For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాయలసీమ స్పెషల్ బ్రేక్ ఫాస్ట్ - గుంతపొంగనాలు

|

మిగిలిన పోయిన ఇడ్లీ పిండి లేదా దోసె పిండి ఏం చేస్తారు? ఈ పిండిని వెరైటీగా బ్రేక్ ఫాస్ట్ గా తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది. చాలా రుచికరంగా , అతి త్వరగా సులభంగా తయారు చేసుకోవచ్చు. మిగిలిన పిండికి జస్ట్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ముక్కలు మరియు జీలకర్ర, కొత్తిమీర వంటివి మిక్స్ చేసి తయారు చేసుకోవాలి.

ఇది ప్రత్యేకమైన ఉదయం ఫలహారం. వీటిని చేసుకోడానికి గుంతల పెనం మార్కెట్లో దొరుకుతుంది. మూడు రకాల పొంగనాల రుచులు మీకోసం...

కావలసిన పదార్థాలు
బియ్యం: 2cups
మినప్పప్పు: 1cup
నానబెట్టిన సెనగపప్పు: 2tsp
క్యారెట్‌ తురుము: 2tsp
పుదీన, కొత్తిమీర: కొద్దిగా
కరివేపాకు: 2రెమ్మలు
అల్లం ముక్క: చిన్నది
పచ్చిమిర్చి: 2
జీలకర్ర: 1tsp
ఉల్లిపాయ ముక్కలు: 2cups
నూనె: సరిపడా

తయారు చేయు విధానం:
1. బియ్యం, మినప్పప్పు నాలుగు గంటలు నానబెట్టి రుబ్బుకోవాలి.
2. మర్నాడు ఈ పిండిలో సెనగపప్పు, క్యారెట్‌ తురుము, పుదీన, కొత్తిమీర, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి బాగా కలియదిప్పాలి.
3. పొంగనాల కడాయి స్టౌ మీద పెట్టి బాగా వేడయ్యాక గుంతల్లో కొద్ది కొద్దిగా నూనె వేయాలి.
4. తర్వాత గరిటతో గుంతల్లో పిండి వేసి మూత పెట్టాలి.
5. కొద్ది సేపటి తర్వాత వాటిని రెండో వైపు తిప్పాలి. రెండు వైపులా ఉడికితే పొంగనాలు రెడీ. వీటికి కాంబినేషన్‌గా పల్లీచట్నీ, కారం పొడి, టమాట పచ్చిమిర్చి రోటి పచ్చడి... ఇలా ఏదైనా బావుంటుంది.

English summary

Gunta Ponganalu-Rayalaseema Special | గుంతపొంగనాలు -స్పెషల్ బ్రేక్ ఫాస్ట్


 What do you do with leftover idli or dosa batter? Use it to prepare Punukulu or Ponganalu. They are quick and easy to prepare. Just add chopped onion, green chillis, cumin seeds, coriander leaves and soaked channa dal to the batter and prepare shallow fried fritters aka Gunta Ponganalu or Pongadalu, a Rayalaseema speciality
Story first published: Thursday, June 13, 2013, 10:54 [IST]
Desktop Bottom Promotion