For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

న్యూట్రిషినల్ హెల్తీ ఫుడ్: పెసరపప్పు-పాకకూర కర్రీ

|

వెజిటేరియన్ వంటల్లో గ్రీన్ లీఫీ వంటలు చాలా ప్రత్యేకమైనవి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. పెసరపప్పు, మరియు పాలకూరలో అనేక న్యూట్రీషియన్స్, ప్రోటీన్స్ కలిగి ఉంటాయి. ఈ రెండింటి కాంబినేషన్ లో కర్రీ రుచికరంగా ఉంటుంది. మరియు ఆరోగ్యం కూడా..

పెసరపప్పును ఉపయోగించడం వల్ల మన శరీరానికి తగినన్ని పోషకాలు అందడంతో పాటు, శరీరానికి చలువ చేస్తుంది. బౌల్ మూమెంట్ సాఫీగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండే ఈ రెండు ఫుడ్ కాంబినేషన్ తో మీరు కూడా టేస్ట్ చేయాలంటే..ఈక్రింది పద్దతిను అనుసరించాల్సిందే...

Easy To Make Moong Dal & Palak Recipe

కావల్సిన పదార్థాలు:
పెసరపప్పు : 1cuup
తాజాగా ఉండే పాలకూర: 1కట్ట(విడిపించి శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి)
వెల్లుల్లి: 1tsp(చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
అల్లం: 1tsp(చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయలు: 1cup(సన్నగా తరిగి పెట్టుకోవాలి
టమోటో: 3/4cup(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
శెనగపిండి: 1tsp
పెరుగు : 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా
ఇంగువ: చిటికెడు
కొత్తిమీర: కొద్దిగా
గరం మసాలా: 1/2tsp
కారం : కొద్దిగా

తయారుచేయు విధానం:
1. ముందుగా పెసరపప్పు మరియు ఆకుకూర ఒక పాన్ లో వేసి సరిపడా కొద్దిగా నీళ్ళు పోసి ఉడికించుకోవాలి.
2. తర్వాత అందులోనే ఉప్పు, ధనియాలపొడి, ఇంగువ వేసి మరో 10నిముషాలు ఉడికించుకోవాలి.
3. తర్వాత శెనగిపిండిలో, పెరుగు వేసి పేస్ట్ చేసుకొని ఈ మిశ్రమాన్ని ఉడుకుతున్న పాలకూర మిశ్రమంలో వేసి మీడయం మంట మీద ఉడికించుకోవాలి ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసి మరో రెండు మూడూ నిముషాలు ఉడికించుకోవాలి.
4. పప్పు మొత్తం రెడీ అయిన తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి, వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి.
5. తర్వాత అందులో టమోటో ముక్కలు, గరం మసాలా, వెల్లుల్లి, అల్లం ముక్కులు మరియు రెడ్ చిల్లీ పెప్పర్స్ వేసి మీడియం మంట మీద వేయించుకోవాలి.
6. మొత్తం మిశ్రమం రెండు నిముషాలు వేగిన తర్వాత అందులో ముందుగా ఉడికించి పెట్టుకొన్న పెసరపప్పు-పాలకూర మిశ్రమాన్ని పోసి బాగా మిక్స్ చేసి రెండు మూడు నిముషాలు సిమ్ లో పెట్టాలి. అంతే పెసరపప్పు -పాలక్ కర్రీ రెడీ. దీన్ని వేడి వేడిగా చపాతీ , లేదా రైస్ తో సర్వ్ చేయండి.

English summary

Easy To Make Moong Dal & Palak Recipe

Moong dal and palak (spinach) is a nutritious food. Check out the healthy and easy to make moong dal and palak recipe:
Story first published: Thursday, March 13, 2014, 12:20 [IST]
Desktop Bottom Promotion