For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెసరపప్పు మరియు బంగాళదుంప రిసిపి

|

పెసరప్పు వంటలంటే చాలా మందికి ఇష్టమైన వంటలు. అంతే కాదు, ఇలాంటి పప్పు ధాన్యాలలో ఉండే విటమిన్స్, మరియు ఇతర న్యూట్రీషియన్స్ ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ వంటను చాలా సింపుల్ గా చాలా త్వరగా తయారుచేసేయవచ్చు . ఇలాంటి రుచికరమైన దాల్ రిసిపికి బంగాళదుంప చేర్చి తయారుచేయడం మరింత రుచి మరియు ఆరోగ్యం కూడా. ఎందుకంటే బంగాళదుంపలో ఎక్కువ న్యూట్రీషియన్స్ మరియు కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి.

ఈ వంటకు ఉపయోగించిన మసాలా దినుసులు వంటకు మరింత రుచిని అందిస్తాయి. ఈ దాల్ రిసిపి భోజనానికి ప్రత్యేకంగా వైట్ రైస్ కు చాలా బాగుంటుంది . వైట్ రైస్ , దాల్ కర్రీ, పపాడ్ లేదా పికెల్ తో వడ్డిస్తే చాలా టేస్ట్ గా మీ సంతృప్తినిస్తుంది. మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం...

moongdal

కావల్సిన పదార్థాలు:
పెసరపప్పు : 1cup(ఉడికించుకోవాలి)
బంగాళదుంపలు : 2 (ఉడికించినవి)
టొమాటోస్ : 3 (సన్నగా తరిగినవి)
పచ్చిమిర్చి : 5 (చిన్నముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
అల్లం : చిన్న ముక్క(తురుమి పెట్టుకోవాలి)
కరివేపాకు : రెండు రెమ్మలు
కొత్తిమిర : కొద్దిగా (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
పోపుకోసం:
ఆవాలు: 1tsp
జీలకర్ర: 1tsp
మెంతులు: 1/2tsp
పసుపు: 1/2tsp
నూనె/నెయ్యి: 1/2tsp

తయారుచేయు విధానం:
1. ముందుగా పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడిఅయ్యాక అందులో పోపుదినుసులు వేసి, రెండు మూడు నిముషాలు వేగించుకోవాలి.
2. ఇప్పుడు పాన్ లో సన్నగా తరిగిన టమోటోలు, పచ్చిమిర్చి, అల్లం తురుము, కరివేపాకు, ఉప్పు, కొత్తిమీర వేసి మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
3. ఇప్పుడు పాన్ లో ఉడికించిన బంగాలదుంప ముక్కలు, ఉడికించిన పెసరపప్పు వేసి మరో 10 నిముషాలు ఉడికించుకోవాలి.
4. తర్వాత అందులో కొద్దిగా నీళ్ళు పోసి, ఒక 5నిముషాలు ఉడికించుకోవాలి. అంతే మూంగ్ దాల్ పొటాటో రిసిపి రెడీ...

English summary

Easy Moong Dal & Potato Recipe

Moong dal is a favourite among many. This type of dal is also rich in many vitamins and other nutrients which is good for health. Boldsky shares with you a simple and easy dal recipe you can prepare in about 20 minutes. This delectable dal curry is cooked along with potato which is another highly nutritious veggie.
Story first published: Friday, April 3, 2015, 13:28 [IST]
Desktop Bottom Promotion