For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెల్తీ బ్రేక్ ఫాస్ట్ గ్రీన్ పీస్ ఇడ్లీ-పుదీనా చట్నీ

|

సౌంత్ ఇండియన్ బ్రేక్ ఫాస్ట్ ల్లో ముఖ్యమైన వాటిలో ఇడ్లీ కూడా ఒకటి. అయితే సాదా ఇడ్లీ, సాంబార్, ఇడ్లీ కొబ్బరి చట్నీ వంటివి తిని బోర్ అనిపిస్తుంటే...ఇక్కడ ఒక డిఫరెంట్ టైప్ ఇడ్లీ ఉంది. గ్రీన్ పీస్ ఇడ్లీను సాధారణంగా గ్రీన్ వెజిటేబుల్స్ తో తయారు చేస్తారు. ఈ ఇడ్లీలో బిట్టర్ గార్డ్, పుదీనా ఉపయోగించడం వల్ల టేస్ట్ మాత్రమే కాదు కావల్సిన పోషకాలను అందిస్తుంది మొత్తానికి ఇది ఆరోగ్యానికి మంచిది.

గ్రీన్ పీస్ ఇడ్లీన్ లైట్ మీల్ గా కూడా తీసుకోవచ్చు. అంతే కాదు సాయంత్రం టీతో స్నాక్ గా కూడా తినవచ్చు . ఎవరైతే తమ బ్రేక్ ఫాస్ట్, డిన్నర్ చాలా సింపుల్ గా ఉండాలనుకుంటారో వారికి ఈ గ్రీన్ పీస్ ఇడ్లీ మంచి ఆప్షన్. ఆయిల్ ఫ్రీ ఇడ్లీని తినడం వల్ల మంచి ఆరోగ్యం కూడా మరి ఇంకెందుకు ఆలస్యం గ్రీన్ పీస్ ఇడ్లీ తయారు చేసేయండి.

Green Peas Idli With Mint Chutney

ఇడ్లీ తయారు చేయడానికి కావల్సిన పదార్థాలు:
రవ్వ: 2 cups(వేయించుకోవాలి)
పచ్చిబఠానీ: 3/4 cup(కచపచదంచుకోవాలి)
మెంతి ఆకులు: 1tbsp(కట్ చేసుకోవాలి)
పెరుగు: 2tsp
ఓట్స్: 2tsp
బిట్టర్ గార్డ్ తొక్క: 2tsp(మెత్తని పేస్ట్ చేసుకోవాలి)
అల్లం, పచ్చిమిర్చి పేస్ట్: 3tsp
ఉప్పు: రుచికి సరిపడా

పుదీనా చట్నీకి కావల్సిన పదార్థాలు:

పెరుగు: 2 cups
స్ట్రాబెర్రీ ముక్కులు: 1cup(అవసరం అయితే)
తేనె: 3tsp
పుదీనా తరుగు: 4tsp
బ్లాక్ పెప్పర్ పౌడర్: చిటికెడు
ఉప్పు: రుచికి సరిపడా

తయారు చేయరు చేయు విధానం:
1. ముందుగా మిక్సీలో పుదీనా చట్నీకి కావల్సిన పదార్థాలన్నింటిని వేసి, కొద్దిగా నీళ్ళు పోసి పుదీనా చట్నీ తయారు చేసుకోవాలి.
2. పేస్ట్ తయారు చేసుకొన్న తర్వాత, చట్నీని పోపుదినుసులతో పోప్ పెట్టుకోవాలి.
3. ఇప్పుడు ఇడ్లీకి కావల్సిన పదార్థాలన్నింటి మిక్స్ చేసి బాగా కలుపుకోవాలి.
4. తర్వాత ఇడ్లీ పాత్రలో గిన్నెల్లో ఇండ్లీ పిండిని పోసి, పది, పదిహేను నిముషాల పాటు ఆవిరి మీద ఉడికించాలి.
5. తర్వాత ఇడ్లీటను బయటకు తీసి కొత్తిమీర మరియు పచ్చిబఠానీతో గార్నిష్ చేసి వేడి వేడిగా పుదీనా చట్నీతో సర్వ్ చేయాలి.

English summary

Green Peas Idli With Mint Chutney | గ్రీన్ పీస్ ఇడ్లీ-పుదీనా చట్నీ

Are you bored of eating the same old boring idlis with coconut chutney? Here is a recipe to prepare a different type of idly that makes you want for more. Green peas idly, basically made of green vegetables like peas, bitter gourd and mint leaves provides not just taste but also provides proper nutrition. Moreover, is also good for the overall health.
Story first published: Thursday, January 31, 2013, 11:35 [IST]
Desktop Bottom Promotion