For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గ్రీన్ చిల్లీ-క్యారెట్ ఫ్రై

|

హెల్తీ వెజిటేబుల్ క్యారెట్ లో అనేక హెల్త్ అండ్ బ్యూటీ బెనిఫిట్స్ ఉన్నాయన్న విషయం మనకు తెలిసిందే. క్యారెట్ తో వివిధ రకాల వంటలు వండుతారు. క్యారట్స్‌లో పోషకాలు పుష్కలం. కంటికి, ఒంటికి మేలు చేసే గుణాలు మెండు. క్యారెట్స్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ మరియు కాలరీలు తక్కువ. క్యారెట్లు కంటికీ, ఒంటికి మాత్రమే కాదు డయాబెటిస్ తో పోరాడుతుంది. ఓరల్ హెల్త్ ను నిర్వహిస్తుంది. గుండె జబ్బులను నివారిస్తుంది. ఇన్ని ఆరోగ్య సుగుణాలున్న క్యారెట్లతో ఇంట్లోనే వివిధ రకాల వెరైటీ వంటకాలను తయారు చేసుకోవచ్చు. క్యారెట్ జ్యూస్, క్యారెట్ మంచూరియా, క్యారెట్ రైస్, క్యారెట్ ఖీర్, ఒకటి కాదు..రెండు కాదు ఇలా చాలానే తయారు చేసుకోవచ్చు!

క్యారెట్ చిల్లీ ఫ్రై చాలా రుచికరంగా ఉంటుంది. కాస్త తియ్యతియ్యగా ఉండే క్యారెట్ కు స్పైసీగా గ్రీన్ చిల్లీ జోడించి క్యారెట్ ఫ్రై చేస్తే చాలా రుచిగా స్వీట్ అండ్ స్పైసీగా ఉంటుంది. ఇది చపాతీ, రైస్ కు ఒక సైడ్ డిష్ . ఇది మధ్యహాన్న భోజనానికి చాలా అద్భుతంగా రుచికరంగా ఉంటుంది. అంతే కాదు ఈ క్యారెట్ రైస్ కడుపు నిండుగా ఉంచుతుంది. మరి ఆరోగ్యపరంగా ఇన్న ప్రయోజనాలను చేకూర్చే క్యారెట్ ను రోజూ వంటలోకి ఓ క్యారట్ తురిమి వేయండి. ఇంకో క్యారట్‌ను తరిగి వండండి. నూనెలో వేసి డీప్ ఫ్రై చే యండి. వేయించకుండానే పెరుగులో కలిపేయండి. దేనికది భిన్నమైన టేస్ట్ అంటూ లొట్టలు వేయంచండి.

Green Chilli Carrot Fry

కావల్సిన పదార్థాలు:

క్యారెట్లు: 4
పచ్చిమిరపకాయలు: 4 సన్నగా తరిగిపెట్టుకోవాలి (మీకు కారం ఎంత అవసరమో అంత జోడించుకోవచ్చు)
ఉల్లిపాయ: 1/2(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
వెల్లుల్లి రెబ్బలు:2
జీలకర్ర: 1/4 tbsp
ఆవాలు: 1/4 tbsp
మినపప్పు: 1/2 tbsp
కరివేపాకు: కొద్దిగా అవసరం అయినంత
పసుపు: 1/4tsp
నూనె: 2 tbsp
ఉప్పు: 1 tbsp

తయారుచేయు విధానం:

1. ముందుగా క్యారెట్ కు పై పొట్టును తొలగించాలి. తర్వాత శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2. తర్వాత వీటిని గిన్నెలో వేసి ఉప్పు, కొద్దిగా నీళ్ళు పోసి మీడియం మంట మీద హాఫ్ బాయిల్ చేసుకోవాలి(మరీ మెత్తగా కాకుండా ఓ మోస్తరుగా ఉడికించుకోవాలి)
3. అంతలోపు పచ్చిమర్చి, వెల్లుల్లి రెబ్లను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
4. క్యారెట్ ఉడికిన తర్వాత క్రిందికి దింపి ఎక్స్ ట్రా నీరు వంపేసి, చల్లారనివ్వాలి.
5. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి, అందులో జీలకర్ర, ఆవాలు, ఉద్దిపప్పు, కరివేపాకు వేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి.
6. తర్వాత అందులోనే ఉల్లిపాయ ముక్కులు, చిటికెడు ఉప్పు, వేసి వేగిస్తే ఉల్లిపాయ ముక్కలు మెత్తగా వేగుతాయి. తర్వాత అందులోనే పసుపు కూడా వేసి మరో రెండు మూడు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
7. ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసి 10 నిముషాల పాటు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేస్తూ అందులో పచ్చిమిర్చి, వెల్లల్లి ముక్కలు లేదా పేస్ట్ ను వేసి మరికొన్ని నిముషాలు ఫ్రై చేసుకోవాలి. అంతే గ్రీన్ చిల్లీ క్యారెట్ ఫ్రై రెడీ. ఇది చపాతీ మరియు రైస్ కు సైడ్ డిష్ గా అద్భుతంగా ఉంటుంది.

English summary

Green Chilli Carrot Fry

This Carrot fry recipe has a South India tinge. Learn how to make/prepare Carrot fry by following this easy recipe.
Story first published: Saturday, June 7, 2014, 12:54 [IST]
Desktop Bottom Promotion