For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈజీ అండ్ హెల్తీ బ్రౌన్ రైస్ దోసె: బ్రేక్ ఫాస్ట్ రిసిపి

|

భారత్ లో ముఖ్యంగా సౌంత్ స్టేట్స్ లో దోసె బాగా పాపులర్ అయినటువంటి బ్రేక్ ఫాస్ట్ రిసిపి. దోసెలో వివిధ రకాలున్నాయి. దోసెను వివిధ రకాల వస్తువులను వేసి తయారు చేసుకుంటారు. సాధారణంగా మనం తయారు చేసుకొనే దోసె కాకుండా కొంచెం వెరైటీగా తయారు చేసుకొనే దోసెలు ప్రతి రోజూ మనల్ని టెప్ట్ చేస్తుంటాయి. ఇలా వెరైటీ దోసెలను చాలా ప్రదేశాల్లో సర్వ్ చేస్తారు. దాంతో పాటు, చట్నీ సాంబర్ చాలా రుచిగా ఉంటాయి.

దోసెను ప్లెయిన్ దోసెగాను లేదా వెరైటీగాను తయారు చేసుకోవచ్చు. దోసె రకాల్లో 80 వరకూ ఉన్నాయి. వివిధ వెరైటీల్లోని దోసెలు ఫుడ్ సెంటర్లలో దొరకడం మనం చూస్తూనే ఉంటాం. అయితే బ్రౌన్ రైస్ దోసె గురించి మీకు అంతగా తెలుసుండకపోవచ్చు . బ్రౌన్ రైస్ దోసె అంటే ఏమని మీకు ఆశ్చర్యం కలగవచ్చు, దీన్ని ఎర్రబియ్యంతో తయారుచేస్తారు, ఈ దోసెలు త్వరగా పొట్టనింపుతాయి, ఆరోగ్యంగా మరియు రోజంతా ఆకలి కానివ్వదు . మరి ఈ హెల్తీ బ్రౌన్ రైస్ దోసెను ఎలా తయారుచేయాలో చూద్దాం...

Easy And Healthy Brown Rice Dosa Breakfast

కావల్సిన పదార్థాలు:

బ్రౌన్ రైస్: 3cups
ఉద్దిపప్పు: 1cup
శెనగపప్పు: 1/2cup
పెసరపప్పు: 1/2cup
కందిపప్పు: 1/2cup
అటుకులు: 1cup
మెంతులు: 1tbsp
నూనె: కొద్దిగా

తయారుచేయు విధానం:
1. ముందుగా బ్రౌన్ రైస్(ఎర్రబియ్యం), ఉద్దిపప్పు, శెనగపప్పు, పెసరపప్పు, మరియు కందిపప్పును శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్ళు పోసి, రాత్రంతా నానబెట్టాలి.
2. ఉదయం అటుకులను ఒక గంట పాటు నీటిలో నానబెట్టాలి.
3. ఇప్పుడు, బ్రౌన్ రైస్ మిశ్రమం, అటుకులు మరియు పప్పు అన్ని మిక్సీ జార్ లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఒక సారి బాగా గ్రైండ్ చేసుకొన్నాక, అందులో కొద్దిగా ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత కొద్దిగా నీళ్ళు పోసి, దోసె పిండిలా కలుపుకొని, గది ఉష్ణోగ్రతలో 8గంటల పాట పిండిని అలాగే పెట్టాలి.
4. ఇలా చేయడం వల్ల పిండి పులుస్తుంది బ్రౌన్ రైస్ దోసె క్రిస్పీగా టేస్ట్ గా వస్తుంది.
5. 8గంటలు పిండి నానిన తర్వాత స్టౌ మీద తవా పెట్టి, నూనె రాయాలి. తర్వాత పిండిని గరిటతో తీసుకొని తవా మీద వేసి, గుండ్రంగా దోసెలాగా పోయాలి.
6. మంటను మీడియంగా పెట్టి రెండు ప్రక్కలా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ కాల్చుకోవాలి . అంతే హెల్తీ బ్రౌన్ రైస్ దోసె సర్వ్ చేయడానికి రెడీ. దీన్ని కొబ్బరి చట్నీ లేదా టమోటో చట్నీతో సర్వ్ చేస్తే చాలా రుచికరంగా ఉంటుంది. ఇంకా మీకు అవసరం అనుకుంటే మామిడి లేదా నిమ్మకాయ ఊరగాయను కూడా వడ్డించవచ్చు .

English summary

Easy And Healthy Brown Rice Dosa Breakfast

Brown rice dosa is something that you would not be too familiar with. Are you wondering what the brown rice dosa is about? It is a healthy dosa recipe made of brown rice flour. It keeps you refreshed and healthy throughout the day.
Story first published: Monday, November 17, 2014, 10:50 [IST]
Desktop Bottom Promotion