గార్నిష్ చేయడానికి
పసుపు పొడి: 1tsp
కారం పొడి: 1tsp
గరం మసాలా పొడి: 1/2 tsp
ధనియా (ధనియా) పొడి: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
బట్టర్ (గార్నిషింగ్ కోసం): 2tbsp
ఫ్రెష్ క్రీమ్: 2tbsp ప్రకారం

తయారుచేయు విధానం:
1. ముందుగా ఉద్దిపప్పు మరియు రాజ్మను రెండింటిని శుభ్రంగా కడిగి 3-4గంటల సేపు నానబెట్టుకోవాలి.
2. 4 గంటల తర్వాత రాజ్మాలోని నీరు వంపేసి, ప్రెజర్ కుక్కర్ లో వేసి, కొద్దిగా ఉప్పు వేసి, దాంతో పాటు అల్లం ముక్కులు మరియు 3కప్పుల నీరు పోసి 3విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
3.ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి ప్రెజర్ మొత్తం పోయే వరకూ అలాగే పక్కనుంచాలి.
4. అంతలోపు, మిక్సీగ్రైండర్ లో అల్లం, టమోటోలు, వెల్లుల్లి మరియు పచ్చిమిర్చి వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
5. ఇప్పుడు మరొక పాన్ లో కొద్దిగా బట్టర్ వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, మెంతులు ఒక సెకను వేగించుకోవాలి.
6. తర్వాత అందులో గ్రైండ్ చేసుకొన్న టమోటో పేస్ట్ వేసి 5నిముషాలు మీడియం మంట మీద ఫ్ై చేసుకోవాలి.
7. ఇప్పుడు దనియాలపొడి, పసుపు, కారం, మరియు గరం మసాలా పౌడర్ వేసి మరో 5నిముషాలు ప్రై చేస్తూ ఉడికించుకోవాలి.
8. ఇప్పుడు అందులో ముందుగా కుక్కర్ లో ఉడికించు పెట్టుకొన్న దాల్ వేసి, 5నిముషాలు సింమ్ లో ఉంచి ఉడికించుకోవాలి.
9. ఇలా మొత్తం ఉడికించుకొన్నతర్వాత స్టౌ ఆఫ్ చేసి అల్లం ముక్కలు మరియు ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేయాలి. అంతే డాబా స్టైల్ దాల్ మఖానీ రెడీ . ఇది రోటీ మరియు రైస్ కు అద్భుతంగా ఉంటుంది.

English summary

Easy Dhaba Style Dal Makhani Recipe

People who love to take road trips once in while would be familiar with the roadside eateries on the highways. These small, dingy shops are known as the dhabas. And they serve some of most delicious foods which you can ever eat. They mostly serve the tired travellers who pull over for a hot and hearty meal before heading towards their destination.
Story first published: Thursday, September 11, 2014, 13:33 [IST]
Desktop Bottom Promotion