For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గ్రీన్ పీస్ పరోటా-టేస్టీ బ్రేక్ ఫాస్ట్ రిసిపి

|

తాజాగా ఉండే పచ్చిబఠానీలను చూడగానే నోరూరిస్తుంటుంది. బ్రేక్ ఫాస్ట్ లో గ్రీన్ పీస్ ను చేర్చుకోవడం ఓ అద్భుతమైన ఐడియా. గ్రీన్ పీస్ అత్యధిక పోషకాలున్నటువంటి లెగ్యుమినస్ వెజిటబుల్. ఇందులో విటమిన్ ఎ, కె మరియు లో క్యాలరీలను కలిగినటువంటి ఆహారం పదార్థం. కాబట్టి ఇక్కడ ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన రుచికరమైన ఈ బ్రేక్ ఫాస్ట్ గ్రీన్ పీస్ పరోటా మీకోసం..

ఈ పరోటాను తయారు చేయడం చాలా సులభం. అదేవిధంగా కడుపు నింపే హెల్తీ బ్రేక్ ఫాస్ట్ . తాజాగా ఉండే గ్రీన్ పీస్ కు సువాసనలిచ్చే మసాలాలు పచ్చిమిర్చి, అల్లంతో తయారు చేస్తారు. గ్రీన్ పీస్ పరోటా పిల్లల లంచ్ బ్యాక్స్ కు ఒక అద్భుతమైన ఎంపిక..

కావల్సిన పదార్థాలు:
గ్రీన్ పీస్ : 1cup
మైదా: 1cup
గ్రీన్ చిల్లీ: 2
అల్లం: 2tsp(తురుము)
జీలకర్ర: 1tsp
ఇంగువ: చిటికెడు
ఆంచూర్(డ్రై మ్యాంగో పౌడర్): 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 3tbsp
నీళ్ళు: 1/2cup

తయారు చేయు విధానం:
1. ముందుగా పచ్చిబఠానీలను బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిబఠానీలు, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర మరియు ఉప్పు వేసి రఫ్ గా పేస్ట్ చేసుకోవాలి. (నీళ్ళు వేయకూడదు).
2. తర్వాత పాన్ లో ఒక టీస్పూన్ నూనె వేసి, అందులో చిటికెడు ఇంగువ వేసి, ఒక సెకన్ తర్వాత అందులోనే రుబ్బి పెట్టుకొన్న గ్రీన్ పీస్ మిక్స్ ను వేసి 5నిముషాల పాటు, మీడియం మంట మీద వేగించుకోవాలి.
3. తర్వాత అందులో డ్రై మ్యాంగో పౌడర్ కూడా వేసి ఒక నిముషం వేగించి, తర్వాత స్టౌ ఆఫ్ చేసేయాలి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
4. తర్వాత మైదాలో కొద్దిగా ఉప్పు మరియు నీళ్ళు వేసి చపాతీ పిండిలా సున్నితంగా కలిపి పెట్టుకోవాలి.
5. ఐదు నిముషాల తర్వాత పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని, చపాతీల వత్తుకోవాలి.
6. ఈ చపాతీ మద్యలో వేయించి పెట్టుకొన్న బఠానీ మిశ్రమాన్ని పెట్టి, తర్వాత చపాతీని బాల్ లా చుట్టుకొని అన్ని వైపులా పుర్తిగా కవర్ చేయాలి.
7. ఇప్పుడు ఈ స్టఫ్ చేసిన బాల్స్ ను తిరిగా చపాతీలా సున్నితంగా లోపలి మిశ్రమం బయటకు రాకుండా రుద్దుకోవాలి.
8. ఇలా అన్నీ తయారు చేసి పెట్టుకొన్న తర్వాత పాన్ వేడి చేసి, ఈ స్టఫ్ పరాటాలను ఒక దాని తర్వతా ఒకటి రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే గ్రీన్ పీస్ పరాఠా రెడీ. ఈ పీస్ పరాఠాని మీకు ఇష్టమైన కర్రీ లేదా ఊరగాయతో తినాలి.

English summary

Green Peas Paratha: Easy Breakfast Recipe

The taste of fresh green peas is simply mouthwatering. Including green peas in your breakfast is an excellent idea.
Desktop Bottom Promotion