For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గ్రీన్ పీస్ టమోటో సబ్జీ: రైస్,చపాతీ బెస్ట్ కాంబినేషన్

|

ఈ వసంత కాలంలో పచ్చిబఠానీలకు ఒక మంచి సీజన్. అలాగే టమోటోలు. టమోటో మరియు పచ్చిబఠానీలను ఉపయోగించి తయారుచేసే వంటలు మన ఇండియన్ కుషన్స్ లో అనేకం ఉన్నాయి. మీరు సైడ్ డిష్ గా ఏదైనా తయారుచేయడానికి ప్లాన్ చేస్తుంటే, మీకోసం ఇక్కడ ఒక సింపుల్ సైడ్ డిష్ ఉంది.

మీరు ఈ గ్రీన్ పీస్ మరియు టమోటో సబ్జీని మీరు ట్రై చేయవచ్చు. ఇది ఒక పుల్లని మరియు స్పైసీ సైడ్ డిష్ రిసిపి. దీన్ని చాలా త్వరగా తయారుచేయవచ్చు. ఈ రిసిపి రైస్ మరియు రోటీలకు ఒక మంచి కాంబినేషన్

Green Peas n Tomatoes Sabji Recipe

కావల్సిన పదార్థాలు:
పచ్చిబఠానీలు: 1cup
టమోటోలు: 4(చిన్నముక్కలుగా కట్ చేసుకోవాలి)
పచ్చిమిర్చి: 3-4(మద్యకు లేదా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
కారం: 1tsp
పసుపు: 1tsp
ధనియాల పొడి: 1tsp
జీలకర్ర: 1tsp
ఉప్పు : రుచికి సరిపడా
నూనె: తగినంత

తయారుచేయు విధానం:
1. ముందుగా ఫ్రైయింగ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి, జీలకర్ర వేసి వేయించుకోవాలి.
2. జీలకర్ర చిటపటలాడిన తర్వాత అందులో టమోటో ముక్కలు వేసి, మీడియం మంట మీద మెత్తగా వేయించుకోవాలి.
3. 5నిముషాల తర్వాత అందులో పచ్చిబఠానీ మరియు పచ్చిమిర్చి వేసి వేయించాలి.
4. అలాగే అందులో ఉప్పు మరియు పసుపు కూడా వేసి మిక్స్ చేస్తూ 5నిముషాలు మీడియం మంట మీద వేయించుకోవాలి.
5. టమోటో మెత్తగా ఉడికిన తర్వాత అందులో ధనియాల పొడి మరియు కారం కూడా వేసి మరో రెండు నిముషాలు ఉడికించుకోవాలి. అంతే మొత్తం, మిశ్రమం బాగా ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. అంతే పచ్చిబఠానీ మరియు టమోటో సబ్జీ రెడీ. ఈ పుల్లగా మరియు కారంగా ఉండే స్పైసీ డిష్ రోటీ లేదా రైస్ కాంబినేషన్ కు అద్భుతంగా ఉంటుంది.

English summary

Green Peas n Tomatoes Sabji Recipe

It is the season of green peas and pulpy tangy tomatoes. There are many recipes in the Indian cuisine which can be prepared using green peas and tomatoes. If you are running out of ideas for preparing side dishes, then here is a simple Indian side dish.
Story first published: Wednesday, February 5, 2014, 12:08 [IST]
Desktop Bottom Promotion