పనీర్ కుల్చా రిసిపి టేస్టీ అండ్ హెల్తీ..!!

పనీర్ లేదా కాటేజ్ చీజ్ మన శరీరానికి చాలా మంచిదన్న విషయం తెలుసు కదా.మీరు యవ్వనంలో ఉన్న లేదా వయసు మళ్ళినా వారైనా సరే దీనిలో ఉండే కాల్షియం,ఇతర విటమిన్లు, ఖనిజాలు మీ ఆరోగ్యానికి చాలా మంచివి.

Subscribe to Boldsky

పనీర్ లేదా కాటేజ్ చీజ్‌ని అనేక రకాలుగా ఉపయోగించి రకరకాల వంటలు తయారు చేసుకోవచ్చు.వాటిల్లో పనీర్ కుల్చా కూడా ఒకటి. ఇది మీరు తప్పక ప్రయత్నించవలసిన వంటకం.


పనీర్ కుల్చా అంటే పనీర్ స్టఫ్ చేసిన పరాఠా అంతే. దీనిలోనే మీరు కూరగాయలు కూడా వేసి పనీర్ కుల్చా రుచిని ద్విగుణీకృతం చేయవచ్చు.

పనీర్ లేదా కాటేజ్ చీజ్ మన శరీరానికి చాలా మంచిదన్న విషయం తెలుసు కదా.మీరు యవ్వనంలో ఉన్న లేదా వయసు మళ్ళినా వారైనా సరే దీనిలో ఉండే కాల్షియం,ఇతర విటమిన్లు, ఖనిజాలు మీ ఆరోగ్యానికి చాలా మంచివి.పనీర్ పేరు చెప్తేనే మీ పిల్లలు పారిపోతున్నట్లయితే పనీర్ కుల్చాని వారికిష్టమైన పచ్చడి,రైతా లేదా సాస్‌తో అందించవచ్చు. పనీర్ కుల్చా తయరీకి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం చూసి మీ ఇంట్లో ప్రయత్నించండి.

Easy To Prepare Paneer Kulcha Recipe

ఎంత మందికి సరిపోతుంది-4

ప్రిపరేషన్ టైం-45 నిమిషాలు

కుకింగ్ టైం-20 నిమిషాలు

Easy To Prepare Paneer Kulcha Recipe

కావాల్సిన పదార్ధాలు:

1.మైదా-3కప్పులు

2.పంచదార-1 టేబుల్ స్పూను

3.బేకింగ్ పౌడర్-1 టేబుల్ స్పూను

4.వెన్న-5 తేబుల్ స్పూన్లు

5.పాలు-1 కప్పు

6.ఉప్పు-రుచికి తగినంత

Easy To Prepare Paneer Kulcha Recipe

స్టఫ్ఫింగ్ కోసం:

7.తురిమిన పనీర్-200 గ్రాములు

8. పచ్చి మిర్చి-4(సన్నగా తరిగాలి)

9.గరం మసాలా పొడి-1 టీ స్పూను

10.కొత్తిమీర-2 టేబుల్ స్పూన్లు(సన్నగా తరగాలి)

11.కారం-2 టీ స్పూన్లు

12.చాట్ మసాలా- 2 టీ స్పూన్లు

13.ఉల్లిపాయ-1(సన్నగా తరగాలి)

Easy To Prepare Paneer Kulcha Recipe

తయారీ విధానం:

1.ఒక గిన్నె తీసుకుని దానిలో మైదా,బేకింగ్ పౌడర్ కలిపి పక్కన పెట్టాలి.

2.ఇంకొక గిన్నెలో పాలు, వెన్న, పంచదార, ఉప్పు వేసి బాగా కలపాలి.

Easy To Prepare Paneer Kulcha Recipe

3.ఈ పాల మిశ్రమాన్ని మొదట పక్కన పెట్టుకున్న పిండిలో పోసి మెత్తని చపాతీ పిండి లాగ కలిపి ఒక మస్లిన్ క్లాత్ వేసి ఒక 40 నిమిషాలపాటు పక్కన పెట్టుకోవాలి.

4.ఇప్పుడు స్టఫ్ఫింగ్ తయారు చేసుకోవాలి.ఒక పెద్ద గిన్నె తీసుకుని దానిలో తురిమిన పనీర్,ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి తరుగు,కొత్తిమీర,ఉప్పు, గరం మసాలా, చాట్ మసాలా, కారం వెయ్యాలి.


5.అన్నింటినీ బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. అంతే,పనీర్ కుల్చాకి స్టఫ్ఫింగ్ తయారు.

6.ఇప్పుడు మస్లిన్‌క్లాత్ కప్పిన పిండి నుండి కొంచం ముద్ద తీసుకుని గుండ్రంగా వత్తుకోవాలి.మరీ పెద్దదిగా వత్తుకోకూడదు.

Easy To Prepare Paneer Kulcha Recipe

7.ఇప్పుడు గుండ్రంగా వత్తిన చపాతీని మీ అరచేతిలో ఉంచుకుని కొంచం స్టఫ్ఫింగ్ తీసి దీనిలో పెట్టి అంచులు మూసెయ్యాలి.

8.ఇప్పుడు పీట మీద కొంచం పిండి చల్లి స్టఫ్ చేసుకున్న ఈ ముద్దని మెల్లిగా చేతులతో తడుతూ గుండ్రంగా వత్తుకోవాలి. ఇలాగే మిగిలిన పిండితో కుల్చాలు తయారు చేసుకోవాలి.

9.ఒక ఓవెన్ ట్రే తీసుకుని దానికి కొంచెం నూనె రాయాలి. ఇలా చేస్తే కుల్చాలు ట్రేకి అతుక్కుపోవు.

Easy To Prepare Paneer Kulcha Recipe

10.ఓవెన్‌ని 200 డిగ్రీల సెల్సియస్‌లో వేడి చెయ్యాలి.

11.ఇప్పుడు కుల్చాలని ట్రేలో పెట్టి 10-15 నిమిషాలు బేక్ చేసుకుంటే పనీర్ కుల్చా రెడీ.

బేక్ అయిన కుల్చాలని నాలుగు ముక్కలుగా కోసి మీకిష్టమైన చట్నీతో వడ్డించడమే.

English summary

Easy To Prepare Paneer Kulcha Recipe

Paneer or cottage cheese is one such item that can be used differently and you can make a myriad of recipes with it. Paneer kulcha is also one such awesome recipe that you must try.
Please Wait while comments are loading...
Subscribe Newsletter