For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బెండకాయ ఫ్రై : ఇండియన్ స్టైల్

|

సాధారణంగా చాలా మందికి బెండకాయ తినడం అంటే ఇష్టం ఉండదు. అయితే బెండకాయలను సరైన పద్దతిలో అనుసరించినట్లైతే, బెండకాయలను క్రిస్పిగా తయారుచేయవచ్చు .

సాధారణంగా చాలా మందికి బెండకాయ తినడం అంటే ఇష్టం ఉండదు. అయితే బెండకాయలను సరైన పద్దతిలో అనుసరించినట్లైతే, బెండకాయలను క్రిస్పిగా తయారుచేయవచ్చు . మనం రెగ్యులర్ గా తయారుచేసుకొనే బెండకాయ సాంబర్, బెండకాయ మసాలా కంటే ఒక డిఫరెంట్ టేస్ట్ మరియు ఫ్లేవర్, స్ట్రక్చర్ కలిగిన బెండి ఫ్రై తయారుచేసి సైడ్ డిష్ గా తయారుచేసుకోవచ్చు.

అయితే ఇది చేసే విధానంలోనే వుంది అసలు రుచి అంతా. ఎవ్వరైనా సరే రెండు ముద్దలు ఎక్కువ తినితీరాల్సిందే. మీకూ తెలిసే వుంటుంది ఎలా చేయాలన్నది. కానీ వాటిని వేయించే దానిలోనే వుంది చిట్కా అంతా...కొద్దిగా టైం తీసుకొని ఓపిగ్గా చేస్తే బెండకాయ ఫ్రై భలే రుచిగా ఉంటుంది. చపాతీ, ప్లెయిన్ రైస్ కు చాలా రుచికరంగా ఉంటుంది. మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Fried Okra In Indian Style

కావల్సిన పదార్థాలు:
బెండకాయ: 250grms(చివర్లు కట్ చేసి, మద్యలో నుండి కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయ: 1(సన్నగా కట్ చేసుకోవాలి)
టమోటో: 1(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
కారం: tsp
ఆమ్చూర్ పౌడర్ (డ్రై మ్యాంగో పౌడర్): 1tsp
గరం మసాల: 1tsp
కాలౌంజి: 1/2tsp
ఇంగువ: చిటికెడు
గోధుమపిండి: 2tbps
నూనె: 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1.ముందుగా బెండాకాయలను శుభ్రం చేసి మీకు కావల్సిన సైజ్ లో కట్ చేసుకోవాలి.
2. ఇప్పుడు బెండకాయలకు ఉప్పుపౌడర్ మసాలా, కారం, ఆమ్య్చూర్ పౌడర్ మరియు గరం మసాలా వేసి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి.
3. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న బెండకాయల ముక్కలను 10-15నిముషాలు పక్కన పెట్టుకోవాలి. అంతలోనూ ఉల్లిపాయలు మరియు టమోటోలు వంటి వాటిని కట్ చేసి పెట్టుకోవాలి.
4. 15నిముషాల తర్వాత పాన్ లో నూనె వేసి వేడి అయ్యక , చిటికెడు ఇంగువ మరియు క్యారమ్ సీడ్స్(అజినోమ్యాటో)వంటివి వేసి వేగించుకోవాలి.
5. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి మీడియం మంట మీద 2-3నిముషాలు వేగించుకోవాలి.
6. తర్వాత మ్యారినేట్ చేసి బెండకాయ ముక్కల మీద శెనగపిండి చిలకరించి బాగా మిక్స్ చేయాల. వీటిని వేగుతున్న మసాలాలో వేసి 10 నిముషాలు బాగా ఫ్రై చేసుకోవాలి.
7. బెండకాయ ముక్కలు 10నిముషాలు వేగిన తర్వాత అందులో ఉప్పు వేసి 5 నిముషాలు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి. మెత్తగా ఉడికేవరకూ మంటన్ సిమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అంతే ఇండియన్ స్టైల్ బెండకాయ ఫ్రై రెడీ రోటీలకు సైడ్ డిష్ గా సర్వ్ చేయవచ్చు.

English summary

Fried Okra In Indian Style

Bhindi Bhaji can be a great fried snacks to have with drinks. It can also serve as a side dish with dal and rice. This okra fry recipe is a pretty quick one. You can make some really decent Bhindi Bhaji in 10 to 15 minutes. That is why, this dish is something you should try when guests arrive unannounced at your doorstep.
Story first published: Monday, May 25, 2015, 13:27 [IST]
Desktop Bottom Promotion