For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెల్తీ బార్లీ పరోఠా రిసిపి : డయాబెటిక్ వారికోసం

|

డయాబెటిక్ పేషంట్స్ కొరకు చాలా తక్కువ వంటలు మాత్రమే ఉన్నాయి. అలాంటి వాటిల బార్లీ పరోఠా రిసిపి ఒకటి. ఇది ఒక హెల్తీ బ్రేక్ ఫాస్ట్ రిసిపి. ఎవరైతే పరోఠాలను ఎక్కువగా ఇష్టపుడుతారో, ముఖ్యంగా డయాబెటిక్ పేషంట్స్ కు ఈ బార్లీ పరోఠా రిసిపి ఫర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్ రిసిపి.

చాలా మంది ఇలాంటి పరోఠా రిసిపిలను తయారుచేయడాన్ని నిరాకరిస్తుంటారు . ముఖ్యంగా బార్లీ పిండిని ఉపయోగించి తయారుచేయడం తెలియక లేదా రుచి లేదనో ఉపయోగించరు. అయితే ఇది ఒక హెల్తీ బ్రేక్ ఫాస్ట్ రిసిపి. బార్లీతో తయారుచేసిన వంటను తీసుకోవడం వల్ల డయాబెటిక్ పేషంట్స్ యొక్క జీవనశైలే మారిపోతుంది . ఈ రుచికరమై బార్లీ పరోటా రిసిపిని తయారుచేయడానికి ఆలివ్ ఆయిల్ ఉపయోగించడం వల్ల మరింత టేస్ట్ గా హెల్తీగా ఉంటుంది. డయాబెటిక్ పేషంట్స్ కొరకు స్పెషల్ గా ఈ బ్రేక్ ఫాస్ట్ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Healthy Barley Paratha Recipe For Diabetics

కావల్సిన పదార్థాలు:
బార్లీ పండి: 1/2cup
గోధుము పిండి 3tbsp
ఉల్లిపాయ: 1(సన్నగా కట్ చేసుకోవాలి)
వెల్లుల్లి పేస్ట్ : 1tsp
అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ : 1tsp
ఆలివ్ ఆయిల్ : tsp
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ఉల్లిపాయలను చాలా సన్నగా లేదా రఫ్ గా పేస్ట్ లాగా చేసుకుంటే, పిండికలుపుకవడానికి సులభంగా ఉంటుంది.
2. ఇప్పుడు పిండి కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమపండి, బార్లీ పిండి,సన్నగా తరిగిన ఉల్లిపాయలు, వెల్ల్లుల్లి పేస్ట్, అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ వేసి కొద్దిగా నీళ్ళు పోసి , అరచెంచా ఆలివ్ ఆయిల్ వేసి పిండిని చపాతీ పిండిలా కలుపుకోవాలి .
3. ఇప్పుడు మొత్తం పిండి నుండి కొద్దికొద్దిగా పిండి తీసుకొని చిన్న చిన్న బాల్ లాగా రోల్ చేసుకోవాలి. పరోఠాల్లా ఒత్తుకోవాలి
4. స్టౌ మీద పాన్ పెట్టి, కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో వత్తుకొన్న పరోఠాను తవా మీద వేసి రెండు వైపులా కాల్చుకోవాలి.
5. రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ కాల్చుకొని, తర్వాత ప్లేట్ లోకి మార్చుకోవాలి. అంతే రుచికరమైన బార్లీ పరోఠా రెడీ.

English summary

Healthy Barley Paratha Recipe For Diabetics

Diabetics have only a minimum dishes to enjoy and one of them is this yummy barley paratha. For those of you who love parathas and suffering from diabetes, then this is a perfect breakfast recipe to try out.
Story first published: Wednesday, January 7, 2015, 10:13 [IST]
Desktop Bottom Promotion