For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెల్తీ అండ్ న్యూట్రిషినల్ బ్రేక్ ఫాస్ట్- గ్రీన్ పీస్ పాన్ కేక్

|

చాలా మంది ఉదయం తీసుకొనే అల్పాహారాన్ని చాలా సింపుల్ గా తీసుకోవాలనుకుంటారు. అదే సమయంలో ఆ తీసుకొనే బ్రేక్ ఫాస్ట్ ఆరోగ్యకరమైన ఆహారమై ఉండాలని కోరుకుంటారు. ప్రతి రోజూ తీసుకొనే బ్రేక్ ఫాస్ట్ తోనే ఆరోజంతా ఆరోగ్యకరంగా నడుస్తుంది. అంతే కాదు సరైన సమయంలో అల్పాహారాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం.

ఉదయం తీసుకొనే బ్రేక్ ఫాస్ట్ లో ఆరోగ్యకరమైన వాటిలో గ్రీన్ పీస్ ప్యాన్ కేక్ ఒకటి. ఇది కడుపు నిండేలా చేయడమే కాకుండి, చాలా సింపుల్ గా తయారవుతుంది. ఇంకా ఈ అల్పహారంలో తగినన్ని పోషకాలు శరీరానికి అందిస్తుంది. మరి ఈ గ్రీన్ పీస్ పాన్ కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం.

Green Peas Pancake-Breakfast Recipe

పచ్చి బటానీలు: 3/4cup (ఉడికించిన)
రైస్ పిండి: 1/2 cup
శెనగపిండి: 1/2cup
పసుపు: 1/4tsp
పచ్చిమిరపకాయలు: 1tbsp(సన్నగా తరిగినవి)
ఆయిల్: 2tsp
లో ఫ్యాట్ పనీర్: 1/4cup(తురుముకోవాలి)
క్యారెట్: 1/2cup(తురిముకోవాలి)
టమోటాలు: 1/4cup(సన్నగా తరిగినవి)
ఉప్పు: రుచికి సరిపడా

తయారు చేయు విధానం:
1. ముందుగా పచ్చిబఠానీలను మిక్సీలో వేసి మొత్తగా పేస్ట్ చేసుకోవాలి. అవసరం అయితే కొద్దిగా నీళ్ళు కలుపుకోవచ్చు.

2. ఈ బఠానీ ముద్దను ఒక గిన్నెలోనికి తీసుకొని అందుంలో బియ్యం పిండి, శెనగపిండి, పసుపు, పచ్చిమిర్చి, ఉప్పు మరియు నీళ్ళు పోసి, బాగా మిక్స్ చేసుకోవాలి.

3. తర్వాత తవా లేదా పాన్ ను వేడి చేసి కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి.,

4. తర్వాత అందులో అర చెంచా బఠానీ పేస్ట్ ను వేసి పాన్ మీద స్ప్రెడ్ చేయాలి.

5. తర్వాత దాని మీదనే పన్నీరు తురుము, క్యారెట్ తురు మరియు టమోటో ముక్కలు వేసి పిండిమీద సర్ధాలి. తర్వాత దాని మీద కొద్దిగా నూనెను చిలకరించాలి.

6. నూనె చల్లుకొని ఒక ప్రక్క కాలిన తర్వాత, మరో పక్కకు తిప్పి అదే విధంగా కాల్చుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని పాన్ కేక్ లను తయారు చేసుకోవాలి.
అంతే గ్రీన్ పీస్ పాన్ కేక్ బ్రేక్ ఫాస్ట్ రెడీ. ఈ న్యూట్రీషియన్ బ్రేక్ ఫాస్ట్ ను ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ తో తీసుకొంటే చాలా బాగుంటుంది.

English summary

Green Peas Pancake-Breakfast Recipe | గ్రీన్ పీస్ పాన్ కేక్: న్యూట్రీషినల్ బ్రేక్ ఫాస్ట్

Many of us want to have healthy food as opposed to a heavy breakfast. Likewise, everyone knows that the key to a healthy life is having breakfast at the right time. In order to have a good breakfast, you should include all kinds of nutrients in the food you prepare for the breakfast. Having a healthy breakfast definitely makes you feel energetic and keeps you active all day.Pancakes like green peas pancake provides all the nutritional benefits for a healthy body.
Story first published: Monday, March 4, 2013, 11:44 [IST]
Desktop Bottom Promotion