For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆలూ పుజియా రుచికరమైన మీల్ రిసిపి

|

పచ్చిబఠానీ మరియు బంగాళదుంపతో తయారుచేసే ఆలూ పుజియా రిసిపి ఇండియన్ డిష్. ఆలూ పుజియా రిసిపిని ఇంట్లోనే చాలా సులభంగా తయారుచేసుకోవచ్చు. ఈ వంటను తయారుచేయడానికి ఎక్కువ సమయం తీసుకోదు. మరియు ఈ ఆలూ పుజియా రిసిపి చాలా సింపుల్ గా తయారుచేసుకోవచ్చు. మీకు అవసరం అనిపిస్తే కొన్ని మసాలా దినుసులు కూడా జోడించుకోవచ్చు.

ఇది డిన్నర్ కు చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వెజిటేరియన్ వంటల్లో తాజా కూరగాయలు మరియు పండ్లను ఉపయోగించడం వల్ల మీ జీర్ణ వ్యవస్థ క్రమబద్దంగా ఉంటుంది. వ్యాధినిరోధకత పెంచుతుంది. ఆలూ పుజియా రిసిపిని మీరు కూడా టేస్ట్ చేయాలంటే ఈ వీకెండ్ స్పెషల్ గా ట్రై చేసి చూడండి...పిల్లల కూడా చాలా ఇష్టంగా తింటారు.

Easy And Quick Aloo Phujia

కావల్సిన పదార్థాలు:
బంగాళదుంపలు: 2పెద్దవి(కట్ చేసి ఉడికించినవి)
ఉల్లిపాయలు: 1పెద్దది(సన్నగా కట్ చేయాలి)
పచ్చిబఠానీలు: 200gms
పసుపు: 1/4tbsp
కారం: 1/2tbsp
పెప్పర్: 1/4tbsp
జీలకర్ర: 1/4tbsp
నూనె: తగినంత

తయారుచేయు విధానం:
1. ముందుగా పాన్ తీసుకొని స్టౌ మీద పెట్టి నూనె వేసి వేడిచేయాలి. నూనె వేడి చేసి అందులో ఉల్లిపాయలు మరియు జీలకర్ర వేసి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించాలి.
2. ఇప్పుడు, అందులో బంగాళదుంప మరియు పచ్చిబఠాలు వేసి ఫ్రై చేయాలి. తర్వాత అందులో పసుపు, కారం, మరియు పెప్పర్ పౌడర్ మరియు ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేస్తూ ప్రై చేయాలి.
3. మీడియం మంట మీద మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేయాలి. మూత పెట్టి ఉడికించుట వల్ల త్వరగా ఉడుకుతుంది . అంతే ఆలూ పుజియా రెడీ. ఈ ఆలూ పుజియా రిసిపి చాలా సింపుల్ గా తయారుచేయవచ్చు.

English summary

Easy And Quick Aloo Phujia

Aloo phujia is a tasty Indian dish made of potatoes and green peas. You can make aloo phujia easily at home. This dish does not take too much of your time, and is a perfect go with rotis and rice. Aloo phujia is a mix of aloo and soft green peas. The recipe of aloo phujia is simple and you can add more ingredients to it if you want!
Story first published: Saturday, November 1, 2014, 13:39 [IST]
Desktop Bottom Promotion