For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మలై కోఫ్తా రిసిపి: వెజిటేరియన్ స్పెషల్

|

మలైకోఫ్తా ఒక అద్భుతమైన రుచి కలిగినటువంటి వెజిటేరియన్ రిసిపి. ఈ వంటను ఎక్కువగా నార్త్ ఇండియన్ రెస్టారెంట్స్ లో సర్వ్ చేస్తుంటారు . అంతే కాదు, నార్త్ ఇండియన్స్ ఏ పార్టీయైనా, మరియు ఫామిలీ ఫంక్షన్స్ అయినా, ఈ వంటను ఒక సిగ్నేచర్ డిష్ గా వండుతుంటారు. ఇంకా ఇది వెజిటేరియన్ మరియు నాన్ వెజిటేరియన్ వారికి ఇష్టమైనటువంటి మంచి ఫ్లేవర్ మరియు టేస్ట్ కలిగి ఉంటుంది.

మలైకోఫ్తా గురించి మీరు వినేటప్పుడు, ఇది తయారుచేయడానికి చాలా ఎక్కువ టైమ్ పడుతుందనుకుంటారు. మరియు తయారుచేసే పద్దతి కూడా డిఫరెంట్ అనుకుంటారు. కానీ, ఈ శ్రమ, టైమ్ ను సేవ్ చేయడం కోసమనీ, చాలా వరకూ ఈ వంటను రెస్టారెంట్స్ లో ఆడర్ ఇచ్చి చేయించుకుంటుంటారు. అయితే ఈ క్రీమి వెజిటేరియన్ రిసిపిని 30-40నిముషాలు ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. మరి ఎలా తయారుచేయాలి? అందుకు కావల్సిన పదార్థాలేంటో తెలుసుకుందాం...

Easy Malai Kofta Recipe: A Vegetarian Delight

కోఫ్తా కోసం కావల్సిన పదార్థాలు:
పనీర్: 1/2 cup(తురుముకోవాలి)
బంగాళదుంప: 1/2cup(ఉడికించి మెత్తగా చేయాలి)
అల్లం: 1tsp
పసుపు పొడి 1/2 tsp
వెల్లుల్లి: 2tsp(సన్నగా తరిగినవి)
మిల్క్ పొడి: 1tbsp
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు: 1tbsp(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
నూనె: డీఫ్ ఫ్రైకి సరిపడా

గ్రేవీ కోసం కావల్సినపదార్థాలు:
ఉల్లిపాయ పేస్ట్: 4tbsp
టమోటో గుజ్జు: 1/2cup
అల్లం-వెల్లుల్లి పేస్ట్: 1tbsp
పచ్చిమిర్చి పేస్ట్: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
పంచదార: 1tsp
జీడిపప్పు పేస్ట్: 1tbsp
దాల్చిన చెక్క: 1 పెద్దది
లవంగాలు: 5-6
యాలకలు: 4-5
గరం మసాలా పొడి: 1tsp
బట్టర్:2tbsp
ఫ్రెష్ క్రీమ్: 2tbsp (అలంకరించుట కోసం)
అల్లం జులైనేస్: 1tsp
కొత్తిమీర తరుగు: 1tsp(గార్నిషింగ్ కోసం)

తయారుచేయు విధానం :
1. ముందుగా డీప్ ప్రైయింగ్ పాన్ కొద్దిగా నూనె వేసి వేడిచేయాలి.
2. తర్వాత కోఫ్తాకు సిధ్దం చేసుకొన్న పదార్థాలన్నింటిని ఒక బౌల్లో వేసి బాగా మిక్స్ చేయాలి. తరువాత చిన్న చిన్న బాల్స్ గా చేసుకోవాలి.
3. ఇప్పుడు కాగే నూనెలో ఈ కోఫ్తాబాల్ వేసి డీప్ ఫ్రై బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగించుకొన్న కోఫ్తాలను తీసి పక్కన పెట్టుకోవాలి.
4. తర్వాత మరో పాన్ లో కొద్దిగా బట్టర్ వేసి, కరిగిన తరవ్ాత అందులో దాల్చిన చెక్క, యాలకులు మరియు లవంగాలు వేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి.
5. తర్వాత అందులో ఉల్లిపాయ పేస్ట్ వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకూ 2-3నిముషాలు వేగించుకోవాలి.
6. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరో రెండు మూడు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
7. ఇప్పుడు అందులోనే టమోటో పేస్ట్, పచ్చిమిర్చిపేస్ట్, ఉప్పు, పంచదార కూడా వేసి వేగిస్తూ మరో 5నిముషాలు మీడియం మంట మీద వేగించుకోవాలి.
8. తర్వాత జీడిపప్పు పేస్ట్ కూడా వేసి మరో మూడు -నాలుగు నిముషాలు వేగించుకోవాలి.
9. ఇప్పుడు అందులో కొద్దిగా నీళ్ళు పోసి బాగా మిక్స్ చేసి గ్రేవీ చిక్కబడే వరకూ 5నిముషాలు ఉడికించుకోవాలి.
10. ఇప్పుడు గరం మసాలా చిలకరించి బాగా మిక్స్ చేసి స్టౌ ఆఫ్ చేయాలి.
11. తర్వాత కోఫ్తాలను సర్వింగ్ ప్లేట్ లో కోఫ్తాలను సర్ధాలి, తర్వాత వాటిమీద ఉడికించుకొన్న గ్రేవీని పోయాలి.
12. చివరగా ఫ్రెష్ క్రీమ్,జింజర్ జులైనే మరియు కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే మలైకోఫ్తా కర్రీ రెడీ . ఈ క్రీమీ వెజిటేరియన్ రిసిపి పరోటా లేదా రోటీలకు మంచి కాంబినేషన్.

English summary

Easy Malai Kofta Recipe: A Vegetarian Delight

Malai kofta is one of the most delightful vegetarian dishes that most of us tend to order in any North Indian restaurant. It is one of the signature dishes which are definitely served in the parties and family functions. It is also one of the best vegetarian recipes which is a favourite of both vegetarians and non vegetarians alike.
Story first published: Monday, September 15, 2014, 17:51 [IST]
Desktop Bottom Promotion